పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ చూడకూడదంటే ఇలా చేయండి
ఈ రోజుల్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిపోయారు. నిజానికి పిల్లలు ఇలా కావడానికి అసలు కారణం తల్లిదండ్రులనే చెప్పాలి. కానీ ఈ అలవాటు పిల్లల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. ఈ అలవాటు మాన్పియ్యాలంటే తల్లిదండ్రులు ఏం చేయ్యాలో తెలుసా?
ఎంతో మంది గంజాయి, మద్యం, సిగరెట్ వంటి చెడు అలవాట్లు బానిసలవుతున్నారు. బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేవలం ఇవే కాదు ఫోన్ వాడకం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఇది మందు, సిగరెట్ల కంటే ఈ డిజిటల్ వ్యసనమే చాలా డేంజర్.
8 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వరకు అందరూ ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. మొబైల్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలను తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఇప్పుడు అర చేతిలోకి వచ్చేసిందనే చెప్పాలి.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైతే .. దాని మాయలో పడితే రోజులు గంటల్లా గడిచిపోతాయి. కానీ ఈ అలవాటు ఎన్నో రోగాల బారిన పడేస్తుంది.
మొబైల్ వ్యసనం
మొబైల్ ఫోన్లను అవసరానికి మాత్రమే వాడాలి. దీన్ని 24 గంటలు చూసే బదులుగా స్నేహితులతో బయటకు వెళ్లండి, పుస్తకాలు చదవండి, పాటలు వినండి, ఇంట్లో వారితో ఆనందంగా గడపండి. అలాగే పగటి పూట రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయండి.
ఈ ఆధునిక యుగంలో పెద్దవారి కంటే పిల్లలే స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువగా బానిసలు అవుతున్నారు. కానీ ఇది ఆందోళన కలిగించే విషయం. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యం, సామాజిక, భావోద్వేగ శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
పిల్లల మొబైల్ వినియోగం
తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడానికి పిల్లల్ని ఎక్కువ సేపు ఫోన్ చూడకుండా చేయాలి. ఇందుకోసం కొన్ని చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే?
పరిమితులను సెట్ చేయండి
మీ పిల్లలకున్న ఈ డేంజర్ వ్యసనం నుంచి బయటపడేయడానికి, మొబైల్ ఫోన్‌లను చూసే సమయాన్ని తగ్గించండి. ప్రతిరోజూ లేదా వారం మీ పిల్లలు ఫోన్ ఉపయోగించే సమయాన్ని తగ్గించండి. అంటే రోజుకు 1 గంట మాత్రమే ఫోన్ చూడాలి, తినేటప్పుడు, నిద్రపోయే ముందు ఫోన్‌లను చూడకూడదని వారికి నియమాలను పెట్టండి.
ఈ లిమిట్స్ ను పాటిస్తే మీ పిల్లలు చాలా వరకు ఫోన్ చూడటాన్ని తగ్గిస్తాయి. అయితే మీ పిల్లల వయస్సు ఆధారంగా ఫోన్ చూసే సమయం మారుతుంది. కాబట్టి వాటిని ప్రతి పేరెంట్స్ తెలుసుకుని అందుకు అనుగుణంగా వారి అలవాటును మాన్పించాలి.
ఆరోగ్యకరమైన ప్రవర్తన
తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మీరు మెరుగ్గా చూడాలనుకుంటే వారి ప్రవర్తనను మీరు మోడల్ చేయాలి. ఇందుకోసం మీరు మీ పిల్లల ముందు ఫోన్ చూడటాన్ని తగ్గించాలి. మీరు ఎక్కువగా ఫోన్ చూసుకుంటూ, పిల్లలను మాత్రం ఫోన్ చూడొద్దని చెబితే వారు వినరు. వారు మారాలంటే ముందు మీరు ఫోన్ ను ఉపయోగించే సమయాన్ని తగ్గించాలి.
డిజిటల్ వ్యసనం వల్ల వచ్చే నష్టాల గురించి మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి చెప్పాలి.
స్క్రీన్-ఫ్రీ జోన్‌లు
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసే వారైతే..వీళ్లు పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి పడుకునే ముందు, తినేటప్పుడు పిల్లలతో మాట్లాడొచ్చు.వీళ్లు ఇంట్లోని కొన్ని ప్రాంతాలను అంటే బెడ్‌రూమ్ లేదా డైనింగ్ టేబుల్ వంటి వాటి దగ్గర ఫోన్ ను అస్సలు ఉపయోగించకూడదు. ఇలాంటి నియమాన్ని సెట్ చేండి. ఇది మీ పిల్లలు ఫోన్ చూడటాన్ని తగ్గిస్తుంది.
గేమ్స్
మీ పిల్లలు ఫోన్ చూసే సమయాన్ని తగ్గించి ఆటలు, పజిల్స్ వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయండి. ఇది వారిని ఫోన్ వ్యసనం నుంచి బయటపడేస్తుంది. దీనిలో వారి హాబీలు, గేమ్స్, ఇతర శారీరక శ్రమలు ఉంటాయి.
ఫోన్ చూడటం వల్ల కలిగే సమస్యల గురించి చెప్పండి
స్మార్ట్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలనువ వారికి అర్థమయ్యేలా చెప్పండి. ప్రతి పేరెంట్స్ ఈ విషయం గురించి ఖచ్చితంగా పిల్లలతో మాట్లాడాలి. ఎందుకంటే ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతుంది.