ఇష్టమైన వ్యక్తితో అలా మొదటిసారా?... అయితే ఇవీ అవసరమే...
ఎన్నో మధురోహలు.. మరెన్నో తీయని కలలు.. భవిష్యత్తు మీద.. గడపబోయే జీవితం మీద.. అందుకోబోయే స్వర్గసుఖాల మీద ఎన్నో అంచనాలు.. ఎంతగానో ఇష్టపడ్డ వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి మీ భాగస్వామితో మీలో కలిసి ఉండబోయే క్షణాలు మీ జీవితంలో అత్యుత్తమమైనవి. అతి ముఖ్యమైనవి.

అయితే.. మనసుకు నచ్చిన వ్యక్తితో జీవితాంతం కలిసి నడవడానికి బాసలు చేసిన రోజు.. కలిసి ఒకే ఇంట్లో కాపురం చేయాల్సి వచ్చినప్పుడు కొంత ఆందోళన అందరలోనూ సహజమే. అలాంటి ఆందోళన మీకు ఉందన్న విషయం అప్పటివరకు మీకే తెలియదు.

అప్పటివరకు మీకు మాత్రమే సొంతమైన ప్రదేశాన్ని తనతో పంచుకోవడం.. ఉదయం ఎంతకలిసి తిరిగినా రాత్రయ్యేసరికి బై చెప్పే అవకాశం ఇక ఉండకపోవడం.. కంచంతో పాటు మంచాన్ని పంచుకోవాల్సి రావడం.. ప్రతీ క్షణం కలిసి గడపాల్సి రావడం కాస్త యాంగ్జైటీని కలిగించడం మామూలే..

దీనికి చక్కటి పరిష్కారం మీ ఆలోచనలను మీ భాగస్వామితో పంచుకోవడమే. కలిసి మొదలుపెడుతున్న ఈ పయనం మీ కెంత ముఖ్యమో.. తనంటే ఎంత ఇష్టమో, ప్రేమో చెబుతూనే అదే సమయంలో మీరెంత నెర్వస్ ఫీలవుతున్నారో చెప్పండి.
అలాగని ఈ నిర్ణయం విషయంలో పునరాలోచించడం లేదని స్పష్టం చేయండి. మీ నెర్వస్ ను క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పండి.
అయితే ఒకసారి కలిసి ఉండాలని నిర్ణయించుకున్న తరువాత... ముందుగా ఇద్దరూ కలిసి కూర్చుని కొన్ని విషయాలు మొహమాటం లేకుండా మాట్లాడుకోండి.. ఇంటిపనుల్లో విభజన, వంటలో సాయం, బయటినుంచి ఇంటికి కావాల్సినవి తీసుకురావడం.. ఇంటిపనులు చేయడం లాంటివి స్పష్టంగా మాట్లాడుకోండి.. అప్పుడు మీ అనుబంధం ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా హ్యాపీగా సాగుతుంది.
సహజీవనం చేస్తున్నామన్న పేరుతో ఇండివిడ్యువాలిటీ కోల్పోవడం అవసరంలేదు. మీకంటూ స్పేస్ ను ఉంచుకోండి. ప్రతి నిమిషం మీ పార్టనర్ తోనే కలిసి ఉండాలని లేదు. మధ్యాహ్నాలు లేజీగా బెడ్రూంలో ఒక్కరే ఇష్టానుసారం పడుకుని చిరుతిళ్లు తినండి.. కాస్త ఆలస్యంగా లేచి కాఫీని గార్డెన్ లో కూర్చుని ఇష్టమైనంత సేపు తాగండి.
ప్రేమికులు ఒకరిని ఒకరు చూసుకోగానే కడుపులో సీతాకోకచిలుకలు ఎగిరిన అలజడి మామూలే. అందుకే భాగస్వామితో సహజీవనం అనేది మామూలు విషయం కాదు. అప్పటివరకు వేర్వేరుగా ఉండి ప్రేమించుకున్న వాళ్లు.. ఒకే దగ్గర ఉండి మరింత దగ్గరయ్యే అద్భుతమైన అవకాశం.

ఒకర్నొకరు ప్రేమగా పలకరించుకోవడం.. లేవగానే ఇష్టపడిన వ్యక్తి మోమును చూడడం.. ఆపీసుకు కలిసి వెళ్లడం.. కలిసి తినడం, కలిసి మంచం పంచుకోవడం.. ఇవన్నీ ఇంకాస్త యాంగ్జైటీ కలిగించే విషయాలే.. అందుకే చక్కగా మాట్లాడుకోండి.. అప్పుడే దీన్నుండి బయటపడతారు.

సహజీవనం అనేది ఇంకా మనదేశంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇంకా నేరంగానే చూసే పరిస్థితులు ఉన్నాయి. అయితే లివిన్ రిలేషన్ అనేది ఇద్దరు వ్యక్తులు తమంతట తాముగా ఏర్పాటు చేసుకునే ఓ స్వర్గం. తమ వైవాహిక జీవితం ఎలా ఉండాలనే వారికి ఒక దృక్పథంలో ఏర్పాటు చేసుకునేది. ఇప్పుడిప్పుడే మెల్లగా జంటలు ఈ విధానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు.