దేశంలోనే అతిపెద్ద సెగ్మెంట్: ఒక్కసారి గెలిపించి మరోసారి షాక్

First Published 18, Mar 2019, 12:45 PM

 మల్కాజిగిరి పార్లమెంట్  నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి గెలిపించిన అభ్యర్ధిని మరోసారి గెలిపించలేదు.ఈ దఫా ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

2008లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల డీలీమిటేషన్ తర్వాత మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం దేశంలోనే అత్యంత పెద్దదైన నియోజకవర్గంగా పేరొందింది.

మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు.

2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సర్వే సత్యనారాయణ పోటీ చేసి విజయం సాధించారు.2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మల్లారెడ్డి విజయం సాధించారు. మల్లారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్‌లో మల్లారెడ్డికి చోటు దక్కింది.

2016 ఫిబ్రవరి మాసంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం నుండి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు టీఆర్ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కన్పిస్తోంది.ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది.

ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడ టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఉప్పల్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ పోటీ చేసి విజయం సాధించింది. ఈ స్థానంలో కూడ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో సుమారు 70 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం రాహుల్, మోడీ మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టుగా కూడ కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాడు.

ఇదే పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా రామచంద్రరావు పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి కేసీఆర్ లబ్దిపొందాడని రామచంద్రరావు ఆరోపించారు. ఎమ్మెల్సీగా తాను మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అనేక రకాలుగా సేవ చేసినట్టుగా ఆయన వివరించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త బీఎస్పీ తో కలిసి పోటీ చేస్తోంది. ఈ స్థానం నుండి బి.మహేందర్ రెడ్డిని జనసేన బరిలోకి దింపింది.ఇదే స్థానం నుండి పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ నియోజకవర్గం నుండి పార్టీ ఎవరిని బరిలోకి దింపినా కూడ భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ పార్టీ నాయకులను ఆదేశించారు.