సెక్స్ తర్వాత.. ఇలాంటి పనులు చేయకూడదు తెలుసా?
. సెక్స్ తర్వాత.. ప్రైవేట్ పార్ట్స్ చాలా సున్నితంగా మారతాయి. కాబట్టి.. వెంటనే వాష్ చేకూడదు. కాసేపు ఆగి చేయాలి. కావాలంటే.. సెక్స్ తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేస్తే.. బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.
sex-secrets
శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. శక్తినంతటినీ ఉపయోగించి.. ఆనందంతో.. సెక్స్ ని ఆస్వాదించిన తర్వాత.. కొందరు.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. శృంగారంలో పాల్గొన్న తర్వాత.. కచ్చితంగా.. చేయాల్సినవీ, చేయకూడనివీ ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దామా..
సెక్స్ లో పాల్గొన తర్వాత.. శరీరం అలసిపోతుంది. దీంతో.. కాసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాం. అయితే... కలయిక తర్వాత... చాలా మంది వెంటనే తమ ప్రైవేట్ పార్ట్స్ కడిగేస్తూ ఉంటారు. ముఖ్యంగా.. సోప్, బాడీ వాష్ లాంటి వాటితో కడిగేస్తూ ఉంటారు.
అవి మీ పీహెచ్ స్థాయిలను నాశనం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సెక్స్ తర్వాత.. ప్రైవేట్ పార్ట్స్ చాలా సున్నితంగా మారతాయి. కాబట్టి.. వెంటనే వాష్ చేకూడదు. కాసేపు ఆగి చేయాలి. కావాలంటే.. సెక్స్ తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేస్తే.. బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.
చాలా మంది సెక్స్ టాయ్స్ వినియగిస్తూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ.. వాటిని ఉపయోగించిన తర్వత.. చాలా మంది శుభ్రం చేయరు. మీరు మీ శరీరాన్ని శుభ్రం చేసినట్లే, మీ సెక్స్ టాయ్‌లను ఉపయోగించిన తర్వాత వాటిని కూడా శుభ్రం చేసుకోండి. అలా శుభ్రం చేయకపోతే.. మరోసారి ఉపయోగించినప్పుడు.. మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. గోరు వెచ్చని నీటితో.. పీహెచ్ విలువలు తక్కువగా ఉండే.. సబ్బు ఉపయోగించి శుభ్రం చేయాలి.
winter_sex
ఇక కొందరు సెక్స్ తర్వాత.. ఇక పని అయిపోయినట్లు.. పార్ట్ నర్ పట్టించుకోరు. కానీ.. నిజానికి అలా చేయకూడదట. కలయిక తర్వాత.. ఇద్దరూ కాసేపు కలిసి సమయం గడపాలి. ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం.. కౌగిలించుకోవడం లాంటివి చేయాలి. అప్పుడు.. వారి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది.
winter_sex
సెక్స్ తర్వాత మీ శరీరాన్ని ఊపిరి పీల్చుకోనివ్వాలి. బిగుతు దుస్తులు ధరించకూడదు. తేలికపాటి టీ-షర్టు, పైజామా లేదా నైట్ డ్రెస్ లేదా బాక్సర్లను ధరించండి, బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే.. రాపిడి ఏర్పడి.. బ్యాక్టీరియా తయారౌతుంది.
కొందరు.. కలయిక తర్వాత.. వెంటనే ఫోన్ లోకి దూరిపోతారు. అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.సెక్స్ తర్వాత బాహ్య ప్రపంచాన్ని మరచిపోండి. మీరు హాట్, సన్నిహిత సెషన్‌ను కలిగి ఉన్న వెంటనే మీ ఫోన్ లేదా టీవీని తనిఖీ చేయవద్దు. కాసేపు సరదాగా.. మీ పార్ట్ నర్ తో గడపేందుకు ప్రయత్నించండి.