గర్భిణులు మొదటి నెల నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
మొదటి నెల నుంచే పోషకాహారం తీసుకుంటే కడుపులో పిండం ఎదుగుదల బాగుంటుంది. ఇందుకోసం ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలుండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి
ప్రెగ్నెంట్ అన్న శుభవార్త కుటుంబాన్నంతా ఆనందంగా చేస్తుంది. అయితే ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి వీరు ఆరోగ్యం, ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. హెల్తీ ఫుడ్స్ ను మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా మొదటి నెల నుంచే పోషకాహారం తీసుకోవాలి. అప్పుడే పిండం ఎదుగుదల, ఆరోగ్యం బాగుంటాయి.
ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. మొదటినెల గర్భంతో ఉన్నవారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు, పాల ఉత్పత్తులు
పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం , విటమిన్ డి, మంచి కొవ్వులు, ఫోలిక్ యాసిడ్స్, ప్రోటీన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని గర్భిణులు తీసుకోవడం వల్ల కడుపులో పిండం ఎదుగుదల బాగుంటుంది.
గుడ్లు
అలాగే గుడ్ల ద్వారా గర్భిణులకు విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ బి పుష్కలంగా అందుతాయి.
ఆకు కూరలు, కూరగాయలు
గర్భిణులు మొదటి నెల నుంచి ఆకు కూరలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా బచ్చలి కూర, Moringa లన తరచుగా తింటూ ఉండాలి. వీటితో పాటుగా అవొకాడోలు, బీన్స్, నారింజ, బఠాణీలు, నిమ్మకాయలను కూడా తినొచ్చు. వీటిలో ఫోలిక్ యాసిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది బిడ్డ వెన్నెముక, మెదడు ఎదుగుదలకు చాలా అవసరం.
పండ్లు
యాపిల్స్, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, స్ట్రాబెర్రీలు, జామ పండ్లను గర్బిణులు పక్కగా తినాలి. వీటి ద్వారా శిశువుకు అవసరమైన ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
గింజలు
పండ్లు, కూరగాయల మాదిరిగాలనే గింజలను, తృణధాన్యాలను వీరు తప్పనిసరిగా తినాలి. తృణధాన్యాల్లో, గింజల్లో కార్భోహైడ్రేట్లు, ఖనిజాలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి బిడ్డ ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి.
మాంసం, చేపలు
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక మాంసం ద్వారా గర్బిణులకు ఖనిజాలు, విటమిన్లు అందుతాయి.