సెక్స్ సమయంలో వీటిని అస్సలు ఉపయోగించకూడదు..
సెక్స్ లో లూబ్రికేషన్ కోసం మార్కెట్ లో దొరికే వాటిని ఉపయోగిస్తుంటారు. అయితే రసాయనాలుండే లూబ్రికెంట్స్ ను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఇంట్లో ఉండే కొన్నింటిని కూడా ఇందుకోసం అస్సలు ఉపయోగించకూడదంటున్నారు నిపుణులు. అవేంటంటే?
సెక్స్ లో ఆడవాళ్లకు, మగవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా సార్లు యోని పొడిబారడం వల్ల సెక్స్ ఇబ్బందిగా, బాధాకరంగా ఉంటుంది. ఇందుకోసమే చాలా మంది లూబ్రికెంట్లను ఉపయోగిస్తుంటారు. మార్కెట్ లో లూబ్రికెంట్ లు అందుబాటులో ఉంటాయి. కానీ చాలా మంది ఇందుకోసం ఇంట్లో ఉండే వాటినే లూబ్రికెంట్ గా ఉపయోగిస్తుంటారు. దీనివల్లే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిపుణుల ప్రకారం.. లూబ్రికేషన్ కోసం నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ దీనివల్ల యోని ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉపయోగించకూడని వాటిని ఉపయోగించడం వల్ల యోని అలెర్జీలు, దద్దుర్లు, ఎరుపుతో పాటుగా ఎన్నో ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి లూబ్రికెంట్ కోసం వేటిని ఖచ్చితంగా ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
లాలాజలం
చాలా మంది లాలాజలాన్ని కూడా లూబ్రికెంట్ గా ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే లాలాజలంలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిపుణుల ప్రకారం.. లాలాజలాన్ని ఉపయోగించడం వల్ల కాన్డిడియాసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పెట్రోలియం జెల్లీ
ప్రసూతి,గైనకాలజీ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. జననేంద్రియాలలో పెట్రోలియం జెల్లీని ఉపయోగించే వారికి బ్యాక్టీరియల్ వాగినోసిస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది కండోమ్ లతో సరిగ్గా పనిచేయదు. కాబట్టి దీనిని ఉపయోగించకపోవడమే మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గర్భందాల్చడానికి ప్రయత్నిస్తుంటే.. మీరు ఖచ్చితంగా పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం మానుకోవాలి, ఎందుకంటే అవి స్పెర్మిసైడ్ గా పనిచేస్తాయి.
బేబీ ఆయిల్
చాలా మంది బేబీ ఆయిల్ ను కూడా ల్యూబ్ గా కూడా ఉపయోగిస్తుంటారు. కానీ ఇది అస్సలు సురక్షితం కాదు. ఎందుకంటే ఇది మీకు సంక్రమణకు కారణమవుతుంది. బేబీ ఆయిల్ లో పెర్ఫ్యూమ్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి అలెర్జీ కారకంగా పనిచేస్తాయి.
Hygiene in Sex
నీరు
నీటిలో తేమ ఉండదు. ఇది మీ చర్మంపై దద్దుర్లు కలిగించే అవకాశం ఉంది. నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే అది ఎక్కువ సేపు పనిచేయదు.
కలబంద జెల్
కలబంద జెల్ ఉపయోగించడం మంచిదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని ఉపయోగించడం కూడా సేఫ్ కాదు. మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే కలబందను ఉపయోగించడం వల్ల దద్దుర్లు, చిరాకు, దురద వంటి సమస్యలు వస్తాయి.
బాడీ లోషన్
బాడీ లోషన్లు ఖచ్చితంగా 100% సేంద్రీయమైనవి కావు. వాటిలో చాలా కెమికల్స్ ఉంటాయి. మీ వల్వా వంటి సున్నితమైన ప్రాంతంలో తేమ కోసం వీటిని ఉపయోగించడం మంచిది కాదు.