పిల్లలను సులభంగా నిద్రపుచ్చడం ఎలా..?
పడుకో.. పడుకో అని వారిని బెదిరించడం కాకుండా... వారి చెయ్యి పట్టుకొని వారి పక్కనే ఉండాలి మీరు. అంతేకాకుండా... వారికి కథలు చెప్పడం, పాటలు పాడటం, చిన్నపాటి మ్యూజిక్ వినిపించడం లాంటివి చేయాలి.
ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారంటే.. ఆ ఆనందమే వేరు. వారి బోసి నవ్వులు మనల్ని మరింత ఆనందపరుస్తాయి. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ... పిల్లలు ఉన్న ఇంట్లో ఆ తల్లిదండ్రులకు నిద్ర కరువౌతుంది. వాళ్లు ఎప్పుడు నిద్రపోతారో.. ఎప్పుడు నిద్రలేస్తారో మనం అస్సలు ఊహించలేం.
ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోకుండా లేచి ఏడుస్తూ ఉంటారు. లేదంటే... తమ పేరెంట్స్ ని నిద్రపోనివ్వకుండా అర్థరాత్రి ఆడుకుంటూ ఉంటారు. దీని వల్ల... పేరెంట్స్ కి సరైన నిద్ర ఉండదు. అయితే.. ఈ సమస్య లేకుండా... పిల్లలు ప్రశాంతంగా నిద్రపోయి.. మీకు కూడా నిద్రకు సమయం కావాలి అంటే... ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..
మనకు నిద్రవచ్చినప్పుడు.. పిల్లలు కూడా ప్రశాంతంగా నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందో. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవచ్చు. అయితే.. అది అంత సులభం కాదు. కాబట్టి... పిల్లలను త్వరగా నిద్రపుచ్చడానికి ప్రయత్నించాలి.
How to get toddlers to eat by themselves
ఆ సమయంలో.. పడుకో.. పడుకో అని వారిని బెదిరించడం కాకుండా... వారి చెయ్యి పట్టుకొని వారి పక్కనే ఉండాలి మీరు. అంతేకాకుండా... వారికి కథలు చెప్పడం, పాటలు పాడటం, చిన్నపాటి మ్యూజిక్ వినిపించడం లాంటివి చేయాలి.
ఇక పిల్లలకు మీరు నిద్రకు ఒక సమయాన్ని ఫిక్స్ చేయాలి. రోజూ ఒకే సమయానికి వారిని నిద్రపుచ్చే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల.. వారు ఒక సమయానికి అలవాటు పడతారు. దాని వల్ల వారు రోజూ ఒకే సమయానికి నిద్రపోతారు. దాని వల్ల.. ఆ సమయంలో మీరు ఇతర పనులు ప్లాన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.
రాత్రిపూట పిల్లలను నిద్రపుచ్చే సమయంలో గది విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పగలు నిద్రపుచ్చడానికైనా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గదిలో ఎక్కువ వెలుతురు లేకుండా.. డిమ్ లైట్ ఉంచాలి. వారు నిద్రపోయారు కదా అని లైట్లు వేయకూడదు. వారి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
అదేవిధంగా వారిని నిద్రపుచ్చే ముందు.. వారికి కడుపునిండా ఆహారం పెట్టాలి. ఈ విషయం మర్చిపోవద్దు. వారికి కడుపు నిండకపోతే... వారు మధ్య నిద్రలో లేచే అవకాశం ఉంది.
మనకు ఒక డైలీ రోటీన్ ఉన్నట్లే.. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. వారికంటూ ఒక రోటీన్ ఉంటే వారు చాలా సెక్యూర్డ్ గా ఉంటారు. అప్పుడు వారు ప్రశాంతంగా నిద్రపోగలరు. పిల్లల్లో అభద్రతా భావం లేకుండా చూసుకోవాలి. వారి చుట్టూ పరిసర ప్రాంతాలు వారికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి.