పిల్లలు చెప్పినమాట వినాలంటే పేరెంట్స్ ఏం చేయాలి?
ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలను అర్థం చేసుకోవడం, పిల్లలు పేరెంట్స్ చెప్పేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కష్టమైన పని అయినా.. దానికి మన వంతు కృషి చేయాలి.
చాలా మంది పిల్లలను పెంచడం చాలా కష్టంగా భావిస్తారు. ఎందుకంటే.. తమ పిల్లలు అసలు చెప్పింది వినడం లేదని ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చెప్పి, చెప్పి నోరు పోతోంది కానీ.. పిల్లలు మాత్రం మాట వినడం లేదు అంటూ ఉంటారు. అయితే.. మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే.. పిల్లలు కూడా మనం చెప్పిన మాట వింటారు. కానీ దాని కోసం మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
పేరెంటింగ్ అనేది ఊహించని మలుపులు, సవాళ్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలను అర్థం చేసుకోవడం, పిల్లలు పేరెంట్స్ చెప్పేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కష్టమైన పని అయినా.. దానికి మన వంతు కృషి చేయాలి.
Parenting Tips-
ముందుగా.. పిల్లలతో పేరెంట్స్ ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఏర్పరుచుకోవాలి. దాని కోసం వారితో మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి.తల వంచుకొని.. పిల్లలు చెప్పేది వినకుండా విన్నాను అని చెప్పకుండా.. వారు మీకు చెప్పేది అయినా.. మీరు వారికి చెప్పేది అయినా సూటిగా కళ్లల్లోకి చూస్తూ మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెప్పే విషయం ఏంటి..? మీరు ఏ ఉద్దేశంతో చెబుతున్నారనే విషయం వారికి అర్థమౌతుంది.
అంతేకాదు.. మీరు పిల్లలకు ఏదైనా విషయం చెప్పేటప్పుడు వారిని ప్రేమగా కౌగిలించుకోవడం, ముద్దులివ్వడం, సున్నితంగా స్పర్శించడం లాంటివి చేయాలి. ఇవి పిల్లలకు, పేరెంట్స్ కి మధ్య భద్రను పెంచుతాయి. మీకు, మీ బిడ్డకు మధ్య నమ్మకపు వారధిని నిర్మిస్తాయి.
మీ పిల్లలతో సానుకూల పదాలను ఉపయోగించండి, ఉదాహరణకు, నువ్వు ఎప్పుడూ ఇలానే చేస్తావ్, నీకు రూమ్ నీట్ గా ఉంచుకోవడం రాదు ఇలా నెగిటివ్ పదాలతో కాకుండా.. దానిని పదాలను మార్చి.. సున్నితంగా పిలవాలి. ఈ మార్పు మీ పిల్లలను శక్తివంతం చేస్తుంది. నిర్ణయం తీసుకోవడంలో వారిని చురుకుగా పాల్గొనేలా చేస్తుంది. కాబట్టి పిల్లలను ప్రశ్నించినా.. పాజిటివ్ గా ఉండేలా సున్నితంగా అడగాలి.
పిల్లలు ఎక్కువగా స్వాతంత్ర్యం కోరుకుంటారు. కాబట్టి అధికారంతో వారిని ఆదేశించే బదులు, వారికి ఎంపికలు ఇవ్వండి. ఉదాహరణకు, "ఇప్పుడే మీ హోంవర్క్ చేయండి" అని చెప్పే బదులు, హోం వర్క్ ఏ టైమ్ కి చేస్తావ్ అని సున్నితంగా అడగడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఛాయిస్ ఇవ్వడం వలన మీ బిడ్డకు శక్తి లభిస్తుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా పెరుగుతుంది.
మీ బిజీ జీవితంలో, మీ బిడ్డతో నాణ్యమైన సమయాన్ని గడపడం ముఖ్యం. ఇది మీ బంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఓపెన్ కమ్యూనికేషన్‌ను కూడా అనుమతిస్తుంది. ఇది ఆట సమయం అయినా, పుస్తకాన్ని చదవడం లేదా సంభాషణ అయినా, ఈ క్షణాలు మీ సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
ఓపెన్ మైండ్, ఓర్పు , తీర్పు లేని వైఖరితో, మీరు మీ అభిప్రాయాన్ని మీ పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చేయవచ్చు. ఇది ఒక్క రోజులో సాధ్యం కాకపోయినా, మీరు రోజూ ఇలా కంటిన్యూ చేయడం వల్ల.. పిల్లలను మీరు అర్థం చేసుకోగలుగుతారు. వారు కూడా మీరు చెప్పిన మాట వినడానికి ఆసక్తి చూపిస్తారు.