పిల్లలకు కచ్చితంగా నేర్పాల్సిన సెక్స్ పాఠాలు ఇవే..!
పురుషుడి పురుషాంగం.. స్త్రీ జననాంగంలోకి ప్రవేశించడం మాత్రమే శృంగారం కాదు. ఈ విషయం కూడా పిల్లలకు అవగాహన కల్పించాలి.
పిల్లలకు స్కూల్ ఏజ్ లోనే సెక్స్ పట్ల అవగాహన కలిగించాలి. స్కూల్ వయసులోనే వారికి దీనిపట్ల అవగాహన కలిగితే... యవ్వనం దశలో ఒక అవగాహన ఉంటుంది. అయితే.. ప్రస్తుతం స్కూల్ దశలో సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో ఒక చిన్న థియరీ పార్ట్ మాత్రమే ఉంటుంది.
దానికి.. యవ్వనం దశలో యువతీ యువకులకు వచ్చే అనుమానాలకు సమాధానం దొరకడం లేదని నిపుణులు భావన. అందుకే.. స్కూల్ వయసులోనే పిల్లలకు కొన్ని విషయాలు కచ్చితంగా నేర్పించాలని వారు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
ప్రస్తుతకాలంలో చిన్న పిల్లలనే కనికరం కూడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వారు తమపై చేస్తున్నందేటో తెలియక.. నొప్పి కలిగినా వద్దు అని పిల్లలు చెప్పలేకపోతున్నారట.
కాబట్టి.. పిల్లలకు ఏదైనా, ఎవరైనా హాని చేయాలని చేస్తుంటే.. అది వారికి ఇష్టం లేకపోతే.. నో చెప్పడం నేర్పించాలట. గట్టిగా అరిచి చెప్పడానికి కూడా సంకోచించకూడదు. ఈ విషంలో సిగ్గుపడాల్సిన పనిలేదని.. ఒకవేళ తమపై బలవంతపు దాడి జరిగితే.. ఆ విషయం చెప్పడానికి కూడా బయపడకూడదు.
పురుషుడి పురుషాంగం.. స్త్రీ జననాంగంలోకి ప్రవేశించడం మాత్రమే శృంగారం కాదు. ఈ విషయం కూడా పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే.. లెస్సీబియన్స్, గే లలో ఇది సాధ్యం కాదుకదా. ఆ ఆలోచనను పిల్లల మెదడులో నుంచి తీసేయాలి.
స్వలింగ సంపర్కులను తక్కువ చేసి చూడటం మన సమాజంలో ఇంకా ఉంది. కాబట్టి.. ఈ విషయాన్ని కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. స్వలింగ సంపర్కం కూడా సహజమైనదే అనే విషయం నేర్పించాలి.
యవ్వనం దశలో ఉన్నవారు సెక్స్ గురించి తెలుసుకోవాడనికి ముందుగా చేసేది పోర్న్ వీడియోలు చూడటం. వాటిని చూసేసి.. వాటిలో చూపించిందే నిజమని భ్రమ పడిపోతుంటారు. కాబట్టి... వాటిలో చూపించినదంతా నిజమని అనుకుంటే పొరపాటు పడినట్లే. ఈ విషయాన్ని కూడా పిల్లలకు ముందుగానే నేర్పించడం అవసరం.
శృంగారం సమయంలో మహిళలకు భావప్రాప్తి కలగడానికి ఎక్కువ సమయం తీసుకుంటారనే విషయాన్ని ఎవరూ పిల్లలకు నేర్పించారు. అయితే.. ఆ విషయం కూడా కచ్చితంగా నేర్పించాలట. కొందరు మహిళలు కేవలం స్వయం తృప్తి ద్వారానే భావప్రాప్తి పొందుతారు.
లైంగిక అవగాహన కల్పించడం కూడా చాలా అవసరం. ఎవరికైనా పిల్లలు పుడితే.. పుట్టింది ఆడ, మగ అనే విషయాన్ని పిల్లలు గుర్తించగలగాలట. అది కూడా నేర్పించాల్సిన విషయమేనట.