కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్.. సెక్స్ లైఫ్ ఎలా ఉంటుంది..?
ఇలాంటి ఏజ్ గ్యాప్ దంపతులది ఒకవైళ లవ్ మ్యారేజ్ అయ్యి ఉండి.. దాని కోసం వాళ్లు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందనుకుంటే అప్పుడు కూడా కామెంట్స్ ఎక్కువగా వినపడతాయి.
పెళ్లి బంధం.. ఇద్దరు మనుషులను ఒకటి చేస్తుంది. రెండు కుటుంబాల మధ్య బంధుత్వాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడంటే.. వధూవరులకు ఏజ్ గ్యాప్ పెద్దగా ఉండటం లేదు. మహా అంటే రెండు, మూడు సంవత్సరాల తేడాతో చేసేసుకుంటున్నారు. లేదంటే.. సేమ్ ఏజ్ వాళ్లనే చేసుకుంటున్నారు.
అయితే.. ఎక్కడో ఒకచోట మాత్రం కనీసం పది పన్నెండు సంవత్సరాల తేడాతో పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే.. ఇలా ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకునే దంపతుల మధ్య సంసారం ఎలా సాగుతుంది..? వారి దాంపత్య జీవితం సజావుగానే సాగుతుందా..? ఏవైనా సమస్యలు వస్తాయా..? దీనిపై నిపుణులు చేసిన సర్వేలో ఏం తేలిందో చూద్దాం..
ఇలా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న దంపతులపై చాలా మంది ఈజీగా కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. అంతేకాదు వారిని ఎక్కువగా జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇక వారి శృంగార జీవితంపై ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి
అతని వయసు ఎక్కువగా ఉండి.. ఆమె వయసు చిన్నగా ఉంటే.. మరింత ఎక్కువగా వినపడతాయి. వారు శృంగార జీవితాన్ని ఆస్వాదించలేరనే భావన కలిగేలా కామెంట్స్ చేస్తారు. వారికి వినపడేలా.. మనసు బాధపెట్టేలా చేసేవారు కూడా చాలా మంది ఉంటారు.
ఇలాంటి ఏజ్ గ్యాప్ దంపతులది ఒకవైళ లవ్ మ్యారేజ్ అయ్యి ఉండి.. దాని కోసం వాళ్లు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందనుకుంటే అప్పుడు కూడా కామెంట్స్ ఎక్కువగా వినపడతాయి. వారిని కామెంట్ చేయడానికి వచ్చే ఎలాంటి అవకాశాన్ని వారు వదులుకోవాలని వారు అనుకోరు.
భార్యపై భర్తకు అనుమానం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భర్త ముసలోడు అయిపోయి.. అమ్మాయి ఇంకా యంగ్ గా ఉంటే.. ఈ రకమైన అనుమానాలకు కారణమౌతాయి. వీరి మధ్య అలాంటి సమస్యలను కావాలని సృష్టించేవారు కూడా మన సమాజంలో చాలా మంది ఉన్నారు.
వయసు వ్యాత్సాసం ఎక్కువగా ఉన్నవారిలో.. జెనరేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. దీంతో.. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయలు వచ్చే అవకాశం ఉంది.
సెక్స్ విషయంలోనూ వీరు దానిని పూర్తిగా ఆస్వాదించలేరు. ఈ విషయంలో వీరికి ఎక్కువగా తేడాలు వచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే.. కాలక్రమేణా.. ఇద్దరిలో పెద్దవారికి సెక్స్ మీద కోరికలు తగ్గిపోతుంటాయి. కానీ.. చిన్నవారికి మాత్రం సెక్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. దీంతో.. వారు ఆ సమయంలో ఆస్వాదించలేరు.
దీంతో.. వారిలో ఒకరు మరో వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి.. మరీ ఎక్కువ ఏజ్ గ్యాప్ తో పెళ్లిళ్లు చేసుకోవడం అంత కరెక్ట్ ఏమీ కాదు.