రిలేషన్ అంటే.. మూడు ముద్దులు, నాలుగు హగ్గులు కాదు..!
దంపతుల మధ్య ఏవైనా తేడాలు వచ్చాయి. గొడవలు అవుతున్నాయి అంటే... వారిద్దరూ ఒక విషయాన్ని విభిన్న కోణాల్లో ఆలోచించడం కూడా ఒక కారణం కావచ్చు.
ప్రేమలో పడటానికి.. ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకోవడానికి చాలా మంది అత్యుత్సాహం చూపిస్తుంటారు. తాము సింగిల్ గా ఉన్నామనే భావనతో ఎప్పుడెప్పుడు రిలేషన్ లోకి అడుగుపెడదామా అని.. ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే.. రిలేషన్ లోకి వెళ్లడం అంటే.. కేవలం మూడు ముద్దులు, కౌగిలింతలు మాత్రమే కాదని నిపుణులు చెబుతున్నారు.
ఒకరితో రిలేషన్ ప్రారంభించే ముందు అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. రిలేషన్ లో ఉండాలంటే.. ఒకరిపై మరొకరికి నమ్మకం, అవగాహన కచ్చితంగా ఉండాలి. అలా లేకపోతే.. అన్నీ సమస్యలే తప్ప.. ఆనందాలు ఉండవు.
దాదాపు.. దంపతుల మధ్య ఏవైనా తేడాలు వచ్చాయి. గొడవలు అవుతున్నాయి అంటే... వారిద్దరూ ఒక విషయాన్ని విభిన్న కోణాల్లో ఆలోచించడం కూడా ఒక కారణం కావచ్చు.
మరి ఆ గొడవలు రాకుండే ఉండేందుకు ఏం చేయాలి అంటే... మీరు.. మీ భాగస్వామికి ఏదైనా విషయంలో గొడవ జరిగితే... ప్రతిసారీ మీ కోణంలోనే ఆలోచించకుండా.. మీ భాగస్వామి కోణంలో కూడా ఆలోచించడం మొదలుపెట్టాలి. నిజంగా మీరు ఎదుటివారిని ప్రేమించినట్లయితే.. వారు ఏ విషయాన్ని ఎలా ఆలోచిస్తారనే విషయంలో అవగాహన పెంచుకోవాలాి.
ఇక .. చాలా మంది చాలా సులభంగా ప్రేమలో పడిపోతారు. కనీసం ఎదుటి వారి గురించి ఏమీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండే.. వారంటే తమకు ప్రాణం అంటూ చెప్పేస్తుంటారు.
అయితే.. ఆ తర్వాత వారి గురించి పూర్తిగా తెలియడం వల్ల.. అది మీకు నచ్చకుంటే.. తేడాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంత త్వరగా రిలేషన్ లోకి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
కొందరు తమ సెల్ఫీష్ కారణాల వల్ల కూడా రిలేషన్ లోకి అడుగుపెట్టాలని అనుకుంటారు. ఎప్పుడైతే తాము బాధలో ఉన్నామని భావించేవారు.. ఒంటరిగా ఉండలేక.. వెంటనే ఎవరితో ఒకరితో రిలేషన్ పెట్టుకోవాలని అనుకుంటారట. అలాంటి వారు భవిష్యత్తులో ఇతర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందట.
ఏ బంధంలోనూ.. వీరు పర్ఫెక్ట్ అనేవారు అంటూ ఎవరూ ఉండరు. ఎంత మంచివారైనా.. ఎంత డీసెంట్ గా ఉన్నవారైనా ఏదో ఒక సమయంలో కోపం తెచ్చుకోవడం సహజం. అలాంటి సమయంలో అర్థం చేసుకోవాలే తప్ప.. ఆవేశపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎవరైనా సరే.. తమ జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే... ఒకరి తప్పులను మరొకరు అర్థం చేసుకోవాలి. ఎక్కువ క్షమించే గుణం ఉన్నవారే ఎక్కువ ఆనందంగా ఉంటారట.