పిల్లలు పుట్టకుండా ప్రత్యేకంగా మందు.. మగవారికి మాత్రమే!
వీటిని ఎక్కువగా వాడటం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా పోతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
శృంగారంలో పాల్గొన్న తర్వాత పిల్లలు పుట్టకుండా ఉండేందుకు స్త్రీలు గర్భనిరోదక మాత్రలు వాడుతూ ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే.
అయితే... ఇలా స్త్రీలు గర్భనిరోదక మాత్రలు వాడటం వల్ల వారిలో అనేక సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటారు.
వీటిని ఎక్కువగా వాడటం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా పోతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇందుుకోసం ప్రత్యేకంగా పురుషులకు గర్భనిరోదక జెల్ ని తయారు చేశారు.
ఈ పురుష హార్మోన్ జెల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు 450 జంటల మీద యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ 12 నెలల పాటు అధ్యయనం చేస్తోంది.
వీళ్లు వినియోగిస్తున్న జెల్లో ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ హార్మోన్లు ఉంటాయి. ప్రొజెస్టిరాన్ హార్మోన్ పురుషుల వృషణాలాల్లో సహజమైన టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కాకుండా చేస్తుంది. దాంతో, వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది.
అయితే, ఆ జెల్ ద్వారా శరీరంలోకి వెళ్లే కృత్రిమ టెస్టోస్టిరాన్ హార్మోన్... ఆ వ్యక్తిలో లైంగిక ఉత్సాహంతో పాటు, ఆ హార్మోన్ మీద ఆధారపడి పనిచేసే ఇతర క్రియలు యథావిధిగా జరిగేలా చూస్తుంది.
అయితే, ఆ జెల్ ద్వారా శరీరంలోకి వెళ్లే కృత్రిమ టెస్టోస్టిరాన్ హార్మోన్... ఆ వ్యక్తిలో లైంగిక ఉత్సాహంతో పాటు, ఆ హార్మోన్ మీద ఆధారపడి పనిచేసే ఇతర క్రియలు యథావిధిగా జరిగేలా చూస్తుంది.
ఈ జెల్ చూడటానికి టూత్ పేస్ట్ లా ఉంటుంది. దానికి కొద్ది గా తీసుకొని భుజం మీద, చాతి మీద రాసుకోవాలి. మూడు , నాలుగు సెకన్లలో అది ఆరిపోతోంది. తర్వాత మరో భుజానికి రాసుకోవాలి
అంతే.. ఆ తర్వాత షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సెక్స్ లో పాల్గొన్నా స్త్రీలు గర్భం దాల్చరని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని చెబుతున్నారు.