సీలింగ్ ఫ్యాన్ ను ఎలా శుభ్రం చేయాలి?
సీలింగ్ ఫ్యాన్ లకు దుమ్ము, దూళి బాగా అంటుకుంటుంటాయి. కొన్ని రోజుల్లో నల్లగా కనిపిస్తాయి. వీటిని ఎలా క్లీన్ చేయాలో చాలా మందికి తెలియదు. వీటిని శుభ్రం చేయడానికి చాలా సేపు తిప్పలు పడుతుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో సీలింగ్ ఫ్యాన్ ను క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మన ఇంటినే కాదు ఇంట్లో ఉన్న వస్తువులను అంటే.. అల్మారా, ఫ్రిజ్, సోఫా లేదా మంచం వంటి వాటిని కూడా శుభ్రం చేయడం చాలా చాలా ముఖ్యం. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ను కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే దీనికి కూడా బైటి నుంచి వచ్చే దుమ్ము, దూళి, బూజు అంటుకుంటాయి. దీనివల్ల ఫ్యాన్ లు నల్లగా, దుమ్ము దుమ్ముగా కనిపిస్తాయి. కానీ వీటిని మాత్రం ఏ సంవత్సరానికో.. ఏ రెండు మూడేండ్లో క్లీన్ చేస్తుంటాం. అందులోనూ ఇవి ఎత్తులో ఉండటం వల్ల చాలా మంది వీటిని క్లీన్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఇవి మన ఇంటి అందాన్ని పాడుచేస్తాయి. అలాగే ఇంటికొచ్చిన వారు కూడా నీట్ నెస్ లేదని వెక్కిరిస్తారు. అందుకే సీలింగ్ ఫ్యాన్ కు అంటుకున్న దుమ్మును, దుళిని ఎలా నిమిషాల్లో క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బేకింగ్ పౌడర్
బేకింగ్ పౌడర్ ను ఫుడ్ లో మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇది ఫుడ్ టేస్ట్ ను బాగా పెంచుతుంది. అంతేకాదు దీన్ని క్లీనింగ్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు తెలుసా? అవును దీన్ని బాత్రూమ్ నుంచి గదిని క్లీన్ చేయడం వరకు ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. బేకింగ్ పౌడర్ తో కూడా మీరు నల్లని ఫ్యాన్ ను నిమిషాల్లో తెల్లగా తలతలా మెరిసేలా చేయొచ్చు. ఇందుకోసం మీరు ముందుగా 1 గిన్నెలో వెనిగర్, 1 టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి కలపండి. వెనిగర్ కు బదులుగా మీరు నిమ్మకాయను కూడా ఉపయోగించొచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ ను ఫ్యాన్ రెక్కలపై అప్లై చేసి 5-7 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తడి కాటన్ గుడ్డతో రేకులను బాగా శుభ్రం చేయండి.
సూచన
ఈ పేస్ట్ ను అస్సలు ఫ్యాన్ మీద ఉంచకూడదు. ఎందుకంటే ఇది ఫ్యాన్ రెక్కల రంగును దెబ్బతీస్తుంది. ఎందుకంటే వెనిగర్, నిమ్మకాయలో ఆమ్లం ఉంటుంది. ఇది రంగు పాలిపోయేతా చేస్తుంది.
ఆలివ్ ఆయిల్ వాడండి
ఫ్యాన్ రంగు పాడవకుండా ఉండటానికి మీరు మీరు ఫ్యాన్ రెక్కలను ఒకసారి బట్టతో తుడవాలి. ఆ తర్వాత దానిపై ఆలివ్ ఆయిల్ అప్లై చేయండి. కొన్ని నిమిషాల తర్వాత కాటన్ క్లాత్ తో రెక్కలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ నూనె కూడా ఫ్యాన్ తలతల మెరిసేలా చేస్తుంది.
సూచన
ఫ్యాన్ ను శుభ్రం చేయడానికి నూనెను ఎక్కువగా వాడకూడదు.
డిటర్జెంట్, బేకింగ్ సోడా
మీరు ఇంట్లో బేకింగ్ సోడా, డిటర్జెంట్ ను ఉపయోగించి కూడా ఫ్యాన్ ను క్లీన్ చేయొచ్చు. దీనికోసం బేకింగ్ సోడా, డిటర్జెంట్ ను కలపి ఒక ద్రావణాన్ని తయారు చేయండి. ఆ తర్వాత ఫ్యాన్ ను ఒక కాటన్ క్లాత్ లేడా స్పాంజ్ తో రుద్ది శుభ్రం చేయండి.
సూచన
ఫ్యాన్ ని శుభ్రం చేసేటప్పుడు దాని మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే నీళ్లను ఎక్కువగా ఉపయోగించకండి.