భావప్రాప్తిని పొందడం లేదా? సెక్స్ లైఫ్ లో ఆనందాన్ని పెంచే చిట్కాలు
స్త్రీ పురుషులిద్దరూ మంచి భావప్రాప్తి పొందాలి. ఇది మీ శారీరక అవసరాలను తీర్చడమే కాకుండా.. మీ మానసిక, శారీరక, భావోద్వేగ ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది.
చాలా మంది ఆడవారు తమ లైంగిక జీవితంలో పూర్తిగా సంతృప్తి చెందరు. ఎక్కువగా పురుషులు మాత్రమే సెక్స్ లైఫ్ లో సంతృప్తిగా, ఆనందంగా ఉంటున్నారట. దీనివల్ల మహిళలు చిరాకు, కలత చెందుతారు. ఇది మీ మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీ భాగస్వామి మీ నుంచి ఆనందాన్ని కోరినట్టే మీరు కూడా మీ లైంగిక ఆనందం గురించి వారితో నిర్మొహమాటంగా మాట్లాడొచ్చు. మెరుగైన లైంగిక జీవితం మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సెక్స్ లైఫ్ లో ఆనందాన్ని పెంచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కౌగిలి
రిలేషన్ షిప్ లో ఉండి సాన్నిహిత్యం పేరుతోనే మీరిద్దరూ శృంగారంలో పాల్గొంటే అది మీ లైంగిక జీవితాన్ని చాలా బోరింగ్ గా మారుస్తుంది. అందుకే మీ భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చెప్పండి. శృంగారానికి ముందు ముద్దు పెట్టుకోవడం, తాకడం, కౌగిలించుకోవడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనండి. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం, కొన్నిసార్లు హగ్ చేసుకుని నిద్రపోవడం, మాట్లాడటం, వీటికి ప్రాముఖ్యత ఇవ్వడం కూడా రిలేషన్ షిప్ లో చాలా ముఖ్యం. ఇది మీ భావోద్వేగ, శారీరక బంధాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాదు సెక్స్ చేసినప్పుడు అది మరింత ఉత్తేజకరంగా అనిపిస్తుంది.
sex life
సెక్స్ పొజీషన్
ఆడవారు వారి కోరికల గురించి, వారికి ఆనందం కలిగించే విషయాల గురించి అస్సలు మాట్లాడరు. అందుకే భాగస్వామి లైంగిక స్థానం, మీ ఆనందం భిన్నంగా ఉండొచ్చు. సంకోచం, సిగ్గు, బిడియాన్ని వదిలివేసి మీకు ఇష్టమైన పొజీషన్ గురించి భాగస్వామితో చెప్పండి. దీనికంటే ముందు మీకు ఏ పొజీషన్ ఆనందాన్ని ఇస్తుందో గమనించండి. మొదట, మీరు ఏ కోణం మరియు భంగిమలో ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నారో అర్థం చేసుకోండి, తదనుగుణంగా కోణాన్ని మరియు స్థానాన్ని మార్చమని మీ భాగస్వామిని అడగండి.
Image: Getty Images
లూబ్ ఉపయోగించండి
సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు మీకు నొప్పిగా అనిపిస్తే లేదా మీ యోని పొడిగా ఉంటే, అలాగే మీరు సెక్స ను ఎక్కువగా ఆస్వాదించలేకపోతే ల్యూబ్ ఉపయోగించమని మీ భాగస్వామిని అడగండి. ఇది మీకు మంచి ఆనందాన్ని పొందడానికి, మీ లైంగిక జీవితాన్ని ఆసక్తికరంగా మార్చడానికి సహాయపడుతుంది. దీని కోసం మీరు ఖరీదైన లూబ్రికెంట్స్ ను కొనాల్సిన అవసరం లేదు. కలబంద జెల్, కొబ్బరి నూనె వంటి కొన్ని ప్రత్యేకమైన హోం రెమెడీస్ కూడా దీనికి సహాయపడతాయి. అయితే వీటిని ఉపయోగించేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
Image: Getty Images
సెక్స్ గేమ్స్
శృంగారంలో పాల్గొంటే సరిపోదు దాన్ని ఆస్వాదించడం కూడా చాలా ముఖ్యం. లేదంటే రిలేషన్ షిప్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సెక్స్ మీ మానసిక, శారీరక, భావోద్వేగ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీరు మీ బోరింగ్ సెక్స్ ను సరదాగా చేయడానికి కొన్ని ప్రత్యేక సెక్స్ గేమ్స్ లో పాల్గొనొచ్చు.
ఫాంటసీ నైట్ ప్లాన్
ప్రతి ఒక్కరికీ వారి స్వంత లైంగిక ఫాంటసీ ఉంటుంది. అందుకే మీ లైంగిక జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి మీ లైంగిక ఫాంటసీని మీ భాగస్వామితో పంచుకోండి. దీని కోసం మీరిద్దరూ దీని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు రోజును కేటాయించండి. అప్పుడే ఒకరి కోరికలను ఇంకొకరు నెరవేరుస్తారు. అలాగే సెక్స్ యోగా, సెక్స్ ఎక్సర్ సైజ్ లలో కూడా పాల్గొనొచ్చు.