తినడానికి ముందు కాళ్లు, చేతులు, ముఖాన్ని ఎందుకు కడుక్కోవాలంటారో తెలుసా?
పెద్దలు ఖచ్చితంగా తినడానికి ముందు కాళ్లను, చేతులను, ముఖాన్ని ఖచ్చితంగా కడుగుతుంటారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనకున్న కారణమేంటో తెలుసా?
hand washing
తినే ముందు కాళ్లు, చేతులు, ముఖాన్ని కడుక్కునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఇది కేవలం చేతులకు, కాళ్లకు పట్టిన బ్యాక్టీరియాను తొలగించడం, పరిశుభ్రతను పాటించడమే కాదు.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తినేముందు ఈ అలవాటు ఉండటం వల్ల మీ శరీరంలోని అంతర్గత అవయవాలు ఉత్తేజితమవుతాయి. ఆయుర్వేదంలో.. ఈ అలవాటును జీర్ణ ప్రక్రియను ముఖ్యమైందిగా భావిస్తారు. అలాగే దీనిని 'డైజెస్టివ్ ఫైర్' అంటారు.
ఇది మన శరీర శక్తిని చూపిస్తుంది. ఇది తిన్నది సాఫీగా జీర్ణం కావడానికి, ఆహారం నుంచి పోషణను గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ అలవాటు మనకు మానసిక ప్రశాంతతను కూడా కలిస్తుంది.
ధార్మిక, సాంస్కృతిక కోణంలో చూసుకున్నట్టైతే తనడానికి ముందు కాళ్లను, చేతులను, ముఖాన్ని కడుక్కోవడం అంటే భక్తిశ్రద్ధలతో ఆహారాన్ని తీసుకోవడమని అర్థం. ఇది ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్న సంప్రదాయం కూడా. ఈ అలవాటు మన ఆరోగ్యం గురించి మనకు ఎంతో అవగాహనను కలిగిస్తుంది.
అందుకే తినడానికి ముందు చేతులను, కాళ్లను, ముఖాన్ని కడుక్కునే అలవాటు కేవలం పరిశుభ్రతను మాత్రమే కాదు.. మన మొత్తం ఆరోగ్యం, సాంస్కృతిక గుర్తింపును కూడా ప్రతిబింబిస్తుంది. అసలు ఈ అలవాటు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం..
కూల్ లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన నీళ్లతో కాళ్లు, చేతులు, ముఖాన్ని కడగడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేతులు, కాళ్లపై నీళ్లు పోసినప్పుడు అవి కొంచెం చల్లగా అవుతాయి.
ఇది మన శరీరం దాని ప్రధాన ఉష్ణోగ్రతను ఉదరంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. అందుకే మన కాళ్లను, చేతులను, ముఖాన్ని చల్లగా చేయడం వల్ల జీర్ణక్రియ మంటను పెంచుతుంది. ఇది మనం తిన్నది సులువుగా జీర్ణం అవుతుంది.
ఆరోగ్యశాస్త్రం
ఇలా తినడానికి ముందు కాళ్లను, చేతులను కడగడం వల్ల చేతులకు, కాళ్లకు ఉన్న దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. మీకు తెలుసా? రోజంతా అటూ ఇటూ తిరగడం వల్ల మన ముఖానికి, కాళ్లకు, చేతులకు ఎన్నో రకాల బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి పట్టువకుంటాయి.
ముఖం, కాళ్లు చేతులు కడుక్కోకుండా ఇలాగే తింటే ఇవి మన నోట్లోకి వెళ్లి మనల్ని ఆరోగ్యం బారిన పడేస్తాయి. అందుకే తినడానికి ముందు పరిశుభ్రతను పాటించడం ముఖ్యమంటారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఈ అలవాటు కేవలం పరిశుభ్రత మాత్రమే కాదు.. ఇది మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కూల్ వాటర్ తో చేతులను, కాళ్లను, ముఖాన్ని కడగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం అవుతుంది.
ఇది జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. జీర్ణ మంట మనం తిన్నదాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అలాగే మంచి పోషణను అందిస్తుంది.
మంచి మానసిక ఆరోగ్యం
తినడానికి ముందు కాళ్లను,చేతులను, ముఖాన్ని కడగడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. స్వచ్ఛమైన మనస్సు, శరీరంతో తింటే భావోద్వేగ, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.