మేకప్ సెక్స్ లో పాల్గొంటే ఏమౌతుందో తెలుసా?
భార్యాభర్తలు రెండు రెండు విధాలుగా ప్రవర్తిస్తారు. కొంతమంది దంపతులు కొట్లాట లేదా గొడవ జరిగినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేస్తారు. కానీ కొంతమంది గొడవ జరిగినప్పుడు కోపం పోవడానికి సెక్స్ మార్గాన్ని అవలంబిస్తారు. కానీ ఈ సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఏమౌతుందో తెలుసా?
మీకు రొమాంటిక్ సినిమాలంటే ఇష్టమా? అయతే అందులో భార్యాభర్తలు గొడవపడి, ఒకరిపై ఒకరు అరుచుకోవడం చూసే ఉంటారు. అంతేకాదు. కొంతసేపటి తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. ఈ ముద్దు నేరుగా వారి పడకగదికి వెళ్తుంది. ఇలాంటిదంతా సినిమాల్లోనే కాదు కొంతమంది పురుషులు రియల్ లైఫ్ లో కూడా చేస్తుంటారు. దీన్నే మేకప్ సెక్స్ అంటారు.
మేకప్ సెక్స్ అంటే ఏంటి?
అర్థమయ్యేట్టు చెప్పాలంటే.. మేకప్ సెక్స్ అనేది లైంగిక సాన్నిహిత్యాన్ని వివరించడానికి ఉపయోగించే అనధికారిక పదం. దంపతుల మధ్య గొడవల తర్వాత జరిగే శృంగారం అన్న మాట. భార్యాభర్తల మధ్య గొడవల తర్వాత రిలాక్స్ అయ్యేందుకు ఇదొక మార్గంగా ఉపయోగపడుతుంది. కానీ దీనివల్ల కూడా భార్యాభర్తల మధ్య సమస్యలొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మేకప్ సెక్స్ బ్రేకప్ సెక్స్ తో సమానమా?
కాదు.. బ్రేకప్ సెక్స్ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఒక జంట వారి సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నప్పుడు, శృంగార మార్గంలో విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ఇందులో ఉంటుంది.
అంతేకాక బ్రేకప్ సెక్స్ వివిధ భావోద్వేగాల ద్వారా నడపబడుతుంది. ఇందులో విడిపోవడానికి ముందు చివరిసారిగా సాన్నిహిత్యాన్ని వ్యక్తపరుస్తారు. బ్రేకప్ భావోద్వేగ సమస్యలను ఎదుర్కోవటానికి దీన్ని ఒక మార్గంగా భావిస్తారు కూడా. కాగా భార్యాభర్తల మధ్య గొడవ తర్వాత ఇద్దరూ మళ్లీ నార్మల్ గా ఉండేందుకు మేకప్ సెక్స్ లో పాల్గొంటారని నిపుణులు అంటున్నారు.
మేకప్ సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
నమ్మకాన్ని పెంపొందిస్తుంది
నిపుణుల ప్రకారం.. సెక్స్ లో పాల్గొనడం ఒక ఆకర్షణీయమైన అనుభవం. ఇది ఇద్దరి మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అలాగే దంపతులకు సంతోషకరమైన భవిష్యత్తు కోసం ఆశను కలిగిస్తుంది. నమ్మకాన్ని తిరిగి పొందడం లైంగిక భావాలను కూడా పెంచుతుంది. ఎందుకంటే ఎక్కువ భద్రతా సాన్నిహిత్యం సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. కానీ ఇది ఎప్పుడూ ఇలాగే ఉండకపోవచ్చు.
డోపామైన్, ఆక్సిటోసిన్
సెక్స్ లో పాల్గొన్నప్పుడు మెదడు ఆక్సిటోసిన్, డోపామైన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆక్స్ఫర్డ్ అకడమిక్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఇవి సంతృప్తికరమైన, ఆహ్లాదకరమైన, ఓదార్పు అనుభూతిని కలిగిస్తాయి.ఇవి ఉద్వేగం దశలలో మాత్రమే కాకుండా సంభోగం సమయంలో కూడా విడుదలవుతాయి. మేకప్ సెక్స్ హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
యుద్ధం ముగుస్తుంది
సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ మూడ్ మారుతుంది. అలాగే భావోద్వేగ సాన్నిహిత్యాన్ని కూడా పెంచుతుంది. పడకగదిలో సంఘర్షణ లేని క్షణాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల సంబంధంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
భాగస్వామి ఒత్తిడిని తగ్గిస్తుంది
భార్యాభర్తలిద్దరూ కలిసి మేకప్ సెక్స్ ను ఆస్వాదించినప్పుడు వారి మధ్య కోపం మటుమాయమవుతుంది. సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ మానసిక స్థితిలో సానుకూల మార్పులు వస్తాయి. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. శృంగారంలో పాల్గొనడం వల్ల ఆడవారిలో ఆందోళన, నిరాశ, ఒత్తిడి తగ్గిపోతాయి. అందుకే అనవసరమైన ఒత్తిడిని తగ్గించడానికి సెక్స్ ఒక ప్రభావవంతమైన మార్గం.
మేకప్ సెక్స్ మీ ప్రేమ, సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
మేకప్ సెక్స్ ఒకరికి మంచిదా? కాదా? అనేది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. కొంతమందికి విపరీతమైన కోపం ఉంటుంది. ఇలాంటి వారికి మేకప్ సెక్స్ పనిచేయదు. కానీ కొంతమందికి మాత్రం సంబంధంలో ఒత్తిడిని తగ్గించడానికి ఇది మంచి మార్గంగా ఉపయోగపడుతుంది. అయితే మీ రిలేషన్ షిప్ లో విభేదాలు వచ్చినప్పుడు మంచి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మేకప్ సెక్స్ జంటలను కొద్దిసేపు మాత్రమే శాంతపరుస్తుందని, దీర్ఘకాలికంగా వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. ఆరోగ్యకరమైన సంబంధం కోసం మాట్లాడుకోవడం, శారీరక సాన్నిహిత్యాన్ని సమతుల్యం చేయడం చాలా ముఖ్యం.
మేకప్ సెక్స్ దుష్ప్రభావాలు
సెక్స్ కమ్యూనికేషన్ ను భర్తీ చేయదు
శృంగారం సంభాషణకు ప్రత్యామ్నాయం కాదు. ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకోవడం, మాటలను వినడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి.
ప్రధాన సమస్యను విస్మరిస్తారు.
సెక్స్ తాత్కాలిక పరిష్కారం అయినప్పటికీ.. మీరు మీ అవసరాలు, కోరికలు, సమస్యలను పూర్తిగా పోగొట్టడానికి సమస్యలను పరిష్కరించాలి.