అలాంటి పిల్లలు పేరెంట్స్ నుంచి కోరుకునేది ఇదే..!
స్నేహితులతో గొడవ పడినప్పుడు లేదంటే.. పేరెంట్స్ ఇద్దరూ పిల్లలు చూస్తుండగా గొడవ పడినప్పుడు.. కూడా వారు ఎక్కువగా అప్ సెట్ అవుతూ ఉంటారట.
పిల్లలు అల్లరి చేయడం చాలా కామన్. పిల్లలు కాకపోతే ఇంకెవరు చేస్తారు. ఆ విషయం మనకు తెలిసినా.. వారు చేసే అల్లరి భరించలేక వాళ్లని ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం. ఈ క్రమంలో పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా అప్ సెట్ అవుతూ ఉంటారు. అసలు పిల్లలు ఎందుకు అప్ సెట్ అవుతారు..? వారు అలాంటి సమయంలో పేరెంట్స్ నుంచి ఏం కోరకుంటారో ఓసారి చూద్దాం..
పిల్లలు ఒక్కోసారి సడెన్ గా అప్ సెట్ అవుతూ ఉంటారు. వారికి కోపం రావడానికి, ఫ్రస్టేషన్ రావడానికీ లేదంటే అప్ సెట్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటి.. వారి తోడబుట్టిన వారితో లేదంటే.. స్నేహితులతో గొడవ పడినప్పుడు లేదంటే.. పేరెంట్స్ ఇద్దరూ పిల్లలు చూస్తుండగా గొడవ పడినప్పుడు.. కూడా వారు ఎక్కువగా అప్ సెట్ అవుతూ ఉంటారట.
అయితే... పిల్లలు అప్ సెట్ అయినప్పుడు వారిని వెంటనే ఏమైందో చెప్పమని విసిగించకూడదట. కాస్త వారికి స్పేస్ ఇవ్వాలి. వెంటనే ప్రశ్నలతో విసిగించకుండా.. కాసేపు వదిలేసి.. ఆ తర్వాత వారిని పిలిచి మాట్లాడాలి. అంతేకాకుండా.. పిల్లలు అప్ సెట్ అయినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలో ఓసారి చూద్దాం...
మీ పిల్లలు ప్రతి విషయాన్ని మీతో పంచుకోవాలని రూల్ ఏమీ లేదు. వారికంటూ కొన్ని పర్సనల్ ఉండటంలో తప్పేమీ లేదు. కాబట్టి.. ప్రతి విషయాన్ని మీకు చెప్పాలి అని వారిని బలవంత పెట్టకూడదు. వారు సంతోషంగా షేర్ చేసుకోగగల ఫ్రీడమ్ మీరు వారికి ఇవ్వాలి.
ఏదో ఒక సమయంలో పిల్లలు తమ అప్ సెట్ ని పక్కన పెట్టి ఏదో ఒక విషయాన్ని మీకు చెప్పాలి అనుకుంటారు. అలాంటప్పుడు వారు చెప్పేది మీరు వినాలి. పిల్లలు చెప్పేది వినడానికి మీకు ఓపిక చాలా అవసరం. ముందు అది అలవాటు చేసుకోవాలి. పిల్లలు.. పేరెంట్స్ నుంచి కోరుకునేది అదే.
ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కొట్టుకోవడం లాంటివి చాలా సహజం. అలాంటప్పుడు ఒకరిదే తప్పు అని స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఇద్దరి వైపు వినాలి. అప్పుడు మాత్రమే తప్పు ఎవరిదో నిర్ణయించాలి. అది తెలుసుకోకుండా ఒక పిల్లవాడిదే తప్పు అని నిర్ణయించకూడదు.
మీ పిల్లలు ఏదైనా విషయంలో బాధ పడుతున్నప్పుడు.. అది వారు మీకు చెప్పాలి అనుకున్నప్పుడు.. మీరు వారికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కాదు ఆగు లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. అవి వారిని మరింత బాధ పడతాయి.
తల్లిదండ్రులు ఎక్కువగా కంగారుపడటం పిల్లలు తట్టుకోలేరు. మామూలుగానే పిల్లలు అప్ సెట్ గా ఉన్నప్పుడు మీరు మరింత నిప్పుకు ఆజ్యం పోసినట్లు చేయకూడదు. వారిని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. మీరు కూడా డల్ అయిపోకూడదు. వారిని చిల్ చేయడానికి ప్రయత్నించాలి.
పిల్లలు బాధలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి మద్దతు ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి.. వారికి అవసరమైన సమయంలో మీరు మద్దతు ఇవ్వడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.