దేశమంతా లాక్ డౌన్... కండోమ్, సెక్స్ టాయ్స్ కి పెరిగిన డిమాండ్
ఈ క్రమంలో.. శానిటైజర్లు, మాస్క్ లకు ఎంత డిమాండ్ ఉందో.. కండోమ్, సెక్స్ టాయ్స్ కి కూడా అంతకు మించి డిమాండ్ పెరిగిందని ఓ సర్వేలో తేలింది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 18వేల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది వైరస్ సోకి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రుల్లో చావుతో పోరాడుతున్నారు.
దీంతో.. దేశ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలను ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో.. అందరూ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో.. శానిటైజర్లు, మాస్క్ లకు ఎంత డిమాండ్ ఉందో.. కండోమ్, సెక్స్ టాయ్స్ కి కూడా అంతకు మించి డిమాండ్ పెరిగిందని ఓ సర్వేలో తేలింది.
మునుపెన్నడూ లేని విధంగా 25 నుంచి 50 శాతం అమ్మకాలు పెరిగాయని ఆర్డర్లు పెంచుతున్నారట షాప్ రిటైలర్లు. 'సాధారణంగా ఒక్కో ప్యాక్‌లో 3 ఉండే దానిని కొనుగోలు చేసే వాళ్లంతా ఒకేసారి 10 నుంచి 20ప్యాకెట్లు తీసుకెళ్లిపోతున్నారు' అంటున్నారు రిటైలర్లు.
మాల్స్ షట్ డౌన్ అవడం మొదలైనప్పటి నుంచి కండోమ్ ల అమ్మకాలు పెరుగుతన్నాయి. వీటితో పాటు సెక్స్ టాయ్స్ కు కూడా ఆర్డర్లు వస్తున్నప్పంటికీ డెలివరీ ఏజెంట్లు కరువై అమ్మకాలు వాయిదా పడుతున్నాయట.
చాలా మంది సెలవలతో ఇళ్లల్లో ఉంటే.. కొందరు ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఖాళీ గా ఉండలేక సంసారం పై ఫోకస్ ఎక్కువ పెట్టారని అధికారులు అంటున్నారు.
ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తున్నా.. కుటుంబ నియంత్రణను మాత్రం మరిచిపోవడం లేదంటున్నారు విశ్లేకులు. బుధవారం పోర్న్ హబ్ సైట్ తమ వద్ద ఉన్న ప్రీమియం డేటాను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇవి కాక.. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు కూడా అందుబాటులో ఉండటంతో.. వాటిని చూస్తూ టైంపాస్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువయ్యిందని అధికారులు చెబుతున్నారు
వీటితో పాటు మలేరియా కి వాడే మందులు, విటమిన్ సీ కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కాగా.. భారత్ లో కండోమ్స్ ఎక్కువగా సిటీల్లోనే అమ్మడౌతుండటం గమనార్హం.
మరో విషయం ఏమిటంటే... వారానికి రెండు లేదా మూడుసార్లు శృంగారంలో పాల్గొంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో... కరోనాకి ఈ విధంగా చెక్ పెట్టొచ్చని పలువురు భావిస్తున్నారు. అందుకే కండోమ్స్ విపరీతంగా అమ్ముడౌతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 4లక్షల 23వేల 660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 18వేల 923మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో 582కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 11మంది ప్రాణాలు కోల్పోయారు. 41మంది రికవరీ కావడంతో డిశ్చార్జ్ అయ్యారు.