లాక్ డౌన్ లో ఉద్యోగం పోవడంతో సెక్స్ వర్కర్ గా మారిన భర్త
ఉద్యోగం లేకపోతే.. కుటుంబాన్ని పోషించడం కుదరదు. దీంతో.. దాని కోసం అతను సెక్స్ వర్కర్ గా మారాడు. అయితే.. భార్యకు ఉద్యోగం దొరికిందని చెప్పాడు కానీ.. అతను చేస్తున్న ఉద్యోగం ఏంటో మాత్రం చెప్పలేదు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. గతేడాది చాలా దేశాల్లో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ కూడా విధించారు. అలా లాక్ డౌన్ విధించినన దేశాల్లో భారత్ కూడా ఉంది. మన దేశంలో దాదాపు మూడు నెలల పాటు.. లాక్ డౌన్ విధించారు.
అయితే.. ఈ లాక్ డౌన్ చాలా మంది జీవితాల్లో మార్పులు తీసుకువచ్చింది. కరోనా వైరస్ కంటే కూడా.. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు కోకొల్లలు. తర్వాత వారి జీవితాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా కాలమే పట్టింది. అయితే.. ఈ లాక్ డౌన్ లోనే ఉద్యోగం కోల్పోయిన ఓ యువకుడు.. కుటుంబ పోషణకు ఓ నిర్ణయం తీసుకున్నాడు. అయితే.. అతను తీసుకున్న నిర్ణయం తాజాగా భార్యకు తెలియడంతో.. ఆమె విడాకులు సిద్ధమైంది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన ఓ యువకుడికి పెళ్లయ్యింది. నగరంలోని ఓ బీపీవో కాల్ సెంటర్ లో ఉద్యోగం చేసేవాడు. అదే కాల్ సెంటర్ లో అతనికి ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తే ప్రేమగా మారడంతో.. 2017లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
వారి జీవితం చాలా ఆనందంగా సాగుతున్నసమయంలో.. అనూహ్యంగా వచ్చిన కరోనా లాక్ డౌన్ కారణంగా అతనికి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోతుందని అతను ఊహించలేదు. ఆ సమయంలో మళ్లీ ఎలాంటి ఉద్యోగం కూడా దొరకలేదు.
ఉద్యోగం లేకపోతే.. కుటుంబాన్ని పోషించడం కుదరదు. దీంతో.. దాని కోసం అతను సెక్స్ వర్కర్ గా మారాడు. అయితే.. భార్యకు ఉద్యోగం దొరికిందని చెప్పాడు కానీ.. అతను చేస్తున్న ఉద్యోగం ఏంటో మాత్రం చెప్పలేదు.
అయితే.. భర్తలో వచ్చిన ఈ కొత్త మార్పుని ఆమె గమనించింది. ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చిందో భర్త చెప్పలేదు. దీంతో.. భర్తపై అనుమానం కలిగి.. తన సోదరుడి సహాయం తీసుకుంది.
తన సోదరుడి సహాయంతో భర్త ఎక్కడికి వెళ్తున్నాడు..? ఏం చేస్తున్నాడు..? అతను చేసే ఉద్యోగం ఏంటో తెలుసుకోవాలని అనుకంుది.. ఆమె ప్లాన్ ప్రకారం భర్త సెక్స్ వర్కర్ గా చేస్తున్నాడని తెలుసుకొని షాకైంది.
వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె భర్తను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తనకు ఒక్కో కస్టమర్ రూ.3వేల నుంచి 5వేల వరకు ఇస్తున్నారని అతను అంగీకరించాడు.
అయితే.. ఇక మీదట తాను ఆ పని మానేస్తానని.. వేరే ఉద్యోగం చూసుకొని భార్యతో ఆనందంగా ఉంటానని పోలీసులు చెప్పాడు. అయితే.. అతని భార్య మాత్రం విడాకులు ఇవ్వాల్సిందేనని కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధపడింది.