కరోనా సోకిన వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే...
పురుషుల వీర్యం లేదా వృషణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు ఆధారాలేమీ లేవని తేలింది.
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వైరస్ అంటు వ్యాధి అని.. కేవలం ముట్టుకున్నా.. తుమ్మినా, దగ్గినా ఇతరులకు పాకేస్తుందన్న విషయం మనకు తెలిసిందే.
అయితే.. ఈ వైరస్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. శృంగారం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనిపై చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేశారు కూడా.
కాగా.. తాజాగా ఈ విషయంపై చైనా, అమెరికా దేశాలు పరిశోధనలు ప్రారంభించాయి. శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందకపోవచ్చని తమ పరిశోధనలో తేలినట్లు చైనా, అమెరికా దేశాలు ప్రకటించాయి.
పురుషుల వీర్యం లేదా వృషణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు ఆధారాలేమీ లేవని తేలిలంది.
ఎబోలా, జికా, కొత్తగా పుట్టుకొచ్చిన ఇతర వైరస్ ల తరహాలో కోవిడ్-19 కారక ‘సార్స్-కోవ్-2’ కూడా శృంగారం ద్వారా వా్యప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు.
దీనిలో భాగంగా చైనా 34మంది రోగుల వీర్యం నమూనాలను పరిశీలించింది. వీటిలో వైరస్ కనిపించలేదు. అయితే.. వీర్యం తయారయ్యే వృషణాల్లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించలేదని నిర్థారణ చేయాల్సి ఉందని చెప్పారు.
ఈ అంశంపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు ఆరోగ్యవంతులైన యువకులకు సంబంధించిన సింగిల్ సెల్ ఎంఆర్ఎన్ఏ నుంచి సేకరించిన మునుపటి వృషణాల్లోని కణాల్లో ప్రోటీన్ల తయారీకి ఈ ఎంఆర్ ఎన్ఏ వీలు కల్పిస్తుంది.
అందులో కరోనాతో ముడిపడిన ఏసీఈ-2, టీఎంపీఆర్ఎస్ఎస్ 2 జన్యువులపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఇవి రిసెప్టార్లలా పనిచేస్తూ కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశానికి వీలు కల్పిస్తాయి.
ఈ రెండు రిసెప్టార్లు ఒకే కణంలో ఉంటేనే వైరస్ సమర్థవంతంగా లోపలికి ప్రవేశిస్తుంది. అయితే 6500 వృషణ కణాలకుగాను నాలుగింటిలోనే ఈ ఫ్రోటీన్లు ఉత్పత్తి చేసే జన్యువులు ఉన్నాయని తేలింది. అందువల్ల మానవ వృషణ కణాల్లోకి ఈ వైరస్ ప్రవేశించే అవకాశం లేదన్నారు.
దీంతో కరోనా సోకిన వ్యక్తి కోలుకున్న తర్వాత ఎలాంటి సంకోచం లేకుండా శృంగారంలో పాల్గొనవచ్చని వారు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందన్నారు.