శృంగార సామర్థ్యం కోసం మాత్రలు వాడుతున్నారా..? ఒక్క నిమిషం..
శృంగారంలో ఇష్టాయిష్టాల గురించి అమరికలు లేకుండా మాట్లాడుకోవడం కూడా చాలా అవసరం. కొందరు పపరేమగా మాట్లాడటం, సానిహిత్యాన్ని వివిధ రూపాల్లో చూపించడం, సున్నిత స్పర్శల వంటి వాటిని కూడా ఎక్కువ ఆస్వాదిస్తారు.
అవసరం ఉన్నా లేకున్నా.. వయాగ్రా లాంటి మాత్రలు వాడటానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే... సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.. ఎక్కువ సేపు ఎంజాయ్ చేయవచ్చు అనే భావనతోనే ఎక్కువ మంది ఆ మాత్రలు వాడుతున్నట్లు తెలుస్తోంది.
అలా కాదు అంటే... అంగ స్తంభన సమస్యలతో బాధపడే పురుషులు... ఈ మాత్రలపై ఆభగా చూస్తున్నారు. అయితే... ఇలా మాత్రలు తీసుకోవడం అంత మంచిదేమీ కాదంటున్నారు నిపుణులు. మాత్రలు వేసుకుంటే శృంగార జీవితం దానంతట అదే ఉరకలెత్తుందని భావించకూడదన్నారు.
పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు చాలా ఎక్కువ. నడి వయసుకు వచ్చేసరికి దీంతో చాలా మంది మానసికంగా మథనపడుతూ ఉంటారు. దీనిని చక్కదిద్దడానికి మందులపై ఆకర్షితులౌతున్నారు. అయితే... వాటితో సంబంధం లేకుండా సమస్యను చక్కపెట్టుకోవచ్చుంటున్నారు నిపుణులు.
శృంగార జీవితంలో భాగస్వాములిద్దరికీ తృప్తి దక్కాలంటే స్తంభనలు బాగుండటం, అంగాంగ సంభోగం ఒక్కటే ముఖ్యం కాదని గ్రహించాలి. ఇద్దరి మధ్యా అన్యోన్యమైన అవగాహన, ప్రతి దశలోనూ దాంపత్య సఖాలను కలిసి ఆస్వాదించే స్వభావం పెంచుకోవాలి. పటుత్వం కోసం మాత్రలను ఆశ్రయించడానికి ముందే వాటి గురిచి భాగస్వామితో చర్చించాలి.
శృంగారంలో ఇష్టాయిష్టాల గురించి అమరికలు లేకుండా మాట్లాడుకోవడం కూడా చాలా అవసరం. కొందరు పపరేమగా మాట్లాడటం, సానిహిత్యాన్ని వివిధ రూపాల్లో చూపించడం, సున్నిత స్పర్శల వంటి వాటిని కూడా ఎక్కువ ఆస్వాదిస్తారు.
నేరుగా లైంగిక కలయిక కోసం ప్రయత్నించకూడదు. ముందు సున్నితంగా తాకడం, ముద్దులు పెట్టుకోవడం వంటి వాటితో ప్రారంభిచాలి. ఆ తర్వాత కలయిక దాకా వెళ్లాలి. అప్పుడు ముందులు వేసుకున్నా కూడా లభించని తృప్తి లభిస్తుంది.
సామర్థ్యం పెంచే వయాగ్రా లాంటి మందులు వేసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు స్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే.. ముందు కలయికను శారీరకంగా కాకుండా మానసికంగా కోరుకోవాలి. అప్పుడే మందులు వాడినా కూడా ప్రయోజనం ఉంటుంది.
అసలు కోరిక లేకుండా ఎన్ని మందులు వాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజూ ఆరోగ్యకరమైన ఆహారం, కాసేపు వ్యాయామం చేస్తే... అసలు మాత్రల జోలికి వెళ్లాల్సిన పని కూడా ఉండదని చెబుతున్నారు.