శృంగారానికి ముందు వీటిని తిన్నారంటే అంతేసంగతులు
కొన్ని రకాల ఆహారాలను తింటే మీ సెక్స్ డ్రైవ్ బాగా పెరుగుతుంది. ఇంకొన్ని రకాల ఆహారాలను తింటే మాత్రం మీకు సెక్స్ కోరికలు తగ్గుతాయి. అలాగే సెక్స్ లో పాల్గొనాలన్న ఆలోచన కూడా పోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే సెక్స్ కు ముందు ఎలాంటి వాటిని తినకూడదంటే?
ఫుడ్ మీ సెక్స్ డ్రైవ్ పై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే మీరు సెక్స్ లో పాల్గొనాలనుకుంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే. అవును రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తింటే మీలో సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. అలాగే లైంగికంగా మీరు చురుగ్గా ఉండరు. ఎందుకంటే వీటిని తింటే మీ కడుపు ఉబ్బుతుంది. అలాగే అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. మీరు సెక్స్ లో పాల్గొనాలనుకుంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జున్ను
మీకు లాక్టోస్ అలెర్జీ ఉందా? అయితే జున్నును పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే జున్నులో లాక్టోస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపు సమస్యలకు కారణమవుతుంది. అంటే దీన్నితింటే మీ కడుపు ఉబ్బుతుంది. ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అందుకే సెక్స్ లో పాల్గొనడానికి ముందు జున్నును అస్సలు తినకండి. అలాగే పిజ్జా, పాస్తా లేదా బర్గర్లను కూడా తినకండి. దూరంగా ఉండండి!
spicy food
స్పైసీ ఫుడ్
మీ సెక్స్ డ్రైవ్ స్పైసీగా ఉండాలనుకుంటే మీరు మాత్రం స్పైసీ ఫుడ్ ను మిస్టేక్ లో కూడా తినొద్దు. ఎందుకంటే ఈ ఫుడ్ ను తింటే అజీర్ణం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల మీరు సెక్స్ లో పాల్గొనలేరు.
onion and garlic
ఉల్లిపాయ, వెల్లుల్లి
ఉల్లిపాయలు, వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలే చేసినా.. సెక్స్ కు ముందు మాత్రం తినకూడదు. ఎందుకంటే వీటిని తింటే మీ నోట్లో నుంచి చెడు వాసన వస్తుంది. దీనివల్ల మీకే కాదు మీ భాగస్వామికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే శృంగారానికి ముందు వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి మసాలా ఫుడ్స్ ను తినకండి.
తీపి
తీపిని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. కానీ సెక్స్ కు ముందు తీపిని తినకూడదంటారు నిపుణులు. చక్కెరతో నిండిపోయిన స్వీట్లు, కేకులు, కుకీలను అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఇవి మీ సెక్స్ డ్రైవ్ ను దెబ్బతీస్తాయి. ఎందుకంటే డెజర్ట్ లో షుగరే కాదు ట్రాన్స్ ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని సెక్స్ కు ముందు తింటే మీరు ఉద్వేగానికి చేరుకోవడం కష్టమవుతుంది. అంతే కాదు స్వీట్ ను ఎక్కువగా తింటే మీ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
కార్బోహైడ్రేట్స్
జంక్ ఫుడ్ అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడమన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు బరువు పెరగడమే కాకుండా మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో మీరు బద్దకంగా మారుతారు. అందుకే మీ లైంగిక జీవితాన్ని స్పైసీగా మార్చాలనుకుంటే మీరు రైస్, ఫ్రైస్, పాస్తా వంటి పిండి పదార్థాలను తినకండి.