షాకింగ్ సైబర్ స్కామ్ - డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళ బట్టలు విప్పించి 5 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు
Cybercrime - digital arrest : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి, కేంద్ర ఏజెన్సీల అధికారులుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు ఒక మహిళ నుంచి రూ.5 లక్షలు దోపిడి చేశారు.
Cybercrime - digital arrest : సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న దీని బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో ఒక షాకింగ్ సైబర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఏజెన్సీ అధికారులమంటూ ఒక మహిళను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి బట్టలు విప్పించారు. ఆ మహిళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు దోపిడి చేశారు. ఈ షాకింగ్ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది.
అహ్మదాబాద్‌లోని నారన్పురాకు చెందిన 27 ఏళ్ల మహిళకు సైబర్ నేరగాళ్లు సెంట్రల్ ఏజెన్సీలకు చెందిన అధికారులమంటూ ఫోన్ కాల్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి, కేంద్ర ఏజెన్సీల అధికారులుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు ఒక మహిళ నుంచి రూ.5 లక్షలు దోపిడి చేశారు.
నారన్‌పురా పోలీసులకు నమోదైన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ప్రకారం.. 132 ఫీట్ రింగ్ రోడ్‌లోని సమర్పన్ టవర్‌లో నివసిస్తున్న బాధితురాలు హేమాలి పాండ్యాకు కొరియర్ కంపెనీ ఉద్యోగిగా నటిస్తూ అక్టోబరు 13న అనుమానాస్పద కాల్ వచ్చింది. మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్ఫోన్లు, 150 గ్రాముల మెఫెడ్రోన్, 1.5 కిలోల దుస్తులు ఉన్న ఆమె పేరుతో పార్శిల్‌ను థాయ్‌లాండ్‌కు పంపినట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. అందువల్ల సైబర్ క్రైమ్ అధికారులను అత్యవసరంగా సంప్రదించాలని పాండ్యాకు సూచించాడు.
Cyber Fraud
ఆమె భయాందోళనకు గురై పాండ్యా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ పేరుతో మరో నెంబర్ కాన్ఫరెన్స్ కాల్ కు చేరారు. ఢిల్లీ సైబర్ క్రైమ్ ఆఫీసర్‌గా నటిస్తున్న వ్యక్తి నుండి వాట్సాప్ కాల్ లో మాదక ద్రవ్యాల విచారణలో ఆమె పేరు బయటపడిందని అధికారిగా నటించిన వ్యక్తి చేప్పి భయపెట్టాడు. వీడియో కాల్ చేయాలని చెప్పాడు. వీడియో కాన్ఫరెన్స్‌లోకి రావడానికి వెనుకడుగు వేయగా, ఆమెకు నకిలీ ఎఫ్ఐఆర్, ఫిర్యాదుల రిపోర్టులను పంపారు. దీంతో బాధితురాలు భయాందోళనకు గురై వీడియో కాల్ లోకి వచ్చారు.
మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయని ఆమె భయపెట్టారు. భయాందోళనకు గురైన పాండ్యాకు ఒక వ్యక్తి తన ముఖాన్ని చూపించకుండా డిజిటల్ అరెస్టు పేరుతో తన గుర్తింపు నిరూపించుకోవడానికి ఆమె బట్టలు విప్పి తన పుట్టుమచ్చలను చూపించాలని డిమాండ్ చేశాడు. ఆమె మొదట సంకోచించినప్పటికీ, జైలు శిక్ష బెదిరింపులకు భయపడి వీడియో కాల్ లో బట్టలు విప్పింది.
ఈ సైబర్ నేరగాళ్లు అంతటితో ఆగకుండా ఆమెను భయపెట్టి ఆమె నుంచి దాదాపు 5 లక్షల రూపాయలను స్వాహా చేశారు. ఆమె ఖాతాలో నుంచి డబ్బులు పోయిన వెంటనే కాల్ కట్ అయింది. నేరస్థులతో సంబంధం ఉన్న అన్ని కాంటాక్ట్ నంబర్లు కొద్దిసేపటికే డీయాక్టివేట్ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.