MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • భూమి వైపు దూసుకొస్తున్న ముప్పు - ప్ర‌పంచం అంతం కాబోతుందా? ఏంటి ఈ అపోఫిస్? పూర్తి వివ‌రాలు ఇవిగో

భూమి వైపు దూసుకొస్తున్న ముప్పు - ప్ర‌పంచం అంతం కాబోతుందా? ఏంటి ఈ అపోఫిస్? పూర్తి వివ‌రాలు ఇవిగో

What is this apophis : ప్రపంచం అంతం కాబోతోందా?  విశ్వం నుంచి భూమి వైపు దూసుకొస్తున్న ఈ ప్ర‌మాదం జీవ‌జాతుల‌ను అంతం చేస్తుందా? అనే ప్ర‌శ్న‌లు మ‌రోసారి నెట్టింట వైర‌ల్ గా మారాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం భారీ ఉల్క ఆకాశం నుంచి భూమి వైపు దూసుకురావ‌డ‌మే. అస‌లు ఏంటీ ఈ అపోఫిస్? ఎందుకు దీనిని పెద్ద ముప్పుగా చూస్తున్నారు?  

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 15 2024, 01:02 PM IST| Updated : Sep 15 2024, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

threat looming towards earth - apophis : ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త అంద‌రినీ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది. అదే అపోఫిస్. దీంతో ఈ భూమి అంతం కానుంద‌నే వార్త‌లు నెట్టింట‌ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అస‌లు ఏంటీ ఈ అపోఫిస్? ఎందుకంత అది ప్ర‌మాద‌క‌రం? అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25

అపోఫిస్ అనేది ఒక భారీ ఉల్క. ఈ భారీ ఉల్క ఆకాశం నుంచి భూమి వైపు దూసుకువ‌స్తోంది. ఇది భూమిని ఢీ కొట్టే ప్రమాదం చాలా పెద్దగా ఉంటుంది. ఈ ముప్పును అంత‌ర్జాతీయ ఖ‌గోళ ప‌రిశోధ‌న సంస్థ‌ల‌తో పాటు భార‌త‌ ఇస్రో కూడా పర్యవేక్షిస్తోంది. అయితే, ఇప్పుడు ప్ర‌ధాన విష‌యం, ముఖ్య ప్రశ్న ఏమిటంటే, ఈ ఉల్క నుండి భూమిని ఎలా రక్షించాలి?

భూమిని ఢీ కొన‌డానికి వ‌స్తున్న ఈ ప్ర‌మాద‌న్ని ఎలా త‌ప్పించాలి?  ఇంకా భూకికి ఎంత దూరంలో ఉంది? ఇది ఎప్పుడు భూమిని ఢీకొంటుంది? ఇది మొత్తం మానవాళికి ముప్పుగా మారుతుందా? అనే ప్ర‌శ్న‌లు చాలా మంది అడుగుతున్నారు. 

35
asteroids 2

asteroids 2

ఈ ఉల్క అంతరిక్షంలో భూమికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఒక పెద్ద మిస్టిరీయస్ థింగ్. ఇది ఒక గ్రహాన్ని నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఉల్క ఇప్పటికీ అంతరిక్ష రహస్యంగా మిగిలిపోయింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఉల్క ఒకటి భూమి వైపు వేగంగా కదులుతోంది. ఉల్క వేగం ఎంత? ఉల్క భూమిని ఎప్పుడు ఢీకొంటుంది? ఒక ఉల్క భూమికి ఎలాంటి నష్టం కలిగిస్తుంది? ఇవన్నీ చాలా పెద్ద  ప్రశ్నలే.

దీనికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఉల్కాపాతం దగ్గరకు వచ్చిందన్న వార్తతో ప్రపంచం మొత్తం కలకలం రేపుతోంది. శతాబ్దాలుగా మానవాళి భయపడుతున్న ఈ ఉల్క‌లు మ‌రోసారి యావ‌త్ ప్ర‌పంచాన్ని అల‌ర్ట్  చేసింది. 

45

మీడియా కథనాల ప్రకారం, భూమికి దగ్గరగా భారీ ఉల్క రాబోతోంది. దీని పేరు పేరు అపోఫిస్. ఈ ఉల్కను ఇస్రో పర్యవేక్షిస్తోంది. ఇది భూమికి చాలా దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రహశకలం ఈజిప్టు విధ్వంసక దేవుని పేరు పెట్టారు. సమాచారం ప్రకారం, ఈ ఉల్క 13 ఏప్రిల్ 2029 న భూమికి దగ్గరగా రావ‌డం లేదా భూమిని ఢీ కొన‌డం జ‌ర‌గ‌వ‌చ్చు. 

అయితే, ఆ ప్రమాదం గురించి ఇంకా ఖచ్చితమైన వివ‌రాల‌ను ప‌రిశోధ‌కులు వెల్ల‌డించ‌లేదు. కానీ భూమికి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు.. లేదా జ‌ర‌గ‌వ‌చ్చు. ఈ రెండు విష‌యాలలో ఖ‌చ్చితంగా ఏం జ‌రుగుతుంద‌నేది రానున్న మ‌రికొన్ని రోజుల‌ను బ‌ట్టి తెలుస్తుంది. అయితే, ఇప్ప‌టికే ఇస్రో ఒక పెద్ద గ్రహశకలం నుంచి మానవాళికి ప్రమాదం పొంచి ఉంద‌ని పేర్కొంది. 

55

ఇలాంటి ప్రమాదంపై ఇస్రో అప్రమత్తమైంది. నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ - అనాలిసిస్ అంటే NETRA అపోఫిస్‌ను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తుంది. రాబోయే ఎలాంటి ముప్పును అయినా ఎదుర్కోవటానికి ఇతర దేశాల నుండి కూడా సహాయం కూడా తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఉల్క భూమికి అత్యంత సమీపంలోకి వ‌స్తోంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. 

అయితే, అపోఫిస్ ఉల్క‌ను మొదటిసారి 2004లో  గుర్తించారు. ఇది 2029లో భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ఆ త‌ర్వాత‌ 2036లో రెండోసారి భూమికి ద‌గ్గ‌ర‌గా వస్తుందని అంచ‌నా వేశారు. ఇలాంటి నేప‌థ్యంలోనే భూమిపై దాని ప్రభావం గురించి అనేక ప్రశ్నలకు స‌మాధానాలు వెతికే ప‌నిలో ప‌డ్డారు ప‌రిశోధ‌కులు.

2029 లో భూమికి దగ్గరగా వస్తుంద‌ని పేర్కొంటున్న రిపోర్టుల మ‌ధ్య ప‌లువురు ఎర్త్ ను ఢీకొంటుంద‌నీ, అలాంటి అవ‌కాశం లేద‌ని మ‌రికొంద‌రు పరిశోధకులు వాద‌న‌లు చేస్తున్నారు. కానీ అంతరిక్షంలో కొనసాగుతున్న ఈ కదలికకు సంబంధించి ఎటువంటి నిర్దిష్ట వాదనలు లేవు. అటువంటి పరిస్థితిలో ఈ భారీ ఉల్క గ‌మ‌నం గురించి రాబోయే రోజులే ఖ‌చ్చిత‌మైన స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌వు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Recommended image2
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
Recommended image3
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved