Chinna Movie Review: `చిన్నా` మూవీ రివ్యూ, రేటింగ్..
హీరో సిద్ధార్థ్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం `చిన్నా`. చైల్డ్ అబ్యూజింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
హీరో సిద్ధార్థ్ తెలుగులో మంచి గుర్తింపు, ఇమేజ్ ఏర్పర్చుకున్నాడు. `బొమ్మరిల్లు`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` వంటి చిత్రాలతో తెలుగు హీరోగా మారిపోయాడు. కానీ ఆ తర్వాత ఆయనకు సరైన విజయాలు రాలేదు. దీంతో తెలుగుకి గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల మళ్లీ పేరుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య `టక్కర్` చిత్రంతో వచ్చాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు `చిన్నా` అనే మూవీతో ఓ సెన్సిటివ్ సబ్జెక్ట్ తో వస్తున్నారు. దీనికి ఆయనే నిర్మాత కావడం విశేషం. ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూపొందింది. తెలుగులో డబ్ చేసి ఈ శుక్రవారం(అక్టోబర్ 6) ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చారు. చిన్న(ఆడ) పిల్లలపై అత్యాచారాలు అనే సెన్సిటివ్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది (Chinna Movie Review) రివ్యూలో తెలుసుకుందాం.
కథః
చిన్నా అలియాస్ ఈశ్వర్(సిద్ధార్థ్) మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటారు. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాప చిట్టిలకు సపోర్ట్ గా ఉంటాడు. చిట్టినీ రోజూ స్కూల్‌కి డ్రాప్ చేయడం, పికప్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఎస్‌ఐ అయినా స్నేహితుడుతో చిల్ అవుతుంటాడు. అలాగే ఆయనకో లవ్ స్టోరీ ఉంటుంది. అమ్మాయి శక్తి(నిమిషా సజయన్) కూడా మున్సిపల్ డిపార్ట్ మెంట్‌లోనే పనిచేస్తుంది. అయితే వారి పట్టణంలో చిన్న పిల్లల కిడ్నాప్, అత్యాచార ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అవి జనాలను ఆందోళనకు గురి చేస్తుంటాయి. ఓ రోజు చిట్టి, తన స్నేహితురాలు మున్ని పాడుబడ్డ గుడి సమీపంలో జింకలు ఉన్నాయి, చూద్దామని ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. కట్ చేస్తే చిట్టి మధ్యలోనే వచ్చేస్తుంది. ఒంటరిగా మున్ని వెళ్తుంది. అప్పట్నుంచి మున్ని భయపడుతూ సైలెంట్‌గా ఉంటుంది. ఆ పాపపై అత్యాచారం జరిగిందని తేలుతుంది. దానికి చిన్నానే కారణం అని అంతా నమ్ముతారు. అతన్ని చిత్తకొట్టి పోలీస్ స్టేషన్‌లో పెడతారు. వదిన కూడా అతన్ని అనుమానిస్తుంది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోతాడు చిన్నా. అంతలోనే చిట్టి కూడా మిస్ అవుతుంది. చిట్టిని స్నేహితుడు ఎస్‌ఐతో కలిసి చిన్నా వెతుకుతుంటాడు. ఈ క్రమంలో ఓ చిన్నారి డెడ్ బాడీ దొరుకుతుంది. 90శాతం కాలిపోయిన దశలో పోలీసులు గుర్తిస్తారు? మరి ఆ పాప ఎవరు? చిట్టి ఏమైంది? చనిపోయిన పాప చిట్టినేనా? మున్ని కి ఏమైంది? అత్యాచార ఘటనలకు కారకులు ఎవరు? చివరికి చిన్నా ఏం చేశాడు? తనపై పడ్డ నిందకి సమాధానం ఏంటి? (Chinna Movie Review) అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
చైల్డ్ అబ్యూసింగ్(ఆడపిల్లలపై అత్యాచారాలు, వేధింపులు) సమాజంలో తరచూ జరుగుతుంటాయి. మైనర్ బాలికలపై అత్యాచారాలు, వేధింపులనేది మనుషులను కదిలిస్తుంటాయి. ఆ హృదయ విదారక ఘటనలు చూస్తే ఎలాంటి వారైనా కరిగిపోవాల్సిందే. హృదయం బరువెక్కిపోవాల్సిందే. అలాంటి ఘటనలపై అడపాదడపా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచి ఆదరణ పొందుతున్నాయి. సిన్నియర్‌గా చేసిన ప్రయత్నాలు ఎప్పుడూ తేడా కొట్టలేదు. ఆ మధ్య సాయి పల్లవి నటించిన (Chinna Movie Review) `గార్గి`, `లవ్ స్టోరీ` కూడా అలాంటి కాన్సెప్ట్ తో వచ్చినవే. `లవస్టోరీ`లో లైటర్ వేలో టచ్ చేశారు. `గార్గి` దాని చుట్టే సాగుతుంది. ఇది క్రిటికల్‌గా మంచి ప్రశంసలందుకుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధార్థ్ `చిన్నా` మూవీ చేశాడు. కథ నచ్చి ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. పూర్తి చైల్డ్ అబ్యూసింగ్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా సాగుతుంది. పూర్తి సీరియస్ మోడ్‌లో ఎమోషనల్ గానే ఈ కథ రన్ కావడం విశేషం.
సినిమా ప్రారంభంలో కథని ఎస్టాబ్లిష్ చేయడానికి టైమ్ తీసుకున్నారు దర్శకుడు. పాత్రలను, ఊరి వాతావరణాన్ని, చైల్డ్ అబ్యూజింగ్ ఘటనలు చూపించాడు. ఇలా సినిమాలోకి, దాని సీనియస్ నెస్‌లోకి ఆడియెన్స్ ని తీసుకెళ్లేందుకు కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక మున్నిపై చిన్నా అత్యాచారం చేశాడనే ఆరోపణలతో కథ వేగం పుంజుకుంటుంది. సీరియస్‌లోకి, అట్నుంచి పూర్తిగా ఎమోషనల్ డ్రైవ్ తీసుకుంటుంది. ఆ ఎమోషనల్ డోస్ క్రమ క్రమంగా (Chinna Movie Review) పెంచుకుంటూ వెళ్లారు. చిన్నాని అనుమానించి చిత్తకొట్టడం, నిందించడం, దారుణంగా అవమానించడం వంటి సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయి. ఆయా సీన్లని మరి రాగా చూపించారు. రియల్ లైఫ్‌లో మన చుట్టూ జరిగిన సంఘటనలే గుర్తొచ్చేలా అంతటి సహజంగా ఆయా సన్నివేశాలు చూపిండంతో పర్సనల్‌గా ఆ కథతో, సన్నివేశాలతో మనం బాగా కనెక్ట్ అవుతాం. ఓ చిన్నారిని దుండగులు కాల్చి చంపడంతో ఆ పాప ఎవరు అనేది నిర్థారించే సన్నివేశాలు హార్ట్ బీట్ పెంచేలా ఉంటాయి.
సెకండాఫ్‌లో చిట్టిని వెతికే సన్నివేశాలే సాగుతాయి. ఆయా సీన్లు చాలా వరకు లాగ్ అనిపిస్తుంటాయి. అయితే ఆ ఎమోషన్‌ని క్యారీ చేసేందుకు దర్శకుడు కాస్త డిటెయిలింగ్‌లోకి వెళ్లడంతో కొంత బోర్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ మధ్య మధ్య కొంత ఎమోషనల్ టచ్ ఇస్తూ గుండెని పిండేసేలా చేస్తాడు. పాపని చిత్ర హింసలు చేయడం, పోలీసుల నుంచి దుండగుడు తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సిల్లీగా ఉంటాయి. నిందితుడు అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది? కానీ పోలీసులు కదలకపోవడం అక్కడక్కడే తిరగడం వంటి సీన్లు కాస్త నిరాశ పరుస్తుంటాయి. అయితే చివర్లో ఎమోషనల్ సీన్లు, చిట్టి కోసం చిన్నా పడే బాధ మరింతగా కదిలిస్తుంది. సీరియస్‌నెస్‌లో డెప్త్ పెంచుతూ వెళ్లడంతో ఎమోషనల్ డోస్ మరింత పెరుగుతుంది. అవి కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి.
మరోవైపు విలన్ అనే వ్యక్తిని చాలా అనామకుడిగా, బలంగా (Chinna Movie Review) చూపించలేకపోయారు. పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పారు, ఆ సమయంలో ఆడవారికి, పిల్లలకు మనం ధైర్యంగా ఉండాలని, నేరస్తులను చంపడం పరిష్కారం కాదని చెప్పిన సమాధానం కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అయితే ఆడియెన్స్ ఎమోషన్స్ ని మరో రూపంలో సాటిస్పై చేసే ప్రయత్నం చేశారు, కానీ అది తేలిపోయింది. క్లైమాక్స్ ని మరింత హై గా తీసి ఉంటే బాగుండేది. సినిమాలో పెద్దగా ట్విస్ట్ లు కూడా లేవు. దీంతో చాలా వరకు ఫ్లాట్‌గా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ విషయాలపై ఫోకస్ పెడితే సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండేది. అయినా ఇదొక జెన్యూన్ అటెంప్ట్. ప్రశంసించదగ్గ ప్రయత్నం. సినిమా కోసం సిద్ధార్థ్, దర్శకుడు పడ్డ కష్టం, వారి ఎఫర్ట్స్ ని అభినందించాల్సిందే.
నటీనటులుః
చిన్నా పాత్రలో సిద్ధార్థ్ పరకాయ ప్రవేశం చేశాడు. చాలా సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఓ కొత్త సిద్ధార్థ్‌ని చూపించాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. అర్థ నగ్న సీన్లు కూడా చేయడం అంటే ఈ కథని ఆయన ఎంతగా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. పాత్రకి, కథకి ఎంతవరకు కావాలో అంతగా చేసి మెప్పించాడు. తన బెస్ట్ ఇచ్చాడు. మధ్యతరగతి కుర్రాడిగా కనిపించి మనల్ని మనకు గుర్తు చేశాడు. చాలా వరకు కళ్లతోనే నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో (Chinna Movie Review) కన్నీళ్లు పెట్టించాడు. సిద్ధార్థ్ లవర్ పాత్రలో నిమిషా సజయన్ సైతం చాలా సహజంగా చేసింది. డీ గ్లామర్ రోల్‌లో మెప్పించింది. సిద్ధార్థ్ వదినగా అంజలి నాయర్ చాలా బాగా చేసింది. అలాగే చిన్నా ఫ్రెండ్ ఎస్‌ఐ పాత్ర దారి సినిమాకి మరో అసెట్. అతను అత్యంత సహజంగా నటించి మెప్పించాడు. మన ఫ్రెండ్‌ని గుర్తు చేశాడు. మున్ని, చిట్టిలు చిన్న పిల్లలైనా సహజంగా చేసి ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రదారులు సహజంగా కనిపించారు.
టెక్నీకల్‌గాః
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకం. ఆ విషయంలో విశాల్ చంద్రశేఖర్ న్యాయం చేశాడని చెప్పాలి. సస్పెన్స్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆయన బీజీఎంతో సీన్లు ఎలివేట్ కావడంతో ఆడియెన్స్ గుండెల్ని బరువెక్కిస్తాయి. కంటతడిపెట్టిస్తాయి. బాలాజీ సుబ్రమణ్యం కెమెరా వర్క్ బాగుంది. చాలా నీట్‌గా ఉంది. ప్రతి ఫ్రేమ్ బాగుంది. విజువల్‌గా ది బెస్ట్ ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌లో సిద్ధార్థ్ రాజీపడలేదు. సినిమాకి తగ్గట్టుగా ఖర్చుపెట్టాడు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే (Chinna Movie Review) అరుణ్ కుమార్ సినిమాని చాలా వరకు రియలిస్టిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. సినిమా అంటే హీరోయిజం, ఫైట్లు, సాంగులు అని కాకుండా వాస్తవ సంఘటనలను వెండితెరపై ఆవిష్కరించాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఇన్వెస్టిగేషన్ సీన్లు, క్లైమాక్స్ విషయంలో ఇంకా బాగా వర్క్ చేయాల్సింది. రొటీన్‌కి భిన్నంగా చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ అది తేలిపోయినట్టుగా,ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసేలా లేకపోవడంతో అక్కడ సినిమా డ్రాప్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది.
ఫైనల్‌గాః టైటిలే `చిన్నా`.. సందేశం పెద్దదే. ఆలోచింప చేసే చిత్రం. పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించే సినిమా.
రేటింగ్‌ః 2.75