శృంగారంలో షెడ్యూల్.. భలే మజానిస్తుందట..!
చాలా మంది చాల పనులను ముందుగానే షెడ్యూల్ చేసుకుంటారు. కానీ సెక్స్ విషయంలో మాత్రం అలా చేయలేరు. కానీ.. నిజానికి అలా చేయడం వల్ల అసలు మజా రుచి చూసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే.. దానిని ఎలా ఆస్వాదించామనే విషయంలోనే అసలు మజా ఉంటుంది.
మనందరికీ ఏ పని ఎప్పుడు చేయాలనే ఓ ఐడియా ఉంటుంది. దాని ప్రకారమే చేసుకుంటూ వెళుతుంటాం. అందులో భాగంగా సెక్స్ అంటే.. కేవలం రాత్రి చేసే పనిలా భావిస్తుంటాం.
అంతెందుకు చాలా మంది చాల పనులను ముందుగానే షెడ్యూల్ చేసుకుంటారు. కానీ సెక్స్ విషయంలో మాత్రం అలా చేయలేరు. కానీ.. నిజానికి అలా చేయడం వల్ల అసలు మజా రుచి చూసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రోజూవారి అన్ని పనుల్లాగే శృంగారాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవడానికి అలారం ఎలా సెట్ చేసుకుంటామో, శృంగారానికి కూడా అలాగే అలారం సెట్ చేసుకోండని నిపుణులు సలహాలిస్తున్నారు. ఇలా శృంగారానికి షెడ్యూల్ చేసుకోవడం అనేది మీ భాగస్వామి తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని గుర్తు చేస్తుంది.
మన జీవితంలో సమయానికి ఉన్న ప్రాముఖ్యత తెలిసిందే. అందువల్లే, ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వారకు రోజూవారి పనులు పక్కా ప్రణాళికతో షెడ్యూల్ చేసుకుంటాం. అయితే, శృంగారం విషయంలో మాత్రం ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు రతి క్రీడలో మునిగిపోవాలని తహతహలాడుతుంటాం.
కానీ, అలా ఎప్పుడుపడితే అప్పడు రతి క్రీడలో మునిగిపోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల సంబంధాన్ని గొప్పగా కొనసాగించడానికి, మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢం చేసుకోవడానికి శృంగారాన్ని కూడా షెడ్యూల్ చేసుకోండని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా సంపూర్ణ ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను నిలుపుకోవడంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, మిగతా పనుల్లాగ మీ భాగస్వామితో శృంగారానికి షెడ్యూల్ చేయడం అంత ఉత్తేజకరమైనదిగా అనిపించకపోవచ్చు, కానీ, ఇది అద్భుతాలు చేస్తుంది! మీ క్యాలెండర్ లో తేదీ, సమయాన్ని షెడ్యూల్ చేసుకోవడం వల్ల మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆ సమయం కోసం ఉత్తేజంగా ఎదురుచూస్తారు.
తద్వారా, షెడ్యూల్ చేసిన సెక్స్ ద్వారా మీకు సంతృప్తి లభించి, మీ లైంగిక జీవితాన్ని ఉత్తమం చేస్తుంది. ఇలా శృంగారాన్ని షెడ్యూల్ చేయడం మొదట్లో కొంత విచిత్రంగా అనిపించవచ్చు, కాని దీన్ని ప్రయత్నించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు