టాయ్ లెట్ కి మించిన క్రిములు దిండులోనే.. ఎలా క్లీన్ చేయాలో తెలుసా?
మీ దిండు, బెడ్ షీట్, బెడ్ పై బ్యాక్టీరియా, జెర్మ్స్, లాంటివి మిలియన్ల కొద్దీ ఉంటాయి. అందుకే.. వాటిని రెగ్యులర్ గా శుభ్రం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా దిండ్లను ఎలా శుభ్రం చేయాలో చూద్దాం…
ఈరోజుల్లో దాదాపు అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. పగలంతా కష్టపడుతూనే ఉంటారు. అలాంటివారికి రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. ముఖ్యంగా బాగా అలసిపోయినప్పుడు బెడ్ మీద పడుకోగానే నిద్రపట్టేస్తూ ఉంటుంది. కానీ.. మీరు పడకున్న మంచం, తలకింద దిండు టాయ్ లెట్ కంటే ఎక్కువ మురికి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చదివింది నిజమే. మీ దిండు, బెడ్ షీట్, బెడ్ పై బ్యాక్టీరియా, జెర్మ్స్, లాంటివి మిలియన్ల కొద్దీ ఉంటాయి. అందుకే.. వాటిని రెగ్యులర్ గా శుభ్రం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా దిండ్లను ఎలా శుభ్రం చేయాలో చూద్దాం…
pillow
బెడ్ షీట్ లేకుండా పడుకోవడం..
చాలా మందికి బెడ్ మీద బెడ్ షీట్ వేసుకనే అలవాటు ఉండదు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే.. బెడ్ మీద బ్యాక్టీరియా మరింత ఎక్కువగా ఉంటుంది. బెడ్ షీట్ లేకుండా పడుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా మనకు చర్మ సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ పొరపాటు చేయకూడదు.
ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. టాయిలెట్ సీట్ల కంటే దిండ్లు, రగ్గులు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. ఇటీవలి అధ్యయనంలో 4 వారాల బెడ్షీట్లు ,పిల్లోకేసులలో 1 కోటికి పైగా బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. అదేవిధంగా, 3 వారాల బెడ్షీట్లో 9 మిలియన్ బ్యాక్టీరియా ఉండవచ్చు, 2 వారాల బెడ్షీట్లో 50 మిలియన్ బ్యాక్టీరియా ఉండవచ్చు. 1 వారపు బెడ్షీట్లో 45 మిలియన్ బ్యాక్టీరియా ఉండవచ్చు. అంటే మీ బెడ్షీట్లు ,దిండ్లు పాతబడిన కొద్దీ వాటిపై బ్యాక్టీరియా సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభిస్తుంది.
దిండు మీద మురికి
మీ దిండు మీ పిల్లోకేసుల కంటే మురికిగా ఉంటుంది. ఎందుకంటే మన జుట్టు, ముఖం, డెడ్ స్కిన్ దిండుతో నేరుగా తాకడం వల్ల దిండుపై చెమట మరియు ధూళి పేరుకుపోతాయి. '4 వారాల పాటు ఉపయోగించే ఒక దిండులో 12 మిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది, అయితే 1 వారానికి ఉపయోగించే దిండులో 5 మిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది.
pillow position
మరి వీటిని ఎలా శుభ్రం చేయాలంటే…
మంచం మీద ఉంచిన దిండు క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. తలపై నూనె పేరుకుపోవడం వల్ల, దిండ్లు క్రమంగా మురికిగా ఉంటాయి.వాటిని శుభ్రం చేయడం చాలా కష్టంగా మారుతుంది, ఎందుకంటే వాటిని కడగడానికి చాలా శ్రమ పడుతుంది. మీ ఇంట్లో ఉంచిన దిండ్లు మురికిగా, దుర్వాసన రావడం ప్రారంభిస్తాయి.
దిండ్లు శుభ్రం చేయడానికి, దిండులను బేకింగ్ సోడాతో విరివిగా చిలకరించే ముందు పిల్లోకేసులు, కవర్లు లేదా ప్రొటెక్టర్లను తీసివేయండి. రెండు వైపులా కప్పబడి ఉండేలా చూసుకోండి.
తదుపరి దశ వినెగార్ ద్రావణంలో బేకింగ్ సోడాను చల్లుకోవడం. దీన్ని చేయడానికి, స్ప్రే బాటిల్లో సమాన భాగాలుగా నీరు ,వైట్ వెనిగర్ కలపండి.ఈ రెండూ కలిపిన లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల.. దిండ్లు శుభ్రపరడమే కాదు.. దుర్వాసన కూడా పోతుంది. కనీసం 30 నిమిషాల పాటు అయినా ఈ ద్రావణంలో ఉంచాలి. తర్వాత.. ఎండలో కనీసం 8 గంటలు బాగా ఎండనివ్వాలి.