పళ్లు తోముకోకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?
చాలా మంది పళ్లు తోముకున్న తర్వాతే నీళ్లు, చాయ్ తాగుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఉదయం నిద్రలేచిన వెంటనే అంటే పళ్లు తోముకోకుండానే నీళ్లు తాగుతుంటారు. కానీ ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
పరిగడుపున నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లను తాగుతుంటారు. అంటే పళ్లు తోముకోకుండానే నీళ్లు తాగుతుంటారు. కానీ ఇలా తాగడం మంచిదా? కాదా? అని అస్సలు ఆలోచించరు. నిజానికి పరిగడుపున నీళ్లు తాగడం మంచిదే అయినా పళ్లు తోముకోకుండా నీళ్లు తాగడం మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు పళ్లు తోముకోకుండా నీళ్లను తాగితే వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దంత క్షయం
పళ్లు తోముకోకుండా నీళ్లు తాగితే దంతక్షయం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఇలా పళ్లు తోముకోకుండా నీళ్లు తాగితే దంతక్షయానికి దారితీసే ఆహార కణాలు, బ్యాక్టీరియాలు పళ్లలో దాక్కుండిపోతాయి. బ్రష్ చేసినా వీటిని తొలగించలే.
ఉదయం పూట పళ్లు తోముకోకుండా నీళ్లు తాగితే కణాలు, బ్యాక్టీరియాలు మన నోటిలో ముఖ్యంగా చేరుకోవడానికి కష్టమైన ప్రదేశాల్లో, దంతాల మధ్య ఉండిపోతాయి. దీనివల్ల భవిష్యత్తులో పళ్లపై ఫలకం ఏర్పడుతుంది. చివరికి ఇది కుహరాలకు దారితీస్తుంది. మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం పళ్లు తోముకోకుండా నీళ్లను తాగకూడదంటారు ఆరోగ్య నిపుణులు.
నోటి దుర్వాసన
పళ్లు తోముకోకుండా నీళ్లను తాగితే నోట్లో నుంచి దుర్వాసన మరింత ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మన నోట్లో మిగిలిన బ్యాక్టీరియా హాలిటోసిస్కు కారణమయ్యే దుర్వాసన కలిగిన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రతిరోజూ బ్రష్ చేయడం, ఫ్లోసింగ్ చేస్తే ఈ బ్యాక్టీరియా తొలగిపోతుంది. నోరు ఫ్రెష్ గా ఉంటుంది.
చిగుళ్ల వ్యాధి
పళ్లు సరిగ్గా తోమకపోయినా, పళ్లు తోముకోకుండా నీళ్లను తాగితే చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మన నోట్లో బ్యాక్టీరియా పెరిగితే అవి చిగుళ్లకు సోకి మంట కలుగుతుంది. దీనికి స్టార్టింగ్ లో చికిత్స చేయకపోతే చిగురువాపు లేదా పీరియాంటైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ చిగుళ్ల వ్యాధి మీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మీకు డయాబెటీస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దంతాలపై మరకలు
పళ్లు తోముకోకుండా మీరు పొద్దున్నే నీళ్లు తాగితే మీ దంతాలపై మరకలు, పసుపు పచ్చగా అయ్యే ఛాన్స్ ఉంది. మీకు తెలుసా? మీరు రోజులో తినే కొన్ని ఆహారాలు, పానీయాలు మీ దంతాలపై వాటి అవశేషాలను వదిలేస్తాయి. మీరు సరిగ్గా బ్రష్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా దంతాక్షయం సమస్య వస్తుంది.