శృంగారంలో అది వాడేందుకు సిగ్గు.. ఏమవుతుందంటే...
సురక్షిత శృంగారం మీతోపాటు మీ భాగస్వామికీ ఎంతో మంచిది. ఇలా చేయకపోవడం వల్ల ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రమాదం అంచునే ఉంది. నగరంలో హెచ్ఐవీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల్లో విస్మయపరిచే విషయాలు వెలుగు చూశాయి.
సురక్షిత శృంగారం మీతోపాటు మీ భాగస్వామికీ ఎంతో మంచిది. ఇలా చేయకపోవడం వల్ల ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రమాదం అంచునే ఉంది. నగరంలో హెచ్ఐవీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల్లో విస్మయపరిచే విషయాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్ లో గతంతో పోలిస్తే ప్రస్తుతం హెచ్ఐవీ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో గ్రేటర్ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్ ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతం మాత్రమే ఉంది. ఇదే ఈ పరిస్థితికి కారణం.
అక్షరాస్యత, ఆరోగ్యపరమైన అంశాల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర అవగాహన ఎక్కువే కానీ.. సురక్షిత శృంగారం విషయానికి వచ్చేసరికి ఈ అవగాహన తగ్గిపోతోంది. కండోమ్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే హెచ్ఐవీ, హెపటైటీస్-బి, సి, గనేరియా, సిఫిలిస్ వంటి సుఖవ్యాధుల బారిన పడుతున్నారు.
చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే చాలామంది తమకు హెచ్ఐవీ ఉన్నా, బయటికి చెప్పడం లేదు. నలుగురికీ తెలిస్తే వెలేస్తారన్న భయం. బంధువులకు తెలిస్తే నామోషీ అని అనుమానం ఉన్నా చూపించుకోవడానికి గానీ, చికిత్స తీసుకోవడానికి కానీ దూరంగా ఉంటున్నారు.
ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. తమకు హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్నారు. చూసేందుకు అందంగా, హ్యాండ్ సమ్ గా ఉంటున్నారని వీరి మాయలో పడి శృంగారంలో పాల్గొంటే ఇక అంతే సంగతులు. వీరు కనీసం శృంగారం సమయంలో కండోమ్ లు కూడా వాడడం లేదంటే వాళ్లెంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
రక్షణ కోసం వాడాలన్న జ్ఞానం లేకపోవడమే ప్రస్తుతం హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరగడానికి ఓ కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది.
కానీ కండోమ్ ల వినియోగం మాత్రం 0.2 శాతమే ఉంది. ఇక ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉంది. కానీ 0.8 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారు.
ఇక గోవాలో 77.4 శాతం మందికి దీనిమీద అవగాహన ఉంటే, 7.1శాతం మంది మాత్రమే కండోమ్ లు వాడుతున్నారు. హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ 12 శాతం మంది కండోమ్ లు వినియోగిస్తున్నారు.
ఇక ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉంటే, ఇక్కడ మాత్రం అత్యధికంగా 16.1 శాతం మంది ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్ లు వినియోగిస్తున్నారు.
ఇక ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉంటే, ఇక్కడ మాత్రం అత్యధికంగా 16.1 శాతం మంది ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్ లు వినియోగిస్తున్నారు.
తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8శాతం మంది మాత్రమే కండోమ్ లు వాడుతున్నారు. సిక్కింలో 62.7 శాతం మందికి అవగాహన ఉండగా, 5.2 శాతం మంది మాత్రమే కండోమ్ లు వాడుతున్నారు.
త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉంటే, 1.9 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ 67శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో కేవలం 0.5 శాతం మంది మాత్రమే కండోమ్ కు వాడుతున్నట్లు స్పష్టమైంది.
నిర్లక్ష్యం వల్లే హెచ్ఐవీ..
దీనికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాలని చెబుతోంది. అపరిచిత వ్యక్తులతో సెక్స్ లో పాల్గొనడం వల్ల హెచ్ఐవీ సోకుతుంది. గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి సోకే అవకాశం ఐదు శాతం ఉంది.
హెచ్ఐవీ, ఎయిడ్స్ సోకడానికి స్వలింగ సంపర్కం కూడా ఒక కారణమే. కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది. ఒకరు వాడిన సిరంజ్ లు, బ్లేడ్స్ మరొకరు లేదా మరొకరికి వాడడం వల్ల వ్యాపిస్తుంది.
నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా సన్నబడడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటివి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకుని, చికిత్స మొదలుపెట్టాలని ఎయిడ్స్ కంట్రోల్ విభాగం అధికారులు సూచిస్తున్నారు.