Adventure: ప్యాంగాంగ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రోజెన్ లేక్ మ్యారథాన్ (PHOTOS)
లడాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు సముద్ర మట్టానికి సుమారు 14 వేల అడుగులో ఎత్తులో ఉంటుంది. ఇది ఇప్పుడు ఘనీభవించి ఉన్నది. ఈ ఘనీభవించిన ప్రపంచలో ఎత్తులోని ఫ్రోజెన్ లేక్ ప్యాంగాంగ్ పై మారథాన్ నిర్వహించారు.
frozen pangon lake marathon
లడాఖ్‌లో ఘనీభవించిన ప్యాంగ్యాంగ్ సరస్సుపై రెండో విడత మ్యారథాన్‌ను ఫిబ్రవరి 20వ తేదీన విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలోనే అతి ఎత్తులో ఉన్న ఫ్రోజెన్ లేక్‌లో ఈ మ్యారథాన్‌ను లడాఖ్ ప్రభుత్వం, 14 కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సహకారంతో అడ్వెంచర్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ లడాఖ్ నిర్వహించింది. ఏడు దేశాల నుంచి వచ్చిన 120 మంది రన్నర్లు ఈ మ్యారథాన్‌లో పాల్గొన్నారు. 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు రెండు కేటగిరీల్లో ఈ మ్యారథాన్ నిర్వహించారు.
frozen pangon lake marathon
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ శాఖ కార్యదర్శి రవీందర్ కుమార్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. చుషుల్ కౌన్సిలర్ కొంచొక్ స్టాంజిన్ ఆయనతో పాటుగా పాల్గొన్నారు. హిమానీనదాలు వేగంగా కరిగిపోవడంపై అవగాహన తేవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మ్యారథాన్ నిర్వహించారు. భూతాపం వల్ల ఘనీభవించిన ప్యాంగాంగ్ సరస్సుపై ఇదే చివరి పరుగుగా మారుతుందా? అనే చర్చ జరిగేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే.. చంగ్తాంగ్‌లో శీతాకాల పర్యాటకాన్ని ప్రమోట్ చేసే లక్ష్యం కూడా ఈ మ్యారథాన్ నిర్వహణ వెనుకు ఉన్నది.
frozen pangon lake marathon
మాన్, మేరక్, స్పాంగ్ మిక్, ఫొబ్రాంగ్ వంటి ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లోని నివాసులు క్రియాశీలకంగా ఇందులో పాల్గొన్నారు. భారీ హిమపాతం కురుస్తున్న, ఘనీభవించే ఉష్ణోగ్రతల నడుమ మైనస్ 15 డిగ్రీల వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచలోనే అతి ఎత్తులో అంటే 14,273 అడుగుల ఎత్తులో ఉన్న ప్యాంగాంగ్ సరస్సులో ఈ మ్యారథాన్ నిర్వహించారు.
frozen pangon lake marathon
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి భద్రత ప్రథమ ప్రాధాన్యంగా తీసుకున్నారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు హాట్ వాటర్ పాయింట్ల ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. చలి నుంచి బాడీ తట్టుకోవడానికి జాకెట్లు, రెయిన్ కోట్లు వంటివి కచ్చితంగా ధరించేలా చూశారు.
frozen pangon lake marathon
అలాగే.. పర్యావరణ హితంగా ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడలేదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వినియోగించలేదు. భిన్నమైన ప్రాంతాలు, సంస్కృతుల నుంచి ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేసి పర్యావరణ సంక్షోభం అనే పెద్ద సమస్యను గుర్తించే ప్రయత్నం జరిగింది.