కరోనా వేళ శృంగారమా... అలాంటి వారితోనే సురక్షితం
జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకుండా ఉండటమే మంచిది.
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వైరస్ అంటు వ్యాధి అని.. కేవలం ముట్టుకున్నా.. తుమ్మినా, దగ్గినా ఇతరులకు పాకేస్తుందన్న విషయం మనకు తెలిసిందే.
అయితే.. ఈ వైరస్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. శృంగారం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనిపై చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేశారు కూడా.
కాగా.. తాజాగా ఈ విషయంపై చైనా, అమెరికా దేశాలు పరిశోధనలు ప్రారంభించాయి. శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందకపోవచ్చని తమ పరిశోధనలో తేలినట్లు చైనా, అమెరికా దేశాలు ప్రకటించాయి.
అయితే.. మరో పరిశోధనలో పురుషుల వీర్యంలోనూ కరోనా వైరస్ ని గుర్తించినట్లు తేలింది. దీంతో.. అసలు శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అనే విషయంపై మరో అనుమానం కలిగింది.
కాగా.. దీనిపై నిపుణులు పలు సూచనలు చెబుతున్నారు. కరోనా కాలంలో అసలు శృంగారంలో పాల్గొనవచ్చా లేదా.. పాల్గొంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
కరోనా శృంగారం వల్ల రాదన్న విషయం మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ఒక వేళ మీ భాగస్వామికి కరోనా లక్షణాలు ఉంటే.. వారితో సన్నిహితంగా మెలగడం, ముద్దులు పెట్టుకోవడం వల్ల మీకు కూడా కరోనా వచ్చే అకవాశం ఉంది.
కరోనా లక్షణాలు ఉంటే మాత్రం శృంగారానికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముద్దులకైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకుండా ఉండటమే మంచిది.
వేరే ప్రాంతాల్లో ఉండి వచ్చినవారు కాకుండా.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటే.. ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించకుంటే.. ఎలాంటి సందేహం లేకుండా శృంగారంలో పాల్గొనవచ్చు.
ఒక వేళ మీ భాగస్వామిలో కరోనా లక్షణాలు కనపడితే.. ఇద్దరూ కలయికకు దూరంగా ఉంటూ.. వేర్వేరు గదుల్లో పడుకోవడమే ఉత్తమం.
చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ.. వైరస్ దరి చేరకుండా జాగ్రత్తగా ఉండే భాగస్వామితో మాత్రమే శృంగార జీవితం ఆనందంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
కలయిక సమయంలో కండోమ్ వాడటమే సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.