అనుమానపు మొగుడు.. పడక గదిలో బూతులు తిడుతూ..
తనలో సామర్థ్యం తగ్గిపోయినా కూడా... అందుకు కూడా భార్యే కారణమని భావిస్తుంటారు. పెళ్లికి ముందు తాను పులిలా ఉండేవాడినని.. నిన్ను కట్టుకున్నాకే ఇలా తయారయ్యానంటూ నిష్టూరమాడుతుంటారు.
కొంతమంది భార్య, భర్తలు తరచూ గొడవపడుతూ ఉంటారు. కారణం ఏదైనా దాన్ని భార్యతో లింకు పెట్టి ఆమెను వేధిస్తుంటారు కొందరు భర్తలు.
పిల్లలు చదువుకోకపోయినా, కుళాయిలో నీళ్లు రాకపోయినా, పప్పులో ఉప్పు తక్కువైనా, కూరలో కారం ఎక్కువైనా ఇలా కారణం ఏదైనా... దానిని పడకగదికి ఆపాదించి తిట్టేస్తూ ఉంటారు.
తనలో సామర్థ్యం తగ్గిపోయినా కూడా... అందుకు కూడా భార్యే కారణమని భావిస్తుంటారు. పెళ్లికి ముందు తాను పులిలా ఉండేవాడినని.. నిన్ను కట్టుకున్నాకే ఇలా తయారయ్యానంటూ నిష్టూరమాడుతుంటారు.
దీనిపై కొందరు నిపుణులు జరిపిన సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
భర్తలు తమలో ఉన్న లోపాన్ని భార్య ఎక్కడ ఎత్తిచూపుతుందో అనే భయంతో... ముందుగానే ఏదో ఒక కారణంతో ఆమెను తిట్టిపోస్తూ ఉంటారట.
భర్తలు తమలో ఉన్న లోపాన్ని భార్య ఎక్కడ ఎత్తిచూపుతుందో అనే భయంతో... ముందుగానే ఏదో ఒక కారణంతో ఆమెను తిట్టిపోస్తూ ఉంటారట.
నిజానికి, ఆత్మన్యూనతతో బాధపడేవారే జీవితభాగస్వామి మీద నోరు పారేసుకుంటారు. తమలోని సవాలక్ష లోపాల్ని కప్పిపుచ్చుకోడానికి, నెపాన్ని ఆ అమాయకురాలి మీదికి నెట్టేస్తుంటారు.
అటు తల్లిగా, ఇటు ఉద్యోగినిగా, మధ్యలో భార్యగా అన్ని బాధ్యతలకూ సమన్యాయం చేస్తున్న ఇల్లాలిని ప్రేమించకపోగా... నిందలు వేయడం న్యాయం కాదంటున్నారు.నిజమే, జీవితభాగస్వామిలో మనకు నచ్చే లక్షణాలు ఉంటాయి. నచ్చనివీ ఉంటాయి.
ఆ అసంతృప్తి పడకగదికి కూడా విస్తరించి ఉండవచ్చు. శృంగారంలో ప్రతి కదలికనూ ఆమె ఆస్వాదించాలనీ, ఆస్వాదిస్తున్నట్టు కనిపించాలనీ, ఆ తమకం తనకు వినిపించాలనీ అతడు కోరుకోవచ్చు.
కొన్నిసార్లు ఆమే చురుకైన పాత్ర పోషించాలనే కోరిక కూడా ఉండొచ్చు తప్పులేదు.స్త్రీ సహజమైన బిడియం వల్లో, ఇంకేవో కారణాలతోనో ఆమె అలా నడుచు కోలేకపోవచ్చు.
అలాంటప్పుడు.. వేధింపులతోనో, విమర్శలతోనో జీవిత భాగస్వామి మనసును గాయపరచడం సరికాదు. ప్రేమగా చెబితే వారే మీకు నచ్చినట్లుగా ఉంటారన్న విషయం గ్రహించాలి.
మనసులోని మాట... నేర్పుగా చెప్పాలి. ముద్దుగా బతిమాలాలి. ప్రేమగా ఒప్పించాలి. అపోహలుంటే తొలగించాలి. భయాలుంటే పోగొట్టాలి.