ఉదయం వేళ అంగస్తంభనలు.. గుండెకు మంచిదేనా??
పురుషుల్లో అంగస్తంభన వారి ఆరోగ్యానికి సంకేతం అన్న విషయం మీకు తెలుసా. ముఖ్యంగా ఉదయం వేళల్లో దానికదే జరిగే అంగస్తంభన మీ గుండె ఆరోగ్యాన్ని పట్టిచెబుతుంది.
పురుషుల్లో అంగస్తంభన వారి ఆరోగ్యానికి సంకేతం అన్న విషయం మీకు తెలుసా. ముఖ్యంగా ఉదయం వేళల్లో దానికదే జరిగే అంగస్తంభన మీ గుండె ఆరోగ్యాన్ని పట్టిచెబుతుంది.
పురుషుల్లో అంగస్తంభనకు కొన్నిసార్లు ప్రేరేపణలు అవసరం లేదు. ఒక శృంగారభరిత ఆలోచన, అందమైన అమ్మాయిలు కూడా దానికదే అంగస్తంభన కలిగేలా చేస్తుంది.
అయితే ఉదయం వేళలో ఇలాంటి ఏ ఆలోచనలు, ప్రేరేపణలూ లేకుండానే పురుషుల్లో అంగం స్పందిస్తుంది. అయితే ఇది ఎంతవరకు మంచిది అనే సందేహం సహజంగా పురుషుల్లో కలుగుతుంది.
మీకు ఉదయం వేళ ఎలాంటి ప్రేరేపణ లేకుండా, శృంగారభరితమైన ఆలోచన లేకుండా.. అంగం దానికదే స్తంభిస్తున్నట్లయితే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. అంతేకాదు ఇది మీరు చక్కని లైంగిక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని చెప్పేందుకు గొప్ప సంకేతం.
ఎందుకంటే అంగస్తంభన సమస్య.. గుండె పనితీరును తెలుపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. పురుషుల్లో రాత్రివేళల్లో కంటే తెల్లవారుజామున అంగస్తంభనలు ఎక్కువగా ఉంటాయట.
శరీరానికి తగిన విశ్రాంతి లభించడం, ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోయే వ్యక్తుల్లోనే ఇలాంటి స్తంభనలు అధికంగా ఉంటాయట. అలా కాకుండా ఉదయం వేళ అంగం స్తంభించకపోతే.. గుండె సంబంధిత వ్యాధులకు ముందస్తు హెచ్చరికగా భావించాలని పరిశోధకులు చెబుతున్నారు.
అంగంలో ఉండే ధమనులు మిగతా శరీర భాగాల్లో ఉండే ధమనుల కంటే చాలా చిన్నగా, సున్నితంగా ఉంటాయి. అందుకే.. అవి ఎవరి ప్రమేయం లేకుండా.. రక్త ప్రవాహం వల్ల అంగాన్ని స్తంభించేలా చేస్తాయి.
అందుకే గుండె పనితీరులో ఎలాంటి సమస్యలు ఏర్పడినా, ధమనుల్లో లోపాలు ఏర్పడినా.. ఆ ప్రభావం అంగస్తంభనపై పడుతుంది. అలాంటి సమయాల్లో ఉదయం వేళల్లో అంగం దానికదే స్పందించదు. అయితే రోజూ ఇదే పరిస్థితి ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
అంగస్తంభన సమస్య అనగానే చాలా కంగారు పడతారు. భాగస్వామిని సంతృప్తి పరచలేమేమో అని భయపడతారు. దీంతో వయాగ్రా వాడేందుకు మొగ్గు చూపుతారు. అలా చేయడం ఆరోగ్యాన్ని అస్సలు మంచిది కాదు. అంగస్తంభన సమస్య తలెత్తితే ముందుగా వైద్యులను సంప్రదించాలి.
ఉదయం వేళల్లో వ్యాయామం చేయడం మొదలుపెట్టండి. కొవ్వు పదార్థాలను తగ్గించండి. బరువు పెరగకుండా జాగ్రత్తపడండి.
నిరంతరం యోగా చేయడం వల్ల శారీరకంగా చురుగ్గా ఉంటుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గడం వల్ల శృంగార సమస్యలు తగ్గుతాయి. వీర్యస్ఖలనంపై నియంత్రణ దొరుకుతుంది.
అంగస్తంభన మెరుగ్గా ఉండటంతోపాటు భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. నిత్యం.. కుంభకాసనం, ధనురాసనం, అర్ధ ఉస్త్రాసనం, నౌకాసనం వంటివి క్రమం తప్పకుండా చేయండి. తప్పకుండా సత్ఫలితాలు చూస్తారు.