పిల్లలు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారా..? ఇలా సేవింగ్స్ నేర్పండి..!
మీ పిల్లలు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు అని మీకు అనిపిస్తుంటే.. కచ్చితంగా వారికి.. నేర్పించాల్సిన మనీ మేనేజ్మెంట్ ట్రిక్స్ కొన్ని ఉన్నాయి.
పిల్లలకు మంచి, చెడు ఏదో నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. అయితే.. కేవలం మంచి, చెడులు మాత్రమే కాదు.. డబ్బు విషయంలో బాధ్యతగా ఉండటం కూడా చిన్నతనం నుంచే నేర్పించాలి. చాలా మంది పిల్లలు ఈ మధ్యకాలంలో డబ్బు విలువ తెలుసుకోలేకపోతున్నారు. కనిపించిన ప్రతిదీ కావాలని అడుగుతూ ఉంటారు. అదే అలవాటు గా మారిపోతే.... పెద్దయ్యాక.. ఆ అలవాటును మాన్పించడం కష్టం అవుతుంది. పెద్దయ్యాక.. ఎంత డబ్బు సంపాదించినా.. ఆదా చేయలేరు. అందుకే.. చిన్నతనం నుంచే వారికి.. మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
మీ పిల్లలు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు అని మీకు అనిపిస్తుంటే.. కచ్చితంగా వారికి.. నేర్పించాల్సిన మనీ మేనేజ్మెంట్ ట్రిక్స్ కొన్ని ఉన్నాయి.
1.పిల్లల్లో డబ్బు ఆదాచేసే అలవాటు ఎలా నేర్పించాలి..?
పిల్లల్లో డబ్బు ఆదా చేసే అలవాటు పెంచాలంటే... డబ్బు ఎలా సంపాదిస్తారో వారికి వివరించడంతో పాటు... డబ్బుకు ఉన్న ప్రాధాన్యత కూడా వివరించాలి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడాలో పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. ఆ విషయం అర్థమైతే పిల్లలు ప్రతిదానికీ డబ్బు ఖర్చు చేయాలి అనుకోరు.
2.పిగ్గీ బ్యాంక్...
పిగ్గీ బ్యాంకును పిల్లలకు చిన్నతనంలోనే కొనివ్వాలి. అందులో డబ్బులు వేయమని ప్రోత్సహించాలి. రెగ్యులర్ గా మీరు వారితో దగ్గరుండి మరీ.. అందులో వేయించాలి. రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల.. పిల్లలకు అలవాటు అయ్యి.. డబ్బులు సేవ్ చేయడం అలవాటు చేసుకుంటారు. చిన్న పొదుపులే.. భవిష్యత్తులో చాలా ఎక్కువగా సహాయపడతాయి.
Children are told the importance of savings in this bank
సేవింగ్స్ ఎందుకు చేయాలో కూడా పిల్లలకు నేర్పించాలి...
ఈ డబ్బులు ఎందుకు సేవ్ చేయాలి అని పిల్లలు అడిగినా, అడకపోయినా మీరు వారికి ఆ విషయం, ప్రాముఖ్యత చెప్పాలి. వారు ఏదైనా బొమ్మ కావాలని అడుగుతున్నట్లయితే.. దాని కోసం.. ఇందులో మనీ సేవ్ చేసుకోవాలి అని చెబుతూ ఉండాలి. నువ్వు మనీ సేవ్ చేస్తేనే.. ఆ డబ్బుతోనే అది కొంటాను అని పిల్లలకు చెప్పాలి.
పిల్లలకు డబ్బు నిర్వహణ నేర్పడం చాలా ముఖ్యం. ఖర్చు చేసే ముందు ఆలోచించడం , డబ్బును ఎలా ఆదా చేయాలి వంటివి. ఈ పద్ధతులతో, మీరు మీ పిల్లలలో పొదుపు అలవాటును పెంపొందించవచ్చు. అనవసరమైన ఖర్చుల నుండి వారిని రక్షించవచ్చు.