MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • విజయ్ ‘వారిసు’(వారసుడు) రివ్యూ

విజయ్ ‘వారిసు’(వారసుడు) రివ్యూ

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’.తమిళంలో ఈ రోజు ఈ చిత్రం రిలీజైంది. 

4 Min read
Surya Prakash
Published : Jan 11 2023, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) వారిసు చిత్రం ఈ రోజు రిలీజైంది.  తెలుగులో వార‌సుడు పేరుతో రాబోతున్న ఈ సినిమా ముందుగా తమిళంలో విడుదల చేసారు. తమిళ హీరో విజయ్ చిత్రం అయినా ఇందులో తెలుగు వారి పాత్ర ఎక్కువ. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు (DilRaju) వారిసు సినిమాను నిర్మించారు. త‌మిళంలో ఆయ‌న నిర్మిస్తోన్న మొద‌టి సినిమా ఇదే కావ‌డం విశేషం. అలాగే తెలుగు స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. తెలుగువారి అభిమాన స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా  వారిసులో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తోంది. తెలుగు నుంచి జ‌య‌సుధ‌, శామ్‌, శ్రీకాంత్‌, సంగీత‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళంలో ఎలా ఉంది...కథేంటి వంటి విషయాలు చూద్దాం.
 

29
varisu

varisu

కథాంశం:
 

ఇది వారసుడు ఎంపిక చుట్టూ తిరిగే కథ. రాజేంద్రన్(శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ టైకాన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్) వీళ్లలో ఎవరికి అప్పచెప్పాలనే ఆలోచనలో ఉంటాడు. విజయ్ తన తండ్రి విధానాలు నచ్చక, అభిప్రాయాలు భేదాలు వచ్చి ,విభేధించి ఇంటినుంచి బయిటకు వెళ్లిపోతాడు. జై,అజయ్ ల కన్ను మాత్రం ఈ చైర్మన్ కుర్చీపైనే ఉంటుంది. ఎలాగో వ్యాపార ప్రత్యర్దులు జయ్ ప్రకాష్(ప్రకాష్ రాజ్) ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రాజేంద్రన్ తన టైమ్ అయ్యిపోయిందని గ్రహిస్తాడు. తన సామ్రాజ్యానికి అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్...తన మంచితనం, కుటుంబం పట్ల ప్రేమ, బిజినెస్ తెలివితో ఎలా తనే వారసుడు అనిపించుకున్నాడు. తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు. ప్రత్యర్దిగా ఉండి కుట్ర చేస్తున్న జయప్రకాష్ కి ఎలా బుద్ది చెప్పాడు. బీటలు తీసిన  తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు..రష్మికతో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

39
varisu special premiere starts at chennai sathyam cinemas chennai

varisu special premiere starts at chennai sathyam cinemas chennai


 
ఎలా ఉంది....

వారిసు చిత్రం చూస్తూంటే...మనకు మణిరత్నం నవాబ్ సినిమా గుర్తు వస్తుంది. అయితే అందులో గ్యాంగస్టర్ బ్యాక్ డ్రాప్ . ఇక్కడ కార్పోరేట్ బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుంది. కుటుంబం ..ముగ్గురు కొడుకులు..సంస్దలో ఛైర్మన్ పదివి కోసం సొంతవాళ్లనే వెన్ను పోటు పొడిచే మనస్తత్వం..ఇవన్నీ ఈ కథలో కమపడతాయి. అయితే ఆ స్పీడు అయితే నేరేషన్ లో కనపడదు. ప్లాట్ గా కథ రొటీన్ గా అనిపించేలా మొదలవుతుంది. మైనింగ్ డీల్స్ క్లాష్ జేపి (ప్రకాష్ రాజ్) గ్రూప్ , రాజేంద్ర గ్రూప్ (శరత్ కుమార్) తో సినిమా ప్రారంభం అవుతుంది. రా తలైవా సాంగ్ తో మాసీగా విజయ్ ఇంట్రడక్షన్ చేస్తారు. అప్పుడుశరత్ కుమార్ కొడుకులు శ్రీకాంత్,కిక్ శ్యామ్, విజయ్ అని పరిచయం చేస్తారు. ఇది శరత్ కుమార్ ఫ్యామిలీ కథ అని అర్దమవుతుంది. తండ్రితో గొడవపడి ఏడేళ్లపాటు దూరంగా ఉన్న విజయ్ తిరిగి రావటంతో కథలో కదలిక వస్తుంది. అలా కథలోకి మెల్లిగా వెళ్లి....ఫ్యామిలీ సీన్స్ కు ప్రయారిటీ ఇస్తూ విజయ్ ని మధ్య మధ్యలో గుర్తు వచ్చినప్పుడు  ఎలివేట్ చేస్తూ  కథ కాంప్లిక్ట్ లో పడేదాకా నడుపుతారు. ఇంట్రవెల్ చిన్న ట్విస్ట్.తర్వాత విజయ్...తన తండ్రి బిజినెస్ ఎంపైర్ ని చేతుల్లోకి తీసుకుని ఏరివేత కార్యక్రమం మొదలెట్టడం జరుగుతుంది. అంతా ప్రెడిక్టుబుల్ గానే సాగుతుంది.

49


 అయితే ఇక్కడ దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన తెలివైన పని ఏమిటి అంటే #ThalapathyVijay పాత బ్లాక్ బస్టర్ సినిమాలను గుర్తు చేస్తూ వింటేజ్ విజయ్ ని చూపిస్తూ...ఆ మెమెరీస్ ని తట్టి లేపే కొన్ని సీన్స్ ని ఎంచుకోవటం. కెరీర్ ప్రారంభంలో విజయ్ చేసిన సినిమాల్లో హైలెట్స్ ఇక్కడ ప్లే అవుతూంటాయి. అవి ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్ కు పండగ చేసేవే. అయితే విజయ్ సినిమాలు ఫాలో కాని వారు మాత్రం ఆ స్దాయిలో ఎంజాయ్ చేయలేరు. అయితే అవి అంత ఫోర్స్ గా అనిపించవు. కథలో భాగంగా వచ్చేస్తాయి. సెకండాఫ్ లో కామెడీ, హీరోయిజం ను మీటర్ ప్రకారం మ్యాటర్ లో కలిపి అందించిన కాక్ టెయిల్ . మధ్య మధ్యలో సెంటిమెంట్ సీన్స్ ని పేర్చారు. అదృష్టం ఏమిటి అంటే మరీ మెలోడ్రామా వైపుకు టర్న్ చేయకపోవటం.   కాస్త ఓల్డ్ ఫ్యాషన్ గా అనిపించినా అంతర్లీనంగా ఈ సినిమా తనేంటో తాను తెలుసుకోవటం, కుటుంబ అనుబంధాలు, కుటుంబానికి మనమేం తిరిగి ఇవ్వగలం,ఫ్యామిలీనే ప్రాధాన్యం అనే అంశాలు చుట్టూ తిరుగుతుంది. రొమాంటిక్ ట్రాక్, విలన్ ట్రాక్ కేవలం అద్దకాలు మాత్రమే. 

59
varisu has 400 plus screens on opening day in kerala vijay pongal release

varisu has 400 plus screens on opening day in kerala vijay pongal release


హైలెట్స్
వింటేజ్ విజయ్
కామెడీ వన్ లైనర్స్
యోగిబాబుతో వచ్చే సీన్స్

మైనస్ లు 

రొటీన్ కథ
ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే
ఫ్యాన్స్ కు నచ్చే సీన్స్ కు ప్రయారిటీ ఇవ్వటం

69
vijay character explaining in varisu Vamshi Paidipally

vijay character explaining in varisu Vamshi Paidipally

టెక్నికల్ గా ....

దర్శకుడుగా వంశీ పైడిపల్లి ...విజయ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా హిట్ కొట్టాలనే చేసిన డిజైన్ కనిపిస్తుంది. అదే సమయంలో పాత కథ కాస్త ఇబ్బంది పెడుతుంది. 
 పాటల్లో రెండు బాగున్నాయి. మిగతా సాంగ్స్ పర్వాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ, యాక్షన్ ఎపిసోడ్స్‌లో మ్యూజిక్‌కి ప్రశంసలు దక్కాల్సిందే.  

ఇక రిచ్ విజువల్స్ తో  సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. పాటల్లో , క్లైమాక్స్‌లో వచ్చే  యాక్షన్ సీన్లలో కెమెరాపనితనాన్ని చూపించారు. ఇక రష్మిక షోను మరింత అందంగా ఆకర్షణీయంగా చూపించి ప్రేక్షకులు చూపుతిప్పుకోకుండా చూపించారు.  ఎడిటింగ్ వర్క్ బాగుంది. దిల్ రాజు బాగా ఖర్చు పెట్టారని అర్దమవుతుంది.

79

నటీనటుల్లో ...

ఇది పూర్తిగా విజయ్ భుజాలమీద మోసిన చిత్రం. అదిరిపోయే ఫన్నీ వన్ లైనర్స్ తో టెర్రపిక్ గా తెరపై విజయ్ చెలరేగిపోయాడు. ముఖ్యంగా తన నిజ జీవితానికి సంభందించిన రిఫరెన్స్ పంచ్ లు కు మామూలు రెస్పాన్స్ రావటం లేదు. సెంటిమెంట్ సీన్స్ ని తన అనుభవంతో లాగేసాడు.  రష్మిక గురించి పెద్దగా చెప్పుకోనేది ఏమీలేదు . ప్రకాష్ రాజ్, జయసుధ వంటి వారు తమదైన నటన చేసుకుంటూ వెళ్లిపోయారు. విలన్ ట్రాక్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎస్ .జె సూర్య కనపడేది కాసేపే అయినా హైలెట్ గా నిలిచాడు.

89


చూడచ్చా

ఓవరాల్‌గా విజయ్ పాత  సినిమాలను ఇష్ట పడేవాళ్లకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది. ఇంకా ఈ రోజుల్లో ఈ పాత కథేంటిరా అనుకుంటే మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది.
Rating: 2.75
 

99


బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
నటీనటులు : విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు
 సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్:  కెఎల్ ప్రవీణ్
డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్
ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్
మేకప్: నాగరాజు
కాస్ట్యూమ్స్: దీపాలి నూర్
పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న
వీఎఫ్ఎక్స్: యుగంధర్
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved