వివాదాస్పద తీర్పులిచ్చిన న్యాయమూర్తికి సుప్రీం షాక్..

First Published Jan 30, 2021, 2:18 PM IST

చిన్నారులపై లైంగిక నేరాల విషయంలో వివాదాస్పద తీర్పులిచ్చి దేశవ్యాప్తంగా సంచలనానికి తెరతీసిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైకోర్టులో ఆమెకు శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.