నా మనసుతో పనిలేదా..? నా శరీరం మాత్రమే కావాలా..?
నా శరీరం మాత్రమే కావాలా అంటూ.. పలు ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే.. వాటిని డైరెక్ట్ గా అడిగి.. దానికి సమాధానం రాబట్టలేరు. వారి ప్రవర్తనను బట్టి.. మనం దానికి సమాధానం తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
sex
ప్రేమ, పెళ్లి బంధంలో ఉన్నవారు.. శృంగారం గురించి ఆలోచించడం చాలా కామన్. మరీ ముఖ్యంగా రిలేషన్ మొదలుపెట్టిన కొత్తలో.. ఈ రొమాన్స్, సెక్స్ విషయంలో ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. దీంతో.. ఈ విషయంలో ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుమానాలు కలుగుతాయి.
అందులో ప్రధానమైనది.. అతను నన్ను నిజంగానే ఇష్టపడుతున్నాడా..? నా మనసుతో తనకు సంబంధం లేదా..? నా శరీరం మాత్రమే కావాలా అంటూ.. పలు ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే.. వాటిని డైరెక్ట్ గా అడిగి.. దానికి సమాధానం రాబట్టలేరు. వారి ప్రవర్తనను బట్టి.. మనం దానికి సమాధానం తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ విషయాన్ని డైరెక్ట్ గా కాకుండా.. కొన్ని రకాల ప్రశ్నలతో..వారు మిమ్నల్ని ప్రేమిస్తున్నారా..? మీ శరీరాన్ని కోరుకుంటున్నారో తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
Covid and Sex
మీకు నాతో మాట్లాడటం ఎందుకు ఇష్టం అని అడిగి తెలుసుకోవాలట. మీ భాగస్వామి మీతో ప్రేమగా మాట్లాడుతుంటే.. దానికి దూరంగా ఉండకూడదు. ఇలా ప్రేమగా మాట్లాడే సమయంలోనే.. మీరు అతని నుంచి ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందట. అయితే... కొందరు నమ్మసక్యంగా లేకుండా పొగుడుతూ ఫ్లర్ట్ చేయాలని చూస్తుంటారు. అలాంటివి మాత్రం నమ్మకూడదు.
sex
మీ రిలేషన్ ఎంత కాలం కొనసాగుతుంది..? ఈ విషయంలో కూడా క్లారిటీ తీసుకోవడం చాలా అవసరం. వాళ్లు మీతో ఎంతకాలం ఉండాలని అనుకుంటున్నారో.. ఇప్పుడు మీ రిలేషన్ ఎక్కడిదాకా వచ్చిందనే విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ ప్రశ్నకు అతను చెప్పే సమాధానం మీ భవిష్యత్తు పై ఆధారపడుతుంది. అయితే.. నిజాయితీగా చెప్పే సమాధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
బెడ్ మీద నీకు ఏం చేయడం ఇష్టం..? ఈ ప్రశ్నకు కచ్చితంగా సమాధానం తెలుసుకోవాలట. కొందరు.. చేతల్లో ఏమీ లేకపోయినా.. ప్రగల్భాలు పలుకుతుంటారు.
అయితే.. వారు చెప్పినట్లుగా నిజంగా బెడ్ మీద చేస్తున్నారో లేదో కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. అతని సుఖమే మాత్రమే కాకుండా.. మీ ఆనందాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాడో లేదో కూడా చూడాలి.
వాళ్లు ఎంత బిజీగా ఉన్నా.. కుదరని రోజులో కూడా మీతో ఉండటానికి ప్రయత్నించినప్పుడు.. తనకు ఇష్టం లేని ప్రదేశానికి కూడా.. మీ కోసం వస్తే.. ఆ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకోవాలి.
అలా కాకుండా.. మీ చిన్న చిన్న ఆనందాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటే.. అతను మీ పై నిజంగా ప్రేమ చూపిస్తున్నారో లేదో.. మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
డేటింగ్ లో ఉన్న వ్యక్తి.. మీతో ప్రేమగా ఉంటున్నా.. మీ తల్లిదండ్రులను కలవడానికి నిరాకరిస్తున్నాడు అంటే.. అతనిపై డౌట్ పడాల్సిందే. అలా కాకుండా.. ఎలాంటి సంకోచం లేకుండా మీ తల్లిదండ్రులను కలిస్తే.. వారిపై నమ్మం ఉంచొచ్చు.