రాత్రి పడుకునే ముందు వాకింగ్ చేస్తే ఏమౌతుంది..?
నిద్రపోవడానికి ముందు వాకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది..? ఆరోగ్యానికి మంచిదా లేక.. ఇబ్బందుులు తెచ్చి పెడుతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
Benefits Of Walking
దాదాపు అందరూ వాకింగ్ అంటే.. ఉదయమే చేస్తారు. లేదు అంటే... సాయంత్రం చేస్తారు. కానీ... రాత్రి పడుకునే ముందు వాకింగ్ చేయవచ్చా..? నిజానికి వాకింగ్ చేయడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాదు.. బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా సహాయపడుతుంది. మరి.. నిద్రపోవడానికి ముందు వాకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది..? ఆరోగ్యానికి మంచిదా లేక.. ఇబ్బందుులు తెచ్చి పెడుతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
exercise
చాలా మంది డిన్నర్ అంటే.. పడుకునే ముందు మాత్రమే చేయాలి అనుకుంటారు. కానీ.. మనం రాత్రి భోజనానికీ.. పడుకోవడానికి కనీసం మూడు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అయితే.. డిన్నర్ చేసిన తర్వాత... పడుకోవడానికి ముందు.. వాకింగ్ చేయడం వల్ల.. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.
అంతేకాదు.. పడుకునేముందు వాకింగ్ చేయడం వల్ల మనసు రిలాక్స్ గా ఉంటుంది. మంచి నిద్ర కూడా వస్తుంది. నిద్రవేళకు అరగంట లేదా గంట ముందు నడవడం కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు దీన్ని మీ దినచర్యలో చేర్చుకోవాలి.
ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, రోజంతా అలసటను తొలగిస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
పడుకునే ముందు వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా ఉంచుతుంది. నిద్రపోయే ముందు నడవడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల గ్యాస్ , ఎసిడిటీ వస్తుంది. నడక దీనిని నివారించడానికి సహాయపడుతుంది.
నిద్రపోయే ముందు నడవడం వల్ల కండరాలు బలపడతాయి. కొందరికి ఆఫీస్ పనుల వల్ల పొద్దున్నే లేవడానికి లేదా సాయంత్రం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, నిద్రపోయే ముందు నడవడం ఈ వ్యక్తులకు మంచిది.
రాత్రి భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయకూడదు. కావాలంటే.. 1 లేదంటే రెండు గంటల తర్వాత నడవాలి. ఇక.. నడవడం మంచిది అన్నారు కదా.. అని చాలా స్పీడ్ గా నడవకూడదు. నార్మల్ స్పీడుతో కనీసం వెయ్యి అడుగులు వేస్తే చాలు. మొదట వెయ్యి అడుగులతో మొదలుపెట్టి.. తర్వాత కొన్ని రోజులకు పెంచుకుంటూ వెళ్లొచ్చు. చాలా కాజువల్ గా వాకింగ్ చేయాలి. అదో ఉద్యమంలా.. వ్యాయామంలా.. జాగింగ్ లా చేయకూడదు.