పిల్లలు వేరే పిల్లలను కొడుతున్నారా..? పేరెంట్స్ చేయాల్సింది ఇదే..!
ఎప్పుడో ఒకసారి సరదాగా కొట్టుకోవడం అంటే పర్వాలేదు కానీ.. తరచూ పిల్లలు.. ఎదుటి పిల్లలను కొడుతున్నారు అంటే.. ఆ విషయం గురించి పేరెంట్స్ ఆలోచించాల్సిందే.
Siblings fight
ఇద్దరు పిల్లలు ఒకే చోట ఉంటే.. ఎవరిని ఎవరు ఏం చేస్తారా అనే కంగారు చాలా మంది పేరెంట్స్ లో ఉంటుంది. ఎందుకు అంటే.. ఇద్దరిలో ఏ ఒక్కరు హైపర్ అయినా.. ఇంకొకరిని కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇద్దరు పిల్లలు ఒకే చోట ఉంటే... ఒకే బొమ్మ ఇద్దరూ కావాలని మారాం చేస్తారు. దీని వల్ల.. ఇద్దరి మధ్య గొడవలు రావడం, చివరకు కొట్టుకోవడం వరకు దారి తీస్తుంది. ఎప్పుడో ఒకసారి సరదాగా కొట్టుకోవడం అంటే పర్వాలేదు కానీ.. తరచూ పిల్లలు.. ఎదుటి పిల్లలను కొడుతున్నారు అంటే.. ఆ విషయం గురించి పేరెంట్స్ ఆలోచించాల్సిందే. మరి, పిల్లల నుంచి.. ఈ అలవాటు మాన్పించాలంటే.. ఎవరినీ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
Siblings fight
నిజానికి, పిల్లలు ఎందుకు కొడతారు అంటే.. వారికి కోపం, ఫ్రస్టేషన్ వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ.. ఆ కోపం, ఫ్రస్టేషన్ ని ఎలా చూపించుకోవాలో తెలీక.. ఇతరులను కొడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం కూడా ఆవేశంగా వెళ్లి మనం వాళ్లను తిరి కొట్టకూడదు. వారికి ఏ విషయంలో కోపం వచ్చింది..? వారి కోపానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఆలోచించి.. వారికి తెలియజేస్తూ ఉండాలి. నీ బొమ్మ తీసుకున్నందుకు నీకు కోపం వచ్చింది.. ఆ కోపాన్ని ఇలా చూపించకూడదు అని అనునయంగా చెప్పాలి.
పిల్లలకు కోపం వస్తే వెంటనే కొట్టేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వారి బిహేవియర్ మార్చేసే ప్రయత్నం చేయాలి. దాని కోసం.. కోపం వచ్చినప్పుడు వెంటనే కొట్టకుండా.. డీప్ బ్రీత్ తీసుకోవడం, లేదంటే.. వెంటనే పక్కకు వెళ్లిపోవడం, లేదంటే.. ఎవరైనా పెద్దవారి సహాయం తీసుకోవడం లాంటివి చేయమని ప్రోత్సహించాలి.
Siblings fight
ఎదుటివారిని కొట్టాలని అనిపించినప్పుడు.. ఆ పరిస్థితి నుంచి ఎలా ఎవాయిడ్ చేయాలి అనే విషయాన్ని వారికి వివరించాలి. దాదాపు.. పిల్లలకు బొమ్మలతో ఇతరులతో ఆడుకునేటప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. అలాంటి సమయంలో.. ఇద్దరూ కలిసి ఒక బొమ్మను ఎలా షేర్ చేయగలరో వివరించాలి. షేరింగ్ ఈజ్ కేరింగ్ కాన్సెప్ట్ నేర్పించాలి. లేదంటే.. బాగా కోపం వచ్చినప్పుడు.. కళ్లు మూసుకొని పది నెంబర్లు.. మనసులో లెక్కపెట్టుకోమని చెప్పండి. ఆ సమయంలో దాదాపు కోపం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు పిల్లలకు ఎంతబాగా అర్థమయ్యేలా వివరించారు అనేది మాత్రం చాలా ముఖ్యం.
పిల్లలకు ప్రతిసారీ కోపం వచ్చినప్పుడు మాత్రమే కాదు.. అలసిపోయినప్పుడు, ఆకలివేసినప్పుడు, ఫ్రస్టేషన్ వచ్చినప్పుడు కూడా ఇతరులను కొడుతూ ఉంటారు. అయితే.. ఏ సమయంలో పిల్లల కు ఇలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. మరోసారి వారికి అలాంటి సిట్యువేషన్ రాకుండా చూసుకోవాలి.
పిల్లలు ఇతరులను హర్ట్ చేసినప్పుడు.. వారికి మరో విధంగా వారు చేసేది తప్పు అనే విషయం అర్థమయ్యేలా చూడాలి. అంతేకానీ.. మనం తిరిగి కొట్టడం లాంటివి మాత్రం చేయకూడదు. పొరపాటున కూడా మీరు తిరిగి పిల్లలను కొట్టకూడదు.