కరోనా లాక్ డౌన్.. ఇంట్లో పిల్లలను కంట్రోల్ చేయడానికి టిప్స్..
మనం అంటే పెద్దవాళ్లం.. బయట ఏం జరుగుతోంది..? బయటకు వెళ్తే ఎంత ప్రమాదం..? ఎందుకు ఇంట్లోనే ఉండాలి అనే విషయాలపై ఓ అవగాహన ఉంటుంది.. వాటిని పాటిస్తాం. కానీ పిల్లలు అలా కాదు కదా. కొంచెం పెద్ద పిల్లలు అయితే.. చెబితే అర్థం చేసుకుంటారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది.లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా రోజూ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఎవరూ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే సాహసం చేయడం లేదు. ఇంట్లోనే ఉండిపోతున్నారు.
మనం అంటే పెద్దవాళ్లం.. బయట ఏం జరుగుతోంది..? బయటకు వెళ్తే ఎంత ప్రమాదం..? ఎందుకు ఇంట్లోనే ఉండాలి అనే విషయాలపై ఓ అవగాహన ఉంటుంది.. వాటిని పాటిస్తాం. కానీ పిల్లలు అలా కాదు కదా. కొంచెం పెద్ద పిల్లలు అయితే.. చెబితే అర్థం చేసుకుంటారు.
కానీ.. పూర్తిగా ఊహరాని.. బయటకు వెళ్లడం అలవాటైన పిల్లల పరిస్థితి ఏంటి..? రోజంతా ఇంట్లోనే అలా దాదాపు మూడు వారాలు ఉండాలంటే కష్టమే. ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఇప్పటికే ఆడేసుకొని ఉంటారు.
కొత్త బొమ్మలు కొనే పరిస్థితి కూడా కాదు. మరి వాళ్లను ఎలా కంట్రోల్ చేయాలి.. ఎక్కువ సేపు టీవీలకు కూడా వదిలేయలేం కదా. మరి వారి మెంటల్ హెల్త్ పాడవ్వకుండా ఉండాలంటే ఎం చేయాలనే విషయంలో ఇప్పటికే తల్లులు అవస్థలు పడుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలో మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హాస్పిటల్ (నిమ్హాన్స్) కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను అందించింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..
1. భరోసా.. ఈ సమయంలో పిల్లలకు తల్లిదండ్రుల భరోసా చాలా ముఖ్యం. వారి అవసరాలను అడిగి తెలుసుకోవాలి. వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ కదా అని టీవీలు, ఫోన్లకు అతుక్కోకుండా వారికంటూ సమయం కేటాయించాలి.
ఈ సమయంలో వారికి పుస్తకాలు చదివే అలవాటు చేయాలి. మీరే దగ్గరుండి కథలు చెప్పండి. నిద్ర పోయే ముందు బెడ్ టైమ్ స్టోరీస్ అలవాటు చేయాలి.
2. స్నేహితులను దూరం చేయొద్దు.. అప్పటి వరకు స్కూల్ కి వెళ్లడం అలవాటైన చిన్నారులు ఒక్కసారిగా ఇంట్లో ఉండాలంటే ఇబ్బంది పడతారు. స్కూల్లో స్నేహితులను , వారి పేరెంట్స్ ని మీరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. కాసేపు వాళ్లని వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోనివ్వాలి. బంధువులతో కూడా మాట్లాడటం లాంటివి చేయించాలి.
3.సున్నితంగా చెప్పండి. బయటకు వెళ్లొద్దు అని మీరు చెప్పే సమాధానం వాళ్లకు నచ్చకపోవచ్చు. ప్రతిసారి చేతులు కడుక్కో అనే విషయం కూడా వాళ్ల మనసుకి నప్పదు. కాబట్టి... బయట పరిస్థితులను వాళ్లకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయాలి. విసుక్కోకుండా ఓపికగా ఉండాలి. పిల్లలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
4.భయపెట్టకుండా.. అర్థవంతంగా చెప్పాలి.. కరోనా కారణంగా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ విషయాన్ని అంత మంది చనిపోతున్నారు... ఇంత మంది చనిపోతున్నారు అని పిల్లలకు చెప్పి భయపెట్టకూడదు. కాకపోతే దాని తీవ్రతను మాత్రం అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత ఉంది.
5. ఇండోర్ గేమ్స్... పిల్లలను ఇంట్లోనే ఆడుకునేలా ప్రోత్సహించాలి. క్రేయాన్స్, క్లే, పెయింటింగ్స్, డ్రాయింగ్ వంటి వాటిపై ఆసక్తి కలిగించేలా చేయాలి. ఏవైనా కొత్త గేమ్స్ కనిపెట్టి.. వాటితో పిల్లలను ఆడించాలి. అవసరమైతే పెద్దలు కూడా పిల్లలతో కలిసి ఆడాలి.