పడకగదిలో రేసుగుర్రంలా రెచ్చిపోవాలా? ఈ ఫుడ్స్ తినండి...
పడకగదిలో రేసుగుర్రంలా రెచ్చిపోవాలని అందరూ అనుకుంటారు. కొంతమంది రెట్టించిన ఉత్సాహంతో శృంగారాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే మరికొందరిలో మనసులో ఉత్సాహం ఉన్న పడకగదిలో తొందరగా నీరసపడిపోతుంటారు.
పడకగదిలో రేసుగుర్రంలా రెచ్చిపోవాలని అందరూ అనుకుంటారు. కొంతమంది రెట్టించిన ఉత్సాహంతో శృంగారాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే మరికొందరిలో మనసులో ఉత్సాహం ఉన్న పడకగదిలో తొందరగా నీరసపడిపోతుంటారు.
ఇలాంటి వారు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఫుడ్స్ ను ప్రత్యేకంగా చేర్చితే మీ శక్తి పుంజుకుంటుంది. పడకగదిలో వీరవిహారం చేయచ్చు. శృంగార జీవితం సంతృప్తిగా ఉంటుంది. మరి ఆ ఆహారపదార్థాలు ఏంటంటే...
శృంగారం అనగానే అదొక్కటే కాదు దానికి ముందు, ఆ తరువాత కూడా రొమాన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ ఐదు నిమిషా పని అయిపోగానే అలసిపోతే భాగస్వామి సంతృప్తిగా ఉండదు.
దీంతో కాపురంలో కలతలు చెలరేగుతాయి. సో దీన్నుండి తప్పించుకోవాలంటే ఈ సూపర్ ఫుడ్స్ బాగా సహాయపడతాయి.
పుచ్చపండు : వేసవి దాహాన్ని తీర్చే పుచ్చ పండులో అమైనో ఆమ్లం ఎల్ సిట్రులైన్ ను అధికంగా ఉంటాయి. ఇది మరొక అమైనో ఆమ్లం, అర్జినిన్ గా మారుతుంది. ఇది నైట్రస్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఈ ఫైటోన్యూట్రియెంట్లు రక్తనాళాలను రిలాక్స్ చేసి వయాగ్రాలాగా పనిచేస్తాయని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు ఇది మహిళల్లో సెక్స్ డ్రైవ్‌ను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
షెల్ ఫిష్ లేదా ఆయిస్టర్స్ : ఇవి కామోద్దీపనకారిగా పనిచేస్తాయి, వీటిలోని అధిక జింక్ కంటెంట్ దీనికి కారణం.
ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి, శక్తిని పెంచడానికి టెస్టోస్టెరాన్ తయారు చేయడానికి సహాయపడతాయి.
ఫిగ్స్ : శరీరంలో నైట్రస్ ఆక్సైడ్ ఉత్పత్తిని సులభతరం చేయడానికి అత్తిపళ్లు బాగా సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది.
శరీరావయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. పురుషులు అంగస్తంభనలు బాగా జరగడానికి సహాయపడుతుంది.
యాపిల్స్ : ఈ పండ్లలో పుష్కలంగా క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది పురుషులలో ప్రోస్టేట్ సమస్యలను, మహిళల్లో సిస్టిటిస్ను నియంత్రిస్తుంది.
చాక్లెట్ : సెక్స్ డ్రైవ్‌ను మెరుగుపరచడంలో చాక్లెట్ చాలా సహాయపడుతుందనేది విశ్వజనీన రహస్యం. కాకోలో కనిపించే కొన్ని సమ్మేళనాలు సెరోటోనిన్, డోపామైన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్ల విడుదలను పెంచుతాయి.
కామానికి, ప్రేమను ప్రేరేపించే ఫినైల్థైలామైన్ అనే రసాయనం కూడా ఇందులో ఉంది. సో మంచి క్వాలిటీ డార్క్ చాక్లెట్ తినడం ఎంతో మంచిది.