ఇలా చేస్తే శృంగార కార్యంలో ఆందోళన అనేది ఉండదట!
యుక్త వయసులో ఉన్న యువతీ యువకులలో శృంగార కోరికలు (Erotic desires) కలగడం సర్వసాధారణం. వారు ఆ కార్యంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామని తహతహలాడుతుంటారు. కానీ వివాహం తరువాత ఆ తరుణం రాగానే వారిలో తెలియని ఆందోళన వారి కోరికలను తగ్గిస్తోంది. తొలిసారి శృంగారంలో (Romance) పాల్గొనే సమయంలో వారి మదిలో అనేక ప్రశ్నలు ఏర్పడతాయి.
భాగస్వామికి సంపూర్ణ అనుభూతిని అందిస్తామో లేదో అనే ఆలోచనలతో వారు ఒత్తిడికి (Stress) గురవుతారు. వారిలోని శృంగార కోరికలను చెబితే భాగస్వామి ఎలా స్పందిస్తుందో అని ఆందోళన (Anxiety) చెందుతారు. అయితే ఇలాంటి ఆందోళనను తగ్గించుకుని శృంగార కార్యాన్ని మరింత రసవత్తరంగా ఆస్వాదించడానికి శృంగార నిపుణులు చెప్పే కొన్ని నియమాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొందరు పురుషులు తాము లావుగా ఉన్నామని, మరికొందరు సన్నగా ఉన్నామని, వారి పురుషాంగం సైజు చిన్నగా ఉందని భాగస్వామికి సంతోషాన్ని అందించలేమని ఆలోచించి ఆందోళన చెందుతారు. ఇలా ఆందోళన కారణంగా మానసికంగా ఒత్తిడి (Stress) పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి కారణంగా అంగస్తంభన (Erection) సమస్యలు ఏర్పడతాయి.
కనుక ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ కార్యంలో పాల్గొనడానికి మానసికంగా సిద్ధంగా (Mentally ready) ఉండాలి. అప్పుడే వారు శృంగార జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు (Enjoy). మీకు చాలా ఒత్తిడి అనిపిస్తే కొంత సమయం గ్యాప్ తీసుకోవడం మంచిది. శృంగారం పైన ధ్యాస పెట్టి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ కార్యములో పాల్గొంటే ఆందోళన నుండి బయటపడవచ్చు.
శృంగారంలో పాల్గొనే సమయంలో నేరుగా కలవడానికి ప్రయత్నించకూడదు. భాగస్వామితో సరదాగా కాసేపు మాట్లాడుతూ శృంగార పూరితమైన కబుర్లు (Gossip) చెబుతూ ఆమెలో శృంగార భావాలను (Feelings) కలిగించాలి. ఇలా ఇద్దరూ ఆ కార్యంలో పాల్గొనడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఆ కార్యంలో ఇద్దరు కలిసి సంపూర్ణ అనుభూతిని పొందగలుగుతారు.
స్త్రీలు కూడా భాగస్వామిలో శృంగార కోరికలు పెంచడానికి తమవంతు ప్రయత్నం చేయాలి. అందమైన లోదుస్తులతో భాగస్వామి మదిలో లైంగిక కోరికలను (Sexual desires) పెంచడానికి ప్రయత్నించాలి. పడకగదిని అందంగా అలంకరించాలి. కలయికలో పాల్గొనే ముందు ఫోర్ ప్లే తప్పనిసరి. ఫోర్ ప్లే (Foreplay) చేస్తే సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి అయ్యి ఆ కార్యంలో మరింత రెచ్చిపోతున్నారు.
స్త్రీలలో సున్నితమైన భాగాలను టచ్ చేస్తూ, ముద్దులతో మత్తెక్కించాలి. గట్టిగా ఆమెను కౌగలించుకుని (Hug) ఆ కార్యంలో పాల్గొంటే ఇక మీరు స్వర్గపు అంచుల దాకా వెళ్ళిన అనుభూతి పొందగలుగుతారు. మీరు రతి మన్మథుడిలా (Cupid) ఆ కార్యంలో రెచ్చిపోయే భాగస్వామికి సంపూర్ణ అనుభూతిని ఇవ్వగలుగుతారు.
శరీరము దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే మీ మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. కనుక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజు అరగంటపాటు వ్యాయామం (Exercise) తప్పనిసరి. వ్యాయామం కూడా శరీరంలో సెక్స్ హర్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. కనుక ఆరోగ్యంగా ఉంటూ ఆందోళనను తగ్గించుకుని ఆ కార్యంలో పాల్గొంటే ఆ మధురమైన క్షణాలను (Sweet moments) మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు.