Relationship: మీరు మంచి భార్య అవ్వాలనుకుంటున్నారా.. అయితే మీ భర్త నుంచి వీటిని ఆశించకండి!
Relationship: భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి అంతేకానీ ఒకరి నుంచి ఒకరు అతిగా ఆశించకూడదు అలా ఆశిస్తే ఆ సంసారం నరకంగా మారుతుంది. అయితే ఒక భార్య భర్త నుంచి ఏ ఏ విషయాలు ఆశించకూడదో ఇక్కడ చూద్దాం.
సంసారంలో భార్యలు ఎక్కువగా భర్త తన వాడు మాత్రమే అనేలాగా ప్రవర్తిస్తారు. తను చెప్పింది చేయాలి, తన మాటే వినాలి అనే ఆలోచన ధోరణిలో ఉంటారు. ఆ విధానం ఆ సంసారానికి ఎప్పటికైనా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఒక భార్య గా మీ భర్త నుంచి వీటిని ఆశించకండి.
మీ భర్త పూర్తిగా మీ కోసం మారాలి అనుకోకండి. కొన్ని ముఖ్యమైన అలవాట్లు, మీ భర్త గౌరవించే కొన్ని విషయాలు మీరు పూర్తిగా మారతారని ఆశించడం తప్పు సంతోష్ కరమైన విజయవంతమైన వివాహం ఒకరు కోరికలను ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి.
మీరు చేసే ప్రతి పనిని మీ భర్త ప్రశంసించాలని ఆశించకండి ఎందుకంటే మీ భర్త ఆ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకి తెలియదు కదా కాబట్టి లేనిపోని హంగామా చేయకండి. మీ భర్త సంపాదనని బట్టి మీ ఖర్చు అలవాటు చేసుకోండి.
అతని శక్తికి మించి డబ్బుని ఆశిస్తే అతను మాత్రం ఎక్కడినుంచి తీసుకువస్తాడు అనే ఆలోచన కలిగి ఉండండి. అలాగే మీ భర్త మిమ్మల్ని ప్రతి నిమిషం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అనుకోకండి. ఎందుకంటే ఒక మనిషిని ఎల్లవేళలా సంతోషంగా ఉండేలా చూసుకోవటం అనేది అసంభవం.
భర్త ఉద్యోగాన్ని కూడా మీరు గౌరవించాలి. అతనికి ఉన్న టెన్షన్స్ లో అతనికి మీరు సపోర్టుగా నిలబడాలి అంతేగాని అతనిని మరింత టెన్షన్ పెట్టే లాగా ప్రవర్తించకండి. భర్తకి భోజనం పెడుతున్నప్పుడు మీ కోరికల లిస్ట్ చదవకండి. అది ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతనే దెబ్బతీస్తుంది.
భోజనం చేసిన తర్వాత అతను ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీరు ఏమీ ఆశిస్తున్నారో అతనిని అడిగితే అప్పుడు కోరికలు తీరే అవకాశం ఉంటుంది. తృప్తి అయినా అసంతృప్తి అయినా భార్య యొక్క ప్రవర్తనలోనే ఉంటుందని గుర్తించండి.