అల్లుడి పోర్న్ పిచ్చితో విసిగిపోయి.. అత్తింటివారు ఏం చేశారంటే..
అతను పోర్న్ చూస్తున్నాడని..అతని అత్తింటి వారు అతని పట్ల మరింత కలర్కశంగా ప్రవర్తించారు.
ఈ మధ్యకాలంలో యువతకు సినిమా చూడటం ఎలాగో.. అశ్లీల చిత్రాలు చూడటం కూడా అంతే సర్వసాధారణం అనుకునే రకం. అందులోనూ ప్రస్తుతం లాక్ డౌన్ అములులో ఉండటంతో విపరీతంగా ఖాళీగా ఉంటున్నారు.
ఫోన్ లో ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో.. అదే పనిగా పోర్న్ చిత్రాలు వీక్షిస్తున్నారు. అయితే.. అలా చూడటమే ఓ యువకుడి పట్ల యమపాశమైంది. అతను పోర్న్ చూస్తున్నాడని..అతని అత్తింటి వారు అతని పట్ల మరింత కలర్కశంగా ప్రవర్తించారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌లోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి జోబాయ్ కుమార్తె(30) చెన్నైలోని ఆర్కేనగర్కు చెందిన కార్కి అనే వ్యక్తిని కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నత్తిరవిళైలో నివాసముంటూ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. బుధవారం కార్కి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై పోలీసులు అతడి భార్యను విచారించగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పింది.
అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు డెడ్‌బాడీకి పోస్టుమార్టం నిర్వహించగా హత్యగా తేలింది.
దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోతుగా విచారింగా తండ్రి బోబాయ్, తమ్ముడు జస్టస్లు తన భర్తను కొట్టి చంపినట్లు తెలిపింది.
తన భర్త పరాయి మహిళలతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవాడని, సెల్ఫోన్లో పోర్న్ వీడియోలు వీక్షణకు బానిసయ్యాడని తెలిపింది.
పద్ధతి మార్చుకోవాలని తాను ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వేధించడంతో తన కుటుంబసభ్యులకు బాధ చెప్పుకున్నానని, దీంతో తన తండ్రి, తమ్ముడు బుధవారం కార్కితో మాట్లాడారని చెప్పింది.
ఈ సందర్భంగా గొడవ జరగడంతో తమ కుటుంబసభ్యులు కార్కిని తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించింది.
దీంతో పోలీసులు కార్కి భార్య, మామ, బావమరిదిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.