పెళ్లైన కొత్తలో అందరూ చేసే పొరపాట్లు ఇవే..!
ఏదో ఒక పని ఉంది అని చెప్పి... దంపతులు తాము గడపాల్సిన సమయాన్ని వృథా చేస్తున్నారు. దీంతో... తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి.
bride, wedding,
పెళ్లైన కొత్తలో చాలా మంది దంపతులు చేసే మొదటి పొరపాటు... కమ్యూనికేషన్ లేకపోవడం. అవసరమైన సమయంలో దాదాపు అందరూ.. మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను మాట్లాడుకోరు. అలా మాట్లాడుకోకపోవడం వల్ల.. తర్వాత... వారి మధ్య గొడవలు,బేధాభిప్రాయలు వస్తూ ఉంటాయి.
bride
ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన కొత్తలో సైతం దంపతులు క్వాలిటీ టైమ్ గడపడం లేదు. ఏదో ఒక పని ఉంది అని చెప్పి... దంపతులు తాము గడపాల్సిన సమయాన్ని వృథా చేస్తున్నారు. దీంతో... తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి.
వ్యక్తిగత ఆసక్తులను చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏమనుకుంటారో అని.... చాలా మంది తమ అలవాట్లను షేర్ చేసుకోరు. ఆ తర్వాత... ఆ అలవాట్లు తెలియడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
ఇక.. ఆర్థిక విషయాలు కూడా... దంపతులు మధ్య తర్వాత సమస్యలకు కారణమౌతున్నాయట. భవిష్యత్తులో ఫైనాన్షియల్ గోల్స్ గురించి మాట్లాడుకోకపోవడం, ఆర్థిక విషయాల్లో పారదర్శకంగా ఉండకపోవడం కూడా పెద్ద పొరపాటు.
ఇక.. పెళ్లైనకొత్తలో చాలా మంది తమ పార్ట్ నర్ కి ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకునేలా ప్రవర్తిస్తారు. దీని వల్ల... భవిష్యత్తులో సమస్యలు రావడానికి కారణమౌతాయి. ముందు నుంచి రియలిస్టిక్ గా ఉంటే ఆ సమస్యలు రావు.
దంపతుల మధ్య రొమాన్స్, శారీరక బంధం బలంగా ఉండేలా చూసుకోవాలి. దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల.. తర్వాత సమస్యలు వస్తాయి అనే విషయాన్ని తొందరగా గుర్తించరు. ఈ సమయంలోనే దంపతుల మధ్య బంధం బలపడేలా చూసుకోవాలి.