ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు వీటిని తింటే మంచిది
ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఊబకాయుల్లోనే కనిపిస్తుంది. అంతేకాదు డయాబెటీస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను ఫేస్ చేస్తున్న వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
fatty liver
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలెయం ఒకటి. పిత్తాన్ని ఉత్పత్తి చేయడం నుంచి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కోసం అవసరమైన పోషకాలను అందించడం వరకు కాలేయం అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. దీని పనితీరులో ఏదైనా తేడా వస్తే.. మనకు ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఫ్యాటీ లివర్ ఒకటి. ఈ వ్యాధిలో కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. మితిమీరి ఆల్కహాల్ ను తాగడం, ఊబకాయం, మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత ఈ సమస్య రావడానికి ఇతర కారణాలు.
ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఊబకాయుల్లోనే కనిపిస్తుంది. అయితే మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులతో బాధపడేవారు కూడా ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొవ్వు కాలేయ సమస్యతో బాధపడేవారికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆహారాలను రోజూ తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
wheatgrass juice
వీట్ గ్రాస్ జ్యూస్
మీ శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి, కాలెయ పనితీరు మెరుగ్గా ఉండటానికి వీట్ గ్రాస్ జ్యూస్ మీకు సహాయపడుతుంది. దీన్ని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీట్ గ్రాస్ జ్యూస్ వివిధ రకాల చర్మ సమస్యల నుంచి బయటపడటంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
సోరియాసిస్, తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. వీట్ గ్రాస్ లో ఉండే అమైనో ఆమ్లాలు, ఎంజైమ్ లు హానికరమైన వ్యాధికారక క్రిముల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. ఈ జ్యూస్ లోని పోషకాలు శరీర కణాలను బలపరుస్తాయి.
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దీన్ని రోజూ తాగడం వల్ల కాలెయ పనితీరు బాగుంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిలను పెంచుతుంది. శరీర మంటను తగ్గిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ లో బీటాలైన్స్ అని పిలువబడే నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేయంలో ఆక్సీకరణ నష్టం, మంటను తగ్గించడానికి, విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.
వాల్ నట్స్
వాల్ నట్స్ లో ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటుగా పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి వాల్ నట్స్ ఎంతో సహాయపడతాయి. ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇవి మీకు సహాయపడతాయి. 55 కంటే తక్కువ జిఐ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు.