ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. మనస్సుపై, శరీరంపై ఇంత ప్రభావం పడుతుందా?
భాగస్వామితో గొడవలు, వివిధ కారణాల వల్ల చాలా మంది సెక్స్ కు దూరంగా ఉంటుంటారు. కానీ ఇలా ఎక్కువ రోజులు సెక్స్ కు దూరంగా ఉంటే.. ఎన్నో మానసిక, శారీరక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెక్స్ మీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పెళ్లైన ప్రతి భార్యభర్తల మధ్య ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇదే వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రేమను పెంచుతుంది. ముఖ్యంగా ఇరువురికి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. తరచుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో వ్యాధుల ముప్పు తప్పుతుంది. నిజానికి ఈ సెక్స్ పని గంటలు, మానసిక స్థితి, వయస్సు, పరిసరాలు లేదా మీ సంబంధాల స్థితి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్టేతే.. మీరు ఇంటికి వెళ్లిన తర్వాత అలసిపోయి నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మీ భాగస్వామితో సెక్స్ లో పాల్గొనకపోవచ్చు. అలాగే మీ బంధం బలంగా లేకపోతే సెక్స్ చేయాలని మీకు అనిపించకపోవచ్చు. కొంతమంది ఆడవారు వయసు పెరిగే కొద్దీ సెక్స్ కు దూరంగా ఉండాలనుకుంటారు. నిజానికి సెక్స్ కు దూరంగా ఉంటే ఎన్నో మానసిక, శారీరక సమస్యలొస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సెక్స్ లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల మీరు చిటికి మాటికి చిరాకు పడుతుంటారు. అలాగే మీ మానసిక స్థితి కూడా మారుతుంది. సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల కలిగే ప్రభావాలలో ఇవి కొన్ని మాత్రమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెక్స్ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లను మెదడు కోల్పోవడం వల్ల దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు వస్తాయి. మీపై మీకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండొచ్చు కూడా.
సెక్స్ చేయకపోవడం వల్ల యోని కణజాలం సన్నగా మారుతుంది
మీ శరీరంలో తక్కువ ఈస్ట్రోజెన్ ఉన్నప్పుడు యోని గోడలు సన్నబడటం ప్రారంభమవుతాయి. ఇది ఎక్కువగా రుతువిరతి సమయంలోనే జరుగుతుంది. యోని కణజాలం సన్నబడటాన్ని యోని క్షీణత అని కూడా అంటారు. అయితే సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల మీ యోని క్షీణత మరింత దిగజారుతుంది. దీనివల్ల శరీరంలో అసౌకర్యం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Image: Getty Images
రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది
చలికాలంలో జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో ఎలాంటి జబ్బులు రాకూడదన్నా.. జబ్బులు తొందరగా తగ్గాలన్నా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఇందుకోసం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మీరు సెక్స్ లో కూడా పాల్గొనొచ్చు. ఒకవేళ మీరు సెక్స్ చేయకపోతే మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పెన్సిల్వేనియాలోని విల్కెస్-బార్రే విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం వారానికి ఒకటి లేదా రెండుసార్లు శృంగారంలో పాల్గొన్నవారికి ఇమ్యునోగ్లోబులిన్ ఎ లో 30 శాతం పెరుగుదల ఉందని కనుగొన్నారు. ఇన్ఫెక్షన్-పోరాట ప్రోటీన్ అయిన ఇమ్యునోగ్లోబులిన్ ఎ సాధారణ జలుబుతో ముడిపడి ఉన్న వైరస్ ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
Image: Getty Images
ఆలస్యంగా భావప్రాప్తిని పొందుతారు
చాలా కాలం గ్యాప్ తర్వాత ఆడవారు సెక్స్ లో పాల్గొన్నప్పుడు చాలా సేపటి తర్వాతే భావప్రాప్తిని పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం తర్వాత మహిళలకు సెక్స్ బాధాకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సెక్స్ లేకపోవడం వల్ల వాస్కులర్ ప్రసరణ జరగదు. అలాగే యోని పొడిమారుతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు సంవత్సరాల తరబడి సెక్స్ కు దూరంగా ఉంటారు. కొంతమంది ఒక వారం కూడా శృంగారం లేకుండా ఉండలేకపోతుంటారు. కానీ మీ లైఫ్ బాగుండాలంటే సెక్స్ మోతాదులోనే ఉండాలని నిపుణులు సలహానిస్తున్నారు.