అయోధ్యకు సీతాదేవి శాపం..? బీజేపీ ఓటమికి ఇది కూడా కారణమా..?
అక్కడి ప్రజలను సీతా మాత శపించడం ఏంటి..? దానికీ బీజేపీ ఓటమి కి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే.. ఈ కథ తెలుసుకోవాల్సిందే.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. నిజానికి అక్కడ రామ మందిరం ఏర్పాటు చేసింది బీజేపీ ప్రభుత్వమే. ఎన్నో ఏళ్ల నాటి కలను ఈ ప్రభుత్వం నిజం చేసింది. దీంతో.. అక్కడ బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో.. అయోధ్య ప్రజలను దేశ ప్రజలను విమర్శిస్తున్నారు. రామ మందిరం ఏర్పాటు చేశారనే కృతజ్నత కూడా లేకుండా ప్రవర్తించారని..దేశ ద్రోహులు అంటూ విమర్శించినవారు కూడా ఉన్నారు. అయితే.. అయోధ్య ప్రజలకు తల్లి సీతా మాత గతంలో శాపం ఇచ్చిందట. దాని వల్లే ఇదంతా జరిగింది అనే టాక్ వినపడుతోంది.
రాముడి జన్మస్థలం అయోధ్య. అంటే సీతా మాతకు అత్తారిల్లు. అక్కడి ప్రజలు సీతామాతను కూడా తల్లిలానే భావిస్తారు. కానీ.. అక్కడి ప్రజలను సీతా మాత శపించడం ఏంటి..? దానికీ బీజేపీ ఓటమి కి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే.. ఈ కథ తెలుసుకోవాల్సిందే.
Sita Navami 2024
త్రేతాయుగం ముగిసిన తర్వాత అయోధ్య క్షీణించడం ప్రారంభమైంది. అయోధ్యలో వింత నిర్జనమై, నిశ్శబ్దం అలుముకుంది. ప్రతిచోటా దాడులు జరిగాయి, అయోధ్యలోని దేవాలయాలు ధ్వంసమయ్యాయి. రాముడి జన్మస్థలం అయినప్పటికీ ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు రాలేదు. అయోధ్య ఇంతటి దుస్థితికి సీత మాత శాపమే కారణమని ప్రజలు అంటున్నారు.
Sita Navami 2024
అసలు సీత మాత అయోధ్యను ఎందుకు శపించింది?
వేదాలు , పురాణాలలో పేర్కొన్నట్లుగా, రావణుడిని చంపిన తరువాత రాముడు తన వనవాసాన్ని ముగించుకుని సీతతో అయోధ్యకు తిరిగి వచ్చిన సమయం. ఓ వైపు రాముడు రాక సందర్భంగా నెయ్యి దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటే మరోవైపు సీతపై అయోధ్య వాసులు అనుమానం వ్యక్తం చేస్తూ నోటికి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు.
sita navmi 2024 03
సీతాదేవి చాలా కాలం రావణాసురుడి చెంతన ఉండటంతో.. ఆమె పవిత్రతపై అయోధ్యవాసులు అనుమానం వ్యక్తం చేశారు. ఓ చాకలివాడు.. బహిరంగంగానే సీతాదేవి పవిత్రతను తప్పుపడుతూ మాట్లాడిన మాటలు రాముడి చెవిన పడతాయి. ఈ కారణంతోనే.. రాముడు.. నిండు గర్భిణి అయిన సీతను అడవులకు పంపిస్తారు.
Ayodhya is still facing the curse of Mother Sita
అయితే.. వారి కారణంగానే సీతామాత అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది అని తెలుసుకున్న సీతా దేవి కోపంతో ఊగిపోయిందట. నేను దుఃఖించినట్లే అయోధ్యవాసులు ఎప్పుడూ దుఃఖంతో ఉండాలని, భర్తకు దూరంగా అజ్ఞాతవాసంలో తిరిగి సుఖంగా ఉండలేనని సీత శపించిందంట. అలాగే అయోధ్య నిర్మానుష్యంగా ఉండాలని.. అక్కడి ప్రజలు పేదలుగా ఉండిపోతారని సీతాదేవి శాపం ఇచ్చినట్లు పౌరాణిక కథలు ఉన్నాయి.
సీతామాత శాపం ఫలితంగా, రాముడి చివరి వారసుడు రఘువంశ చివరి రాజు బృహద్బల్ మహాభారత యుద్ధంలో మరణించాడు. ఆ తర్వాత అయోధ్య నగరం నిర్మానుష్యంగా మారిందని చెబుతారు. సీతా దేవి శాపం కారణంగానే.. అయోధ్య నగరం ఎప్పటికీ అభివృద్ధి చెందదు అని, ఎప్పుడూ ఏదో ఒక లోపంతో బాధపడుతూ ఉంటుందని అనుకుంటూ ఉంటారట. ఇప్పుడు.. తిరిగి అయోధ్యలో రామ మందిరం నిర్మించినా.. అక్కడి ప్రజలు శాపం కారణంగా సంతోషంగా లేకపోవడంతోనే.. బీజేపీ కి ఓటు వేయలేదు అని పలువురు అంటున్నారు.