సెక్స్ టైమింగ్ ను పెంచితే భావప్రాప్తి ఖాయం
శృంగారాన్ని ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరికీ వారి స్వంత మార్గం ఉంటుంది. అంటే కొంతమంది భాగస్వామిని హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి ఫోర్ ప్లే కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మరికొందరు వేర్వేరు సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేస్తుంటారు. అయితే సెక్స్ సమయాన్ని ఎలా పెంచొచ్చంటే?
చాలా మంది ఆడవారు తమ భాగస్వామి నుంచి సెక్స్ టైమింగ్ గురించి ఫిర్యాదులు చేస్తుంటారు. దీనివల్ల పురుషులు తమ సెక్స్ టైమింగ్ ను మెరుగుపరుచుకోవడానికి ఎన్నో చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. నిపుణుల ప్రకారం.. శృంగారానికి, ఆనందానికి నిర్ణీత సమయమంటూ ఉండదు. అయితే దీన్ని పెంచుకోవాలనుకుంటే కొన్ని సులువైన ట్రిక్స్ మీకు సహాయపడతాయి. సెక్స్ టైమింగ్ పెంచే కొన్ని ఈజీ ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సెక్స్ టైమింగ్, ఉద్వేగం కనెక్షన్ కు మధ్య సంబంధం ఏంటి?
ఎక్కువ టైమింగ్ కంటే మంచి టైమింగ్ ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం సెక్స్ ను టిక్ మార్క్ యాక్టివిటీగా చేసుకోకుండా అంగీకారంతో కొత్తగా ప్రయత్నించాలి. కమ్యూనికేషన్, ఫోర్ ప్లే, సరైన వాతావరణం మీ సెక్స్ సెషన్ ను మరింత ఆహ్లాదకరంగా మార్చుతాయి. నిజానికి టైమింగ్ ను పెంచడం వల్ల స్త్రీ పురుషులిద్దరూ సెక్స్ ను ఆస్వాదిస్తారు. అలాగే మహిళలు భావప్రాప్తి పొందడం మరింత సులువు అవుతుంది.
పొజీషన్ ను మార్చడం
ఒకే సెక్స్ పొజీషన్ లో పాల్గొంటే మీరు దీనిలో తక్కువ సమయం పాల్గొంటారు. అందుకే లైంగిక సమయాన్ని పెంచడానికి మీరు సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు పొజీషన్ ను మార్చండి. సెక్స్ పొజీషన్ ను మార్చడం వల్ల మీరు సెక్స్ ను ఎక్కువ సేపు ఆస్వాధిస్తారు. అలాగే మీ భాగస్వామి కూడా దీనిని ఆస్వాదిస్తారు.
ఫోర్ ప్లేకు సమయం
భావప్రాప్తి పొందడానికి మీ భాగస్వామి సమయాన్ని పెంచాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఫోర్ ప్లేలో పాల్గొనండి. కలయికకు ముందు ఆరోగ్యకరమైన ఫోర్ ప్లేలో పాల్గొనడం వల్ల మహిళలు భావప్రాప్తికి చేరుకోవడం సులువు అవుతుంది. ఇది పురుషులకు తగినంత సమయాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఎక్కువ సేపు సెక్స్ కాలాన్ని ఆస్వాదిస్తారు కూడా.
స్టార్ట్-స్టాప్ టెక్నిక్
ఎక్కువ సేపు శృంగారాన్ని ఆస్వాదించాలనుకునే పురుషులు సంభోగం సమయంలో స్టార్ట్ స్టాప్ టెక్నిక్ ను అవలంబించాలని నిపుణులు చెబుతున్నారు. ఒకే భంగిమలో ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడం వల్ల స్ఖలనం త్వరగా, సులభంగా జరుగుతుంది. అందుకే కొద్దిసేపు సెక్స్ లో పాల్గొన్న తర్వాత పురుషులు 10 నుంచి 20 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువసేపు సెక్స్ కు గ్యాప్ ఇవ్వాలి. తర్వాత మళ్లీ ప్రారంభించాలి. ఇది పురుషులను ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనేలా చేస్తుంది. అలాగే మహిళలు భావప్రాప్తికి చేరుకోవడాన్ని కూడా సులభం చేస్తుంది.
ధూమపానం చేయొద్దు
సిగరెట్లు, స్మోకింగ్ రక్తపోటును పెంచుతాయి. దీంతో మీకు హృదయ సంబంధ వ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు స్మోకింగ్ అంగస్తంభన సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది లైంగిక సమయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీ భాగస్వామికి కూడా అలాంటి సమస్య ఉంటే.. ముందుగా సిగరేట్ మానేయమని వారికి చెప్పండి.
కమ్యూనికేషన్ అవసరం
సెక్స్ సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల కూడా మీ సెక్స్ సమయం పెరుగుతుంది. అలాగే ఇద్దరూ మంచి లైంగిక ఆనందాన్ని పొందుతారు. ఏది ఇష్టమో, ఏది నచ్చదో ఒకరికొకరు చెప్పుకోండి. ఇది కాకుండా మీరు ఏ సమయంలో మంచి అనుభూతి చెందుతున్నారో చెప్పడం వల్ల కూడా మీ సెక్స్ టైమింగ్ పెరుగుతాయి. ఇది ఆరోగ్యకరమైన భావప్రాప్తికి చేరుకోవడాన్ని సులువు చేస్తుంది.
ఆయుర్వేద మూలికలు
షిలాజిత్ సెక్స్ ను ఎక్కువ సేపు ఆస్వాదించడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఎన్నో ప్రత్యేక ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇది పురుషుల్లో లైంగిక ప్రేరేపణను పెంచుతుంది. అలాగే లైంగిక సమయాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనొచ్చు. షిలాజిత్ ను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.దీంతో మీ భాగస్వామి సెక్స్ లో పాల్గొన్నప్పుడు వేరే దేని గురించి ఆలోచించరు. అలాగే ఇది మీ సమయాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.