శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు.. డాగ్ బ్రీడర్ కి సీసీబీ నోటీసులు
డాగ్ బ్రీడర్ సతీష్ కదాబామ్స్ కి సీసీబీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు కారణంగా శాండిల్ వుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందా అని అంతా భయపడిపోతున్నారు.
ఇప్పటికే ఈ కేసులో సంజన, రాగిణి ద్వివేది వంటి హీరోయిన్లు అరెస్టు అయ్యారు. వారిని విచారించగా... మరికొందరు పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఫేమస్ డాగ్ బ్రీడర్ ఒకరిని సీసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ డ్రగ్స్ కేసులో ఓ నిర్మాత కూడా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అతనికి కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
కాగా.. ప్రముఖ డాగ్ బ్రీడర్ కి కూడా డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
డాగ్ బ్రీడర్ సతీష్ కదాబామ్స్ కి సీసీబీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
నటి సంజన కి ఈ సతీష్ చాలా క్లోజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతనికి కూడా ఈ డ్రగ్స్ కేసు చుట్టుకుంది.
డ్రగ్ డీలర్స్ తో సతీష్ కి సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతనిని విచారిస్తున్నారు.
కాగా.. సీసీబీ నోటీసులు అందుకున్న సతీష్.. దర్యాప్తు కోసం సీసీబీ కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా.. గతంలో సతీష్.. సంజనాతో కలిసి చాలా పార్టీలో కనిపించారు.
సెలబ్రెటీల ప్రైవేటు పార్టీస్ లో ఈయన కచ్చితంగా పాల్గొంటాడు.
బెంగళూరులో సతీష్.. ఫేమస్ సెలబ్రెటీ డాగ్ బ్రీడర్ గా గుర్తింపు ఉంది.
ఇక సెలబ్రెటీ పార్టీలకు వెళ్లిన ప్రతిసారీ.. సతీష్, సంజనాలు కలిసి ఫోటోలు దిగేవారు. ఆ ఫోటోల్లో వారు చాలా చనువుగా కనిపించేవారు.